Google New Quantum Chip: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గొప్ప ప్రగతిని సాధించింది. సరికొత్త క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించింది. 'విల్లో' క్వాంటమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ చిప్.. సాధారణ కంప్యూటర్లతో పోల్చితే మెరుపు వేగంతో పనిచేస్తుంది. ఈ మేరకు ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా అసలేంటీ క్వాంటమ్ చిప్? దీన్ని ఎక్కడ అభివృద్ధి చేశారు? వంటి వివరాలు మీకోసం.
ఏంటీ క్వాంటమ్ చిప్?: క్వాంటమ్ చిప్ అనేది ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ చిప్. ఇది క్వాంటమ్ మెకానిస్ సూత్రాలను అనుసరించి పనిచేస్తుంది. ఇది సాధారణ చిప్‌నకు కాస్త భిన్నంగా ఉంటుంది. దీనిలోని ప్రత్యేక సామర్థ్యంతో సాధారణ కంప్యూటర్ల కంటే చాలా వేగంగా సంక్లిష్ట గణనలను పూర్తిచేస్తుంది.
సాధారణ కంప్యూటర్లు బైనరీ భాష మీద ఆధారపడి పనిచేస్తాయి. అంటే ఇవి 0, 1 అనే రెండు సంకేతాలతో పనిచేస్తాయి. ఇందులో 0 అంటే విద్యుత్ (ఎలక్ట్రాన్ల) ప్రవాహం లేకపోవడం, 1 అంటే విద్యుత్ ప్రసారం ఉండటం. 0, 1ని కలిపి 'బిట్' అని పిలుస్తారు. ఈ యుగళ కోడ్‌లో 1 అనే అంకె రాయడానికి '001' అని రాయాల్సి ఉంటుంది. 2 అనే అంకె రాయాలంటే '0011' అని రాయాలి.
కంప్యూటర్‌లోని ట్రాన్సిస్టర్లు ఆగిపోతే 0 అని, ఆన్ అయితే 1 అని సంకేతం వస్తుంది. ప్రస్తుత కంప్యూటర్లు ఈ బైనరీ కోడ్‌లోనే సమాచారాన్ని నిల్వచేసి, ప్రాసెస్ చేస్తున్నాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్‌ను ఉపయోగిస్తాయి. క్యూబిట్ ఒకేసమయంలో 0గా, 1గా ఉంటుంది. అంటే ఏకకాలంలో ఆన్, ఆఫ్ స్థితిలో ఉండగలదు. దీన్ని సూపర్ పొజిషన్గా పిలుస్తారు.
క్వాంటమ్ కంప్యూటర్ ఈ సూపర్ పొజిషన్ సాయంతో అపార సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తుంది. ఇది భవిష్యత్తులో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. క్యూబిట్స్ వల్లే సాధారణ కంప్యూటర్ల కంటే వేగంగా ఇవి గణనలను పూర్తి చేయగలుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక గూగుల్ తన కొత్త 'విల్లో' క్వాంటమ్ చిప్‌లో 105 క్యూబిట్స్‌ను పొందుపరిచింది.
దీంతో ఈ చిప్ ఎంతటి క్లిష్టతరమైన గణాంక సమస్యలనైనా కేవలం ఐదే నిమిషాల్లోనే పరిష్కరించగలదు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లు ఇదే పని చేయాలంటే 10 సెప్టిలియన్ సంవత్సరాలు పడతాయని గూగుల్ తెలిపింది. 10 సెప్టిలియన్ సంవత్సరాలు అంటే '1' తర్వాత '25' సున్నాలు ఉండే సంఖ్య సంవత్సరాలు. అంటే ఈ విశ్వం ఆవిర్భావం అయిన సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుందని గూగుల్ తెలిపింది.
విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. బిలియన్ అంటే '1' పక్కన '9' సున్నాలు. దాని ప్రారంభ సంవత్సరాల్లో ఇది ఇప్పుడు కంటే పూర్తిగా భిన్నంగా కనిపించింది. దాదాపు 400,000 సంవత్సరాల పాటు మొత్తం విశ్వం అపారదర్శకంగా ఉంది. అంటే ఆ సమయంలో జరిగిన దేని గురించి మనకు ప్రత్యక్ష పరిశీలనలు లేవు.
దీన్ని ఎక్కడ అభివృద్ధి చేశారంటే?: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విల్లో క్వాంటమ్ చిప్‌ను 'ఎక్స్' వేదికగా ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ క్వాంటమ్ ల్యాబ్‌లో దీన్ని అభివృద్ధి చేసినట్లు గూగుల్ తెలిపింది. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఇది నిజంగా అద్భుతమైన ఆవిష్కారం అంటూ కొనియాడారు.
యాపిల్ యూజర్లకు గుడ్‌న్యూస్- పిచ్చెక్కించే ఫీచర్లతో iOS 18.2 అప్డేట్!
రెడ్మీ ట్రిపుల్ ధమాకా- ఒకేసారి మూడు కిర్రాక్ స్మార్ట్ఫోన్లు లాంఛ్- ధర ఎంతో తెలుసా?
మీరు మర్చిపోయినా వాట్సాప్ మర్చిపోదుగా.. ఈ ఫీచర్ ద్వారా మీకు గుర్తుచేస్తూనే ఉంటుంది!