ETV Bharat / technology

అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్- ఇకపై ఈజీగా 'లెర్న్ అబౌట్' ఎనీథింగ్! - GOOGLE LEARN ABOUT AI TOOL

నిత్య విద్యార్థుల కోసం గూగుల్ కొత్త ఫీచర్!- ఇది ఎలా ఉపయోగడుతుందంటే?

Google Learn About AI Tool
Google Learn About AI Tool (Google)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 14, 2024, 1:42 PM IST

Google Learn About AI Tool: టెక్ దిగ్గజం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్​ను పరిచయం చేసింది. 'లెర్న్ అబౌట్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ యూజర్లకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఈ విద్యా ప్రపంచంలో విద్యార్థులు, విద్యావేత్తలకు కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్​ను అందించడమే లక్ష్యంగా గూగుల్ దీన్ని తీసుకొచ్చింది.

ఈ లెర్న్ అబౌట్ ఫీచర్​ను గూగుల్ LearnLM AI మోడల్ ద్వారా తీసుకొచ్చారు. ఇది వినియోగదారులు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సహాయపడుతుంది. అంటే ఇది యూజర్లకు ఓ టీచర్​ మాదిరిగా గైడ్ చేస్తుంది. ఇది ప్రతి అంశంపై మరింత సమగ్రమైన అవగాహనను అందించేందుకు సంబంధిత ఆర్టికల్స్, వీడియోస్​ను కూడా అందిస్తుంది. ఈ లెర్న్ అబౌట్ ఫీచర్ అకాడమిక్ రీసెర్చ్​కు బాగా ఉపయోగపడుతుంది.

ఇది ChatGPT, Gemini వంటి AI చాట్‌బాట్‌ల మాదిరిగా కాకుండా కాస్త డిఫరెంట్​గా పనిచేస్తుంది. ఈ లెర్న్ అబౌట్ ఫీచర్ విశ్వసనీయ ఎడ్యుకేషనల్ ప్లాట్​ఫారమ్​ల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరించి అందిస్తుంది. ఉదాహరణకు గూగుల్ జెమిని ఏఐ ఫీచర్​ను సాధారణంగా ఏవైనా ప్రశ్నలు అడిగితే అది వికీపీడియా నుంచి డేటాను సేకరించి అందిస్తుంది. అయితే లెర్న్ ఎబౌట్ ఫీచర్​ మాత్రం యూనివర్స్ సైజ్​ గురించి అడిగితే అది ఎడ్యూకేషనల్ సైట్స్, ఫిజిక్స్ ఫోరమ్​ల నుంచి సమాచారాన్ని సేకరించి అందిస్తుందని ది వెర్జ్ నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్​లో ఉన్న ఈ లెర్న్ అబౌట్ టూల్ వెబ్​లో ట్రయల్ ఫీచర్‌గా అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియాలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ఫీచర్ టెస్టింగ్ పూర్తయిన తర్వాత దీన్ని గ్లోబల్​గా తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా జెమిని లైవ్ ప్లాట్‌ఫారమ్​లో డాక్యుమెంట్ అవగాహన సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై పని చేస్తున్నట్లు గూగుల్ ఇటీవల వెల్లడించింది. ఈ ఏఐ జెమిని లైవ్‌ ఫీచర్​ ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయాన్ని హిందీలోనూ వినియోగించుకోవచ్చని తెలిపింది. అలాగే తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలోనే అందుబాటులోకి రానుందని గూగుల్ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇన్​స్టాలో ఏఐ ప్రొఫైల్ పిక్చర్ జనరేషన్ ఫీచర్!- ఇది ఎలా పనిచేస్తుందంటే?

త్వరలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్- టీజర్ చూస్తే మతిపోతోందిగా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.