Elon Musk To Bring X Long Form Videos : ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) యూజర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో యూట్యూబ్ మాదిరిగా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లోనూ లాంగ్-ఫార్మ్ వీడియో స్ట్రీమింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనితో యూజర్లు తమ స్మార్ట్ టీవీలో ఈ లాంగ్ వీడియోలను చూడగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
బిగ్ స్క్రీన్‌లో చూడవచ్చు!
ఎక్స్ కంపెనీ ఇప్పటికే అమెజాన్, శాంసంగ్ స్మార్ట్ టీవీల కోసం ఒక టీవీ యాప్‌ను తీసుకువస్తోంది. త్వరలోనే అది లాంఛ్ కానుంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే, 'మీ స్మార్ట్టీవీలోనే నేరుగా ఎక్స్ లాంగ్ వీడియోలను చూడడానికి వీలవుతుంది' అని ఎలాన్ మస్క్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఎక్స్
ఎలాన్ మస్క్ ఎక్స్‌ను వీడియో ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఇదే జరిగితే యూట్యూబ్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని, ఎక్స్ యూజర్లు, నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెన్సార్ లేకుండా!
'యూట్యూబ్‌కు పోటీగా ఎక్స్ లాంగ్ వీడియో స్ట్రీమింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు వాక్ స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. అది కూడా ఎలాంటి సెన్సార్షిఫ్ లేకుండా. ఎందుకంటే వాక్ స్వాతంత్ర్యం అనేది మానవుల హక్కు' అని ఎక్స్ ప్లాట్ఫామ్లో ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు.
ఎక్స్ ఆర్టికల్స్
ఎలాన్ మస్క్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇటీవలే 'ఆర్టికల్స్' అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. దీనిని ఉపయోగించి ప్రీమియం యూజర్లు పెద్ద పెద్ద వ్యాసాలను ట్విట్టర్లో పోస్ట్ చేయవచ్చు. శీర్షికలు, ఉపశీర్షికలు పెట్టవచ్చు. టెక్ట్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేయవచ్చు. టెక్ట్స్ విషయంలో బోల్డ్, ఇటాలిక్, స్టైక్త్రూ చేయవచ్చు. సంఖ్యలు, బుల్లెట్ పాయింట్లు పెట్టుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మీ టెక్ట్స్‌ను మీకు నచ్చినట్లుగా ఫార్మాట్ చేయవచ్చు.
గేమింగ్, పాడ్‌కాస్ట్‌లు కూడా
ఎలాన్ మస్క్ ఎక్స్ ప్లాట్ఫామ్లో వీడియో గేమ్స్, పాడ్‌కాస్ట్‌లు కూడా అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు.
ఎక్స్ ఏఐ చాట్‌బోట్ - గ్రోక్
ఎలాన్ మస్క్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్‌తో చాలా ప్రమాదం ఉందని లోగడ వ్యాఖ్యానించారు. కానీ తరువాత గ్రోక్ అనే ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసి, యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఇది ఇతర ఏఐ టూల్స్ లాంటిది కాదు. ఈ ఏఐ చాట్‌బోట్ అసాధారణమైన, రెచ్చగొట్టే ప్రశ్నలకు సైతం చమత్కారమైన సమాధానాలు ఇస్తుంది. కొన్నిసార్లు తీవ్రమైన హెచ్చరికలు కూడా చేస్తోంది.
స్పై కెమెరాలు ఉన్నాయని అనుమానంగా ఉందా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండిలా!
స్పామ్ కాల్స్/ మెసేజ్‌లు వస్తున్నాయా? 'చక్షు' పోర్టల్‌లో ఫిర్యాదు చేయండిలా!