ETV Bharat / technology

గూగుల్‌కు పోటీగా OpenAI సెర్చింజిన్‌ - ఇది ఎలా పని చేస్తుందంటే? - ChatGPT AI Powered Search Engine

ChatGPT AI Powered Search Engine : గూగుల్‌కు పోటీగా ఓపెన్‌ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్‌ను తీసుకొచ్చింది. అదే 'సెర్చ్​జీపీటీ'. ఇది కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది.

SearchGPT is a prototype of new AI search features
ChatGPT (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 3:18 PM IST

ChatGPT AI Powered Search Engine : చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ (OPenAI) కొత్తగా ఓ సెర్చ్ ఇంజిన్​ను తీసుకువచ్చింది. ఇది పూర్తిగా కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​)తో పనిచేస్తుంది. ఇది గూగుల్​కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల టాక్.

ఇంత వరకు ఏఐ ఆధారిత చాట్​బాట్ సేవలను అందిస్తున్న ఓపెన్​ ఏఐ, ఇప్పుడు గూగుల్‌ గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ‘సెర్చ్‌జీపీటీ’ పేరుతో కొత్త సెర్చింజిన్‌ను ప్రకటించింది. ఈ ఏఐ ఆధారిత సెర్చింజిన్‌ ఇంటర్నెట్‌లోని రియల్‌టైమ్‌ డేటాను యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రోటోటైప్‌ స్టేజ్‌లోనే ఉందని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. పరిమిత గ్రూప్‌, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని తెలిపింది.

గూగుల్​దే గుత్తాధిపత్యం - కానీ
సెర్చింజిన్‌ల విషయంలో సుమారు 91% వాటా గూగుల్‌ కంపెనీదే. అయితే 'ఓపెన్ఏఐ' కంపెనీ తమదైన ఏఐ ఆధారిత సెర్చింజిన్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించిన వెంటనే, స్టాక్ మార్కెట్లో గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ షేర్లు 3 శాతం వరకు నష్టపోయాయి. ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఈ ఏఐ ఆధారిత సెర్చింజిన్‌ - గూగుల్‌, బింగ్‌ వంటి సాధారణ సెర్చింజిన్ల లాగా కాకుండా, లేటెస్ట్ సమాచారాన్ని ఇస్తూనే, సంబంధిత లింక్‌లను కూడా జోడిస్తుంది. ఉదాహరణకు మీరు మ్యూజిక్‌ ఫెస్ట్‌ల గురించి సమాచారం అడిగితే, ఆ వివరాలను ఇవ్వడమే కాకుండా, ఆ కంటెంట్‌ను ఎక్కడి నుంచి తీసుకున్నది కూడా తెలియజేస్తుంది. యూజర్లు అడిగే అనుబంధ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తుంది. అయితే ఈ సెర్చ్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికి, కంపెనీ దీన్ని తొలుత కొంత మంది పబ్లిషర్లకు అందించనుంది.

అంతా 'ఏఐ' బాటలోనే!
చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన సెర్చింజిన్‌ కంపెనీలన్నీ తమ సెర్చ్‌ఇంజిన్లలో 'ఏఐ'ని భాగస్వామ్యం చేయడంలో తలమునకలై ఉన్నాయి. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్‌కు చెందిన 'బింగ్‌' - ఓపెన్‌ఏఐ టెక్నాలజీని వాడుకుంటోంది. గూగుల్‌ సైతం సెర్చ్‌ రిజల్ట్స్‌లో ఏఐ సాయంతో సమ్మరీని అందిస్తోంది.

అయితే సెర్చింజిన్‌ విభాగంలోకి ఓపెన్‌ఏఐ ప్రవేశించిన నేపథ్యంలో, ఇకపై అది కచ్చితంగా గూగుల్‌, బింగ్‌లకు పోటీగా మారొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ షేర్లు కుంగడం గమనార్హం.

వాట్సాప్​ 'ఇమేజ్ జనరేషన్ టూల్​'తో - మిమ్మల్ని మీరు సూపర్​ స్టార్​గా మార్చుకోండి! - WhatsApp AI Image Generation Tool

'ట్రాఫిక్' కష్టాలకు చెక్‌ - గూగుల్‌ మ్యాప్స్‌లో 6 సరికొత్త ఫీచర్లు! - Google Maps New Features

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.