Flipkart Big Billion Days Sale: పండగ సీజన్ వేళ ఆఫర్ల ఫెస్టివల్‌కు తెరలేచింది. ఫ్లిప్‌కార్ట్ ఏటా నిర్వహించే 'బిగ్ బిలియన్ డేస్' సేల్స్ తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలు కానుందని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీంతో ఈసారి సేల్స్‌లో కస్టమర్లు భారీ ఆఫర్స్‌ను పొందుతారు. త్వరలో ఈ ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా HDFC క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులకు డిస్కౌంట్ అందిచనున్నారు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ HDFC బ్యాంక్ ఫర్ సేల్ 2024తో చేతులు కలిపింది. ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ UPI చెల్లింపులతో రూ.50 తగ్గింపు, నో-కాస్ట్ EMI వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం పొందొచ్చని పేర్కొంది.
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు లభించనున్నాయి. యాపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ వంటి అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. యాపిల్ 16 సిరీస్ ఇటీవలే లాంచ్ అవ్వగా పాత ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో సమాచారం ప్రకారం వీటితో పాటు Vivo T3X 5G, Realme 12X 5G, Oppo K12X 5G, Realme P1 5G, Vivo T3 Lite 5G, Moto G64 5G, CMF ఫోన్ 1 బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ చౌకగా లభించనున్నాయి. అయితే ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభించేదీ త్వరలో వెల్లడించనున్నారు.
స్మార్ట్ ఫోన్లతో పాటు టీవీలు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, గృహోపకరణాలపైనా ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున సీజనల్ ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ నియమించుకుంటోంది. ఈ సంఖ్య లక్ష వరకు ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
రేపే మార్కెట్లోకి మెర్సిడెస్ లగ్జరీ కారు- ఫస్ట్ లుక్ చూశారా? - Mercedes Benz EQS SUV