ETV Bharat / technology

ట్రాఫిక్ చలాన్ తప్పించుకోవాలా? గూగుల్​ మ్యాప్స్​లోని ఈ 2 ఫీచర్లను ఎనేబుల్ చేసుకోండి! - IPhone Google Maps Features

Google Maps Latest Features For IPhone Users : మీరు ఐఫోన్ యూజర్లా? అయితే మీకు గుడ్ న్యూస్​. గూగుల్ మ్యాప్స్​ కొత్తగా ఐఫోన్ యూజర్ల కోసం స్పీడోమీటర్, స్పీడ్​ లిమిట్స్ అనే రెండు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఎనేబుల్ చేసుకుంటే చాలు. ట్రాఫిక్​ చలాన్​ల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Google Maps Speed limits
Google Maps Speedometer (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 12:05 PM IST

Google Maps Latest Features For IPhone Users : మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో స్పీడ్ లిమిట్​ దాటి ట్రాఫిక్​ చలాన్​ కట్టే ఉంటారు. వాస్తవానికి ఇది ఆర్థికంగా చాలా ఇబ్బంది కలిగించే అంశం. అందుకే గూగుల్ మ్యాప్స్​ రహదారి భద్రతను పెంపొందించడం కోసం, అలాగే డ్రైవర్లకు అసిస్టెన్స్​ అందించడం కోసం స్పీడోమీటర్, స్పీడ్ లిమిట్స్ అనే రెండు ఫీచర్లను​ అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు 2019 మే నెల నుంచే ఈ రెండు ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ 2 ఫీచర్లను ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది​.

ఈ ఫీచర్లు ఎలా పని చేస్తాయి?
వాహనాన్ని నడిపేవారు తాము ఎంత వేగంతో ప్రయాణిస్తున్నామో తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్​లోని స్పీడోమీటర్​ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే దీనిని కేవలం సమాచారం కోసమే వాడాలని, కొన్ని సందర్భాల్లో వాహనం వాస్తవ వేగానికి, స్పీడోమీటర్​ చూపించే రీడింగ్​కు మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని గూగుల్ స్పష్టం చేసింది. కనుక నిజమైన వేగాన్ని నిర్ధరణ చేసుకోవడానికి, వాహనంలోని స్పీడోమీటర్​నే ఉపయోగించాలని సూచించింది.

స్పీడ్​ లిమిట్ ఫీచర్ అనేది మీరు పరిమితికి మించి, వేగంగా బండిని నడుపుతూ ఉంటే, మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా నిర్దిష్ట వేగ పరిమితిని దాటితే, ఇది స్పీడ్ ఇండికేటర్ రంగులను మారుస్తుంది.

ఈ విధంగా స్పీడోమీటర్, స్పీడ్​ లిమిట్స్​ ఫీచర్లు డ్రైవర్లకు రియల్​-టైమ్​లో స్పీడ్​లిమిట్ సమాచారాన్ని అందిస్తాయి. కనుక నిర్దిష్ట వేగానికి మించి వాహనం నడపకుండా డ్రైవర్లు జాగ్రత్త పడడానికి వీలవుతుంది.

ట్రాఫిక్ రూల్స్ మారుతూ ఉంటాయ్​!
దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి ట్రాఫిక్ రూల్స్ మారుతుంటాయి. ఎలా అంటే? హైవేస్​లో కాస్త వేగంగా వాహనం నడపవచ్చు. కానీ లోకల్​ రోడ్లపై వేగం తగ్గించుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొన్ని సార్లు హైవే నుంచి లోకల్ రోడ్లపైకి వచ్చినప్పుడు స్పీడ్​ లిమిట్ విషయాన్ని డ్రైవర్లు గమనించలేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో అనవసరంగా చలాన్ కట్టాల్సి వస్తుంది. దీన్ని నివారించేందుకు గూగుల్ మ్యాప్స్​లోని స్పీడోమీటర్​ ఫీచర్​ను ఎనేబుల్ చేసుకోవడం మంచిది.

ప్రాంతీయ నిబంధనలతోనూ సమస్య!
నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో తాత్కాలికంగా స్పీడ్​ లిమిట్స్​ విధిస్తూ ఉంటారు. ముఖ్యంగా సదరు ప్రాంతంలో పనిచేసే కార్మికులకు, అలాగే డ్రైవర్లకు భద్రత కల్పించడం కోసం ఇలాంటి టెంపరరీ స్పీడ్ లిమిట్స్​ను అమలు చేస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయాల్లో, వాతావరణం బాగాలేని సందర్భాల్లో డ్రైవర్లు ఇలాంటి విషయాలను గమనించలేకపోవచ్చు. అందుకే గూగుల్ మ్యాప్స్​ స్పీడోమీటర్ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్పీడో మీటర్​ డ్రైవర్లకు నావిగేషన్ అసిస్టెన్స్​ను అందిస్తుంది. అంటే రియల్​టైమ్​లో సదరు ప్రాంతంలో ఎంత వేగంతో వాహనం నడపాలో డ్రైవర్లకు తెలియజేస్తుంది. ఇది వరకు ఈ ఫీచర్​ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ దీనిని ఇప్పుడు ఐఫోన్ యూజర్లు కూడా ఉపయోగించుకోవచ్చు.

స్పీడోమీటర్ ఫీచర్​ వాడడం ఎలా?
How To Enable Speedometer In Google Maps :

  • ముందుగా మీ ఐఫోన్​ లేదా ఆండ్రాయిడ్​ ఫోన్​లోని గూగుల్ మ్యాప్స్​ యాప్​ను ఓపెన్ చేయండి.
  • మీ ప్రొఫైల్ పిక్చర్​ లేదా ఇనీషియల్​ అకౌంట్​ సర్కిల్​పై క్లిక్ చేయండి.
  • డ్రాప్​డౌన్​ మెనూలో మీకు Settings ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • అక్కడ మీకు Navigation Settings ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • వెంటనే మీకు Driving Options కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, మీకు వివిధ డ్రైవింగ్ ఫీచర్లు కనిపిస్తాయి.
  • ఈ డ్రైవింగ్ ఆప్షన్లలోనే Speedometer, Speed Limits ఫీచర్లు కనిపిస్తాయి. వాటిని మీరు Turn on చేసుకోవాలి. అంతే సింపుల్!

ఇకపై మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన ప్రతిసారీ, మీ GPS స్పీడ్ ఎంత ఉందో​ తెలుస్తుంది. అంతేకాదు మీరు స్పీడ్ లిమిట్​ దాటి వాహనాన్ని నడుపుతూ ఉంటే, మీకు అలర్ట్ కూడా వస్తుంది. దీనితో మీరు పరిమిత వేగంతో వాహనాన్ని నడపడానికి వీలవుతుంది.

ఇంతకీ స్పీడోమీటర్ ఎలా పనిచేస్తుంది?
How Speedometer Works : గూగుల్ మ్యాప్స్​లోని​ స్పీడోమీటర్​ ఫీచర్ పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)​ సాయంతో పనిచేస్తుంది. కనుక ఇది స్ట్రీట్ వ్యూ ఇమేజరీ (రహదారి చిత్రాలు) సహా, థర్డ్​-పార్టీ చిత్రాలను పరిశీలించి, జీపీఎస్ సమాచారాన్ని విశ్లేషించి, సదరు ప్రాంతంలో వాహన వేగం (స్పీడ్​ లిమిట్) ఎంత ఉండాలనేది డ్రైవర్లకు తెలియజేస్తుంది. అంతేకాదు వాహనం వెళ్లాల్సిన ప్రాంతంలో ట్రాఫిక్ ఎలా ఉంది? అక్కడ ఎంత వేగంతో ప్రయాణించాలి? అనే విషయాలను కూడా తెలియజేస్తుంది.

వర్షాకాలంలో ఉపయోగపడే టాప్​-10 కార్​ & బైక్ డ్రైవింగ్​ టిప్స్ ఇవే! - Monsoon Driving Tips

బాగా ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? ఈ 'సక్సెస్ ఫార్ములా' మీ కోసమే! - How To Become Rich

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.