Chakshu portal Launch : టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'డీఐపీ' (DIP), 'చక్షు' (Chakshu) అనే రెండు సరికొత్త పోర్టల్‌లను ప్రారంభించింది. ఈ రెండూ టెలికమ్యునికేషన్ విభాగం (DoT) ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
DIP Portal : డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం (డీఐపీ) అనేది ఒక బ్యాకెండ్ మాడ్యూల్. ఇది బ్యాంకులు, ఫోన్‌పే వంటి యూపీఐ పేమెంట్స్ యాప్‌లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా కంపెనీలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తుంది. అలాగే డాక్యుమెంట్ ఇష్యూయింగ్ అథారిటీస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య కూడా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసి సైబర్ క్రైమ్స్‌ను అరికట్టేందుకు సహకరిస్తుంది.
ఉదాహరణకు ఒక ఫోన్ నంబర్‌ను సైబర్ ఫ్రాడ్ కోసం ఉపయోగిస్తున్నారని అనుకుందాం. అప్పుడు 'డీఐపీ అనేది పైన పేర్కొన్న అన్ని డిపార్ట్మెంట్లకు ఈ విషయాన్ని ఒకేసారి పంపిస్తుంది. దీనితో సదరు ఫోన్ నంబర్‌ను అన్ని ప్లాట్‌ఫామ్‌లు ఒకేసారి బ్లాక్ చేయడానికి వీలవుతుంది.
అయితే ఈ డీఐపీ పోర్టల్ అనేది సాధారణ పౌరులకు అందుబాటులో ఉండదు. కానీ 'చక్షు' యాప్‌లో సాధారణ పౌరులు చేసే ఫిర్యాదులను బ్యాకెండ్‌లో సమీక్షిస్తుంది.
Chakshu Portal : సైబర్ మోసాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 'చక్షు' (హిందీలో కన్ను అని అర్థం) అనే పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలు తమకు వచ్చిన అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసెజ్‌లు గురించి ఇందులో రిపోర్ట్ చేయవచ్చు.
చక్షు పోర్టల్‌లో ఇలా ఫిర్యాదు చేసిన వెంటనే, మీ ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించమని చెబుతుంది. మీరు మీ ఫోన్ నంబర్‌ను కచ్చితంగా చెప్పి, ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీనితో మీ రిపోర్ట్‌ను తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. మీకు తగిన సాయం చేస్తుంది.
మనీ రిటర్న్
కొన్ని సార్లు పొరపాటున పౌరుల బ్యాంకు ఖాతాలు స్తంభించిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఖాతాదారులు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్బీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌తో 'చక్షు' పోర్టల్ సమన్వయం చేస్తుంది. మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులను మీరు తిరిగి పొందడానికి వీలు కల్పిస్తుంది.
సంచార్ సాథి పోర్టల్ : కేంద్ర ప్రభుత్వం 2023 మే నెలలో సంచార్ సాథి పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిలో ఇంకా చాలా సబ్-పోర్టల్స్ ఉన్నాయి. దొంగతనానికి గురైన ఫోన్‌ను బ్లాక్ చేయడానికి, సాధారణ కేవైసీతో ఎన్ని మొబైల్ ఫోన్లు కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవడానికి వీటిని యూజర్లు ఉపయోగిస్తూ ఉన్నారు.
మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం సూపర్ యాప్ - స్కాన్ చేస్తే చాలు - సమాధానం వచ్చేస్తుంది!
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ - ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతంటే?