Google Pixel 8a Phone Lunch : టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి వచ్చేసింది. ఈ కొత్త ఫోన్ గూగుల్ టెన్సార్ జీ3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో తరహాలోనే జెమిని, బెస్ట్ టేక్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్‌ను అందుబాటులోకి వచ్చేసింది.
గూగుల్ పిక్సెల్ 8ఏ ఫీచర్లు
Google Pixel 8a Features :
- డిస్ప్లే - 6.61 అంగుళాలు
- ప్రాసెసర్ - టెన్సార్ జీ3
- రిజల్యూషన్ - 1080 x 2400 పిక్సెల్స్
- ఓఎస్ - ఆండ్రాయిడ్ 14
- ర్యామ్ - 8జీబీ
- స్టోరేజ్ - 128 జీబీ, 256 జీబీ
- మెయిన్ కెమెరా - 64 MP + 13 MP అల్ట్రావైడ్ లెన్స్
- సెల్ఫీ కెమెరా - 13 MP
- బ్యాటరీ - 5000 mAh
- ఛార్జింగ్ సపోర్ట్ - 18W
- కనెక్టివిటీ - వైఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ
గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు అనవసర శబ్దాలను తొలగించేలా ఆడియో మ్యాజిక్ ఎరేజర్ కూడా ఉంది. 120Hz రీఫ్రెష్ రేటు, 2,000nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 అంగుళాల డిస్ప్లే ఉంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంది. అలాగే ఏడేళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ, ఫీచర్ డ్రాప్ అప్‌డేట్లు ఇవ్వనున్నారు.
Google Pixel 8a Color Variants : ఈ గూగుల్ పిక్సెల్ 8ఏ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎప్పటిలాగే అబ్సీడియన్, పోర్సిలిన్‌తో పాటు ఈసారి కొత్తగా అలో, బే రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది.
గూగుల్ పిక్సెల్ 8ఏ ధర
Google Pixel 8a Price :
- గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లు మే 14 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ముందస్తుగా ఆర్డర్ చేయొచ్చు.
- గూగుల్ పిక్సెల్ 8ఏ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,999గా ఉంది.
- మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 8ఏ 256జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ.59,999గా ఉంది.
- ముందుగా ఆర్డర్ చేసుకున్నవారు రూ.999కే పిక్సెల్ ఏ-సిరీస్ బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
- బ్యాంకు కార్డులపై రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
- కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై రూ.9,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు.