ETV Bharat / technology

యాపిల్‌ యూజర్లకు 'హై-రిస్క్‌' అలర్ట్‌ - ఐఫోన్​, ఐపాడ్​ల్లో సెక్యూరిటీ లోపాలు! - HIGH RISK WARNING FOR IPHONE USERS - HIGH RISK WARNING FOR IPHONE USERS

Centre Issues High-Risk Warning For IPhone Users : యాపిల్ యూజర్లు తమ ఫోన్లను, ఐపాడ్​లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్‌-ఇన్‌ హెచ్చరించింది. యాపిల్​ కంపెనీకి చెందిన డివైజ్​ల్లో పలు సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, కనుక హ్యాకింగ్​కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.

IPhone CYBER FRAUD
Centre Issues High-Risk Warning For IPhone Users
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 5:01 PM IST

Centre Issues High-Risk Warning For IPhone Users : యాపిల్‌ యూజర్లకు కేంద్రం (హై-రిస్క్‌ అలర్ట్‌) భద్రతాపరమైన హెచ్చరికలు చేసింది. ఐఫోన్‌, మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, విజన్‌ ప్రో హెడ్‌ సెట్లలో పలు సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు తెలిపింది.

యాపిల్​ ప్రొడక్టుల్లో 'రిమోట్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌'కు సంబంధించి క్లిష్టమైన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ 'కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా' (CERT-In) గుర్తించింది.

హ్యాకింగ్ జరిగే అవకాశం!
యాపిల్ ప్రొడక్టుల్లోని ఈ సెక్యూరిటీ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేసే అవకాశం ఉంది. అంటే మన డివైజ్‌లను రిమోట్‌గా ఆపరేట్‌ చేసే ముప్పు ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్​ హెచ్చరించింది. అందువల్ల యూజర్లు వెంటనే తమ డివైజ్​లను లేటెస్ట్‌ సెక్యూరిటీ వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.4.1, 16.7.7 కంటే ముందటి వెర్షన్లలో ఈ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయి. అలాగే సఫారీ 17.4.1, మ్యాక్‌ఓఎస్‌ వెంట్యురా 13.6.6, మ్యాక్‌ఓఎస్‌ సొనోమా 14.4.1, యాపిల్‌ విజన్‌ ఓఎస్‌ 1.1.1 కంటే ముందటి వెర్షన్లలోనూ ఈ భద్రతాపరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది.

అప్​డేట్ చేసుకోవాల్సిందే!
17.4.1 కంటే ముందటి ఓఎస్‌ను వినియోగించే ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐప్యాడ్‌ ప్రో 12.9, 10.5, 11 ఇంచ్‌, ఐప్యాడ్‌ ఎయిర్‌, ఐప్యాడ్‌ మినీ యూజర్లకు కూడా ఈ సెక్యూరిటీ ముప్పు ఉందని సెర్ట్‌-ఇన్‌ తమ అడ్వైజరీలో పేర్కొంది. ఇక 16.7.7 వెర్షన్‌ కంటే ముందు ఓఎస్‌లను వినియోగించే ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌, ఐఫోన్‌ ఎక్స్‌, ఐప్యాడ్‌ ఫిఫ్త్‌ జెనరేషన్‌, ఐప్యాడ్‌ ప్రో 9.7 యూజర్లు కూడా హ్యాకింగ్‌ బారిన పడే ప్రమాదముందని స్పష్టం చేసింది. కనుక యాపిల్ ప్రొడక్ట్స్ వాడే యూజర్లు అందరూ, తక్షణమే తమ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా యాపిల్‌ ఉత్పత్తులపై ఇలాంటి సెక్యూరిటీ అలర్ట్‌లు జారీ చేసిన విషయం తెలిసిందే!

మీ ​ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానంగా ఉందా? ఈ 'సీక్రెట్​ కోడ్స్​'​తో డివైజ్​ను ప్రొటెక్ట్​​ చేసుకోండిలా! - How To Check Phone Is Hacked Or Not

బెస్ట్ కెమెరా ఫోన్​ కొనాలా? రూ.20వేలు బడ్జెట్లోని టాప్​-6 మొబైల్స్ ఇవే! - Best Camera Phones Under 20000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.