ETV Bharat / technology

ఈ ఫోన్లలో గేమ్స్ ఆడితే.. ఆ మజానే వేరు.. నాన్​స్టాప్ గేమింగ్​కు బెస్ట్ మొబైల్స్ ఇవే! - TOP GAMING PHONES UNDER 20000

ఈ ఫోన్లతో మీ గేమింగ్ ఎక్స్​పీరియన్స్ వేరే లెవల్.. మార్కెట్లో రూ.20వేల లోపు టాప్ ఇవే..!

Best Gaming Phones under Rs 20,000
Best Gaming Phones under Rs 20,000 (Photo Credit- Samsung, Motorola, Nothing Phone, iQOO)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 9, 2024, 3:55 PM IST

Best Budget Gaming Smartphones: ప్రస్తుతం ఎక్కువమంది మొబైల్‌లో గేమ్స్‌ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా మంచి గేమింగ్ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నారా? అది కూడా రూ.20వేల లోపు బడ్జెట్ ధరలో ఉండాలా? అయితే మీకోమే ఈ స్టోరీ.

సాధారణంగా మెరుగైన గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ కోసం స్మార్ట్​ఫోన్​లో బిగ్ బ్యాటరీ, పవర్​ఫుల్ ప్రాసెసర్​తో పాటు గేమింగ్ సమయంలో మెరుగైన వీక్షణ అనుభవం కోసం మంచి డిస్​ప్లే అవసరం. అప్పుడే మీరు మంచి గేమింగ్ అనుభూతిని పొందగలుగుతారు.

ఇలాంటి అన్ని ఫీచర్లతో మార్కెట్లో మోటరోలా, శాంసంగ్, ఐకూ, నథింగ్ వంటి కంపెనీల నుంచి బెస్ట్ గేమింగ్ స్మార్ట్​ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి గేమింగ్ కోసం మాత్రమే కాకుండా మీ రోజువారీ పనులకు కూడా బాగా ఉపయోగపడతాయి.

బడ్జెట్ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్​ గేమింగ్ ఫోన్లు ఇవే:

Moto Edge 50 Neo: గేమర్ల కోసం 'మోటో ఎడ్జ్ 50 నియో' స్మార్ట్​ఫోన్ బాగుంటుంది. ఫ్లిప్​కార్ట్​లో ఈ మొబైల్ రూ.21,999 ధరకు ఆఫర్​లో అందుబాటులో ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంక్​ కార్డులపై ​రూ. 2,000 డిస్కౌంట్‌ కూడా ఉంది. దీంతో ఈ కార్డుల ద్వారా దీన్ని రూ. 19,999లకే కొనుగోలు చేయొచ్చు.

  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్
  • కెమెరా: ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంది.
  • మెయిన్ కెమెరా: 50MP మెయిన్
  • అల్ట్రా వైడ్ కెమెరా: 13 MP
  • టెలిఫోటో కెమెరా: 10MP

Samsung Galaxy A15 5G: 'శాంసంగ్ గెలాక్సీ A15 5G' అనేది బడ్జెట్- ఫ్రెండ్లీ గేమింగ్ స్మార్ట్​ఫోన్ కోసం చూసున్నవారికి బెస్ట్ ఆప్షన్. ఇది అమెజాన్​లో రూ. 14,998 ధరతో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ సాధారణ గేమింగ్​ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తుంది.

  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్
  • కెమెరా సెటప్: ఇది కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది.
  • మెయిన్ కెమెరా: 50MP
  • అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌: 5MP కెమెరా
  • మాక్రో లెన్స్​: 2MP

iQOO Z9: 'ఐకూ Z9' స్మార్ట్​ఫోన్ కూడా గేమర్లకు బాగా ఉపయోగపడుతుంది. అమెజాన్‌లో ఇది రూ. 18,498 ధరలో అందుబాటులో ఉంది.

  • ప్రాసెసర్: ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్​ను కలిగి ఉంది. దీన్ని 2.8GHz క్లాక్ స్పీడ్‌తో TSMC 2nd Gen 4nm ప్రాసెస్​తో రూపొందించారు.
  • కెమెరా సెటప్: దీని కెమెరా సెటప్‌లో 4K వీడియో రికార్డింగ్, సూపర్ నైట్ మోడ్, 2x పోర్ట్రెయిట్ జూమ్, షార్ప్ ఫోటోలు, వీడియోల కోసం 50MP UHD మోడ్ సపోర్ట్ చేసే 50MP Sony IMX882 OIS సెన్సార్ ఉన్నాయి.

Nothing Phone 2a: 'నథింగ్ ఫోన్ 2a' ఫోన్​ ధర రూ. 23,999. అయితే ఫ్లిప్​కార్ట్​లో దీన్ని రూ. 3,000 కార్డ్ డిస్కౌంట్‌తో రూ. 20,999కి కొనుగోలు చేయొచ్చు.

  • ప్రాసెసర్: మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రో
  • డిస్​ప్లే: 6.7-అంగుళాల ఫుల్ HD+
  • బ్యాటరీ: 5000mAh
  • కెమెరా సెటప్: ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో రెండు 50MP కెమెరాలు, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

Redmi Note 13 Pro: అమెజాన్‌లో 'రెడ్‌మి నోట్ 13 ప్రో' ధర రూ. 18,250గా ట్యాగ్ అయి ఉంది.

  • ప్రాసెసర్: స్నాప్​డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్
  • డిస్​ప్లే: 6.67-అంగుళాల AMOLED
  • రిజల్యూషన్: 1.5K
  • రిఫ్రెష్​ రేట్: 120Hz
  • డాల్బీ విజన్‌
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌

మహింద్రా కొత్త 'BE 6e' పేరును మార్చింది.. కారణం ఏంటో తెలుసా?

మార్కెట్లోకి మరో లగ్జరీ ఈవీ.. సింగిల్ ఛార్జ్​తో 473కి.మీ రేంజ్..!

మీరు మర్చిపోయినా వాట్సాప్​ మర్చిపోదుగా.. ఈ ఫీచర్​ ద్వారా మీకు గుర్తుచేస్తూనే ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.