ETV Bharat / technology

మీకు ఈ-వెహికల్ ఉందా? ఛార్జింగ్ టైమ్​లో ఈ టిప్స్ ఫాలో అవ్వండి- లేకుంటే! - EV charging safety guidelines - EV CHARGING SAFETY GUIDELINES

Ev Charging Safety Guidelines : ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. అక్కడక్కడ వాటితో ముడిపడిన ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. బ్యాటరీ కావచ్చు.. ఛార్జింగ్ కావచ్చు.. సమస్య ఏ రకమైనదైనా సరే.. అది మనకు ఎదురుకాకూడదంటే అప్రమత్తత అవసరం. అవగాహన అత్యవసరం. అటువంటి ఉపయోగకర సమాచారంతో కథనమిది.

EV Charging Safety Guidelines
EV Charging Safety Guidelines
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 6:41 AM IST

Ev Charging Safety Guidelines : ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. చాలామంది పెట్రోలు, డీజిల్ వాహనాలకు గుడ్ బై చెప్పేసి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోతున్నారు. ఇది మంచి పరిణామమే. దీనివల్ల ప్రత్యేకించి పర్యావరణానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కాలుష్య భూతం ఎఫెక్టు తగ్గిపోతుంది. అయితే ఈవీలను మెయింటైన్ చేయడం పెద్ద ఛాలెంజ్. ఈక్రమంలో వాహనదారులు కనీస జాగ్రత్త చర్యలను పాటించాలి. లేదంటే ప్రమాదాల ముప్పు పొంచి ఉంటుంది.

తాజాగా బుధవారం ఉదయం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) పట్టణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఎలక్ట్రిక్ వెహికల్‌కు ఛార్జింగ్ పెట్టగా, ఛార్జర్ పేలిపోయింది. దీంతో చెలరేగిన మంటలు ఇంట్లోకి వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్నిప్రమాదం వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇంజిన్లలో అడ్డదిడ్డమైన మార్పులతో అవస్థలు
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ జోరుగా జరుగుతున్నాయి సరే వాటిని ఎలా మెయింటైన్ చేయాలనే దానిపై అవగాహన కార్యక్రమాలు మాత్రం అస్సలు జరగడం లేదు. ఆయా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తోంది. కానీ వాహనదారులకు ఈవీల నిర్వహణపై అవగాహన కల్పించాలని వాటికి నిర్దేశించడం లేదు. ఈవీ స్కూటర్ల వేగం చాలా తక్కువ. అయితే కొంతమంది ఆ స్కూటర్ల ఇంజిన్లలో అడ్డదిడ్డంగా మార్పులు చేయించి వేగాన్ని పెంచుకుంటున్నారు. దీనివల్ల ఇంజిన్‌పై పరిమితికి మించిన భారం పడి బ్యాటరీలు బాగా హీటెక్కి పేలిపోతున్నాయి. ఇలాంటి కొన్ని ఘటనలు జరగడం వల్ల 2022 సంవత్సరంలో అలర్ట్ అయిన కేంద్ర సర్కారు, చట్టవిరుద్ధమైన మార్పులు చేసిన ఈవీలను గుర్తించడానికి స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించింది. అడ్డదిడ్డంగా మార్పులు, చేర్పులు చేసిన కొన్ని ఈవీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాటరీ ఛార్జింగ్‌- తస్మాత్ జాగ్రత్త

  • ఈవీల బ్యాటరీలను ఛార్జ్ చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్త చర్యలను పాటించాలనే దానిపై నిపుణుల సూచనలను ఓసారి పరిశీలిద్దాం!
  • ASI 156 కింద ఆమోదం పొందిన బ్యాటరీలను మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడాలి.
  • బ్యాటరీలను వాటితో వచ్చిన ఛార్జర్‌‌తోనే ఛార్జ్ చేయాలి. మరొక బ్యాటరీ ఛార్జర్‌ను ఇందుకోసం వాడొద్దు.
  • ఒక కంపెనీ బ్యాటరీకి మరో కంపెనీ ఛార్జర్‌ను వాడొద్దు.
  • బ్యాటరీలోని లిథియం అయాన్ మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. దానిపై ఎండ పడకుండా చూస్తే బెటర్.
  • బ్యాటరీని ఓవర్‌గా ఛార్జ్ చేయొద్దు. ఒకవేళ చేసినా అలర్ట్ చేసేందుకు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

ఈ- స్కూటర్స్, ఈ-కార్స్ ఛార్జింగ్- కొన్ని టిప్స్

  • ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా ఛార్జింగ్ చేసేటప్పుడు కంపెనీ నుంచి వచ్చిన వైర్, అడాప్టర్‌లనే వాడాలి.
  • బైక్‌ను రాత్రిపూట ఛార్జ్ చేయొద్దు. ఓవర్‌చార్జింగ్ కారణంగా బ్యాటరీ హీటెక్కి పేలిపోయే రిస్క్ ఉంటుంది.
  • ఓవర్ ఛార్జ్ చేస్తే బ్యాటరీ పనితీరు కూడా దెబ్బతింటుంది.
  • ఈవీలను ఛార్జింగ్ చేసేటప్పుడు పవర్ ఎక్స్‌టెన్షన్‌లను ఉపయోగించొద్దు. బైక్‌ను నేరుగా స్విచ్ నుంచి ఛార్జ్ చేయాలి.
  • ఛార్జింగ్ చేసేటప్పుడు వీలైతే స్మోక్ డిటెక్టర్‌లను ఇన్‌స్టాల్ చేయండి.
  • పాత లిథియం-ఐరన్ బ్యాటరీలను ఇంట్లో ఉంచొద్దు.
  • ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని 40 శాతం కంటే తక్కువ, 80 శాతం కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు.
  • బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయ్యే వరకు వేచి ఉండకండి.
  • స్లో ఛార్జింగ్ ఛార్జర్‌లతోనే బ్యాటరీని ఛార్జ్ చేయాలి. చాలా వేగంగా ఛార్జ్ అయ్యే ఛార్జర్‌లను వాడకపోవడమే సేఫ్.
  • ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కొన్ని ఈ-కార్లను 80 శాతం వరకు ఛార్జ్ చేస్తే అలారం సౌండ్ మోగుతుంది. 90 శాతం ఛార్జ్ తర్వాత ఛార్జింగ్ దానంతటదే ఆగిపోతుంది.

పబ్లిక్ కేబుళ్లతో ఫోన్ ఛార్జింగ్ యమా డేంజర్​- ఈ టిప్స్ పాటించకపోతే మీ డేటా అంతా చోరీ! - Public USB Phone Charging problems

ఎప్పుడైనా, ఎక్కడైనా సిగ్నల్స్ లేకుండానే మెసేజ్​- ఆండ్రాయిడ్ 15 న్యూ ఫీచర్ - Android 15 Google Messages Feature

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.