ETV Bharat / technology

గూగుల్, యాపిల్​ కంపెనీలకు బిగ్ షాక్- సొంత ఓఎస్​పై నథింగ్ ఫోకస్

మరో ప్రయోగానికి సిద్ధమైన నథింగ్- సొంత ఆపరేటింగ్ సిస్టమ్​పై కసరత్తు

Nothing
Nothing (Nothing)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 3, 2024, 2:22 PM IST

Nothing Own Operating System: మొబైల్‌ మోడళ్లలో సంచలనం సృష్టించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ నథింగ్‌ ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. గూగుల్, యాపిల్ సంస్థలకు బిగ్ షాక్ ఇస్తూ తాను కూడా సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్​ను అభివృద్ధి చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సొంతంగా ఓఎస్‌ను రూపొందించనున్నట్లు లండన్​కు చెందిన ఈ కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని నథింగ్ ఫౌండర్, వన్ ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పై స్వయంగా వెల్లడించారు.

టెక్‌క్రంచ్‌ కంపెనీ నిర్వహించిన ఓ ఈవెంట్​లో దీనిపై కార్ల్​ పై మాట్లాడారు. ఐఓఎస్​ కంటే మెరుగ్గా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్​కు ధీటుగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్​ రూపొందించేందుకు కావాల్సిన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రస్తుత ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లను కూడా యాడ్ చేస్తామన్నారు. సొంత ఓఎస్ ద్వారా యూజర్లకు మెరుగైన ఎక్స్​పీరియన్స్ అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. తమకు నిధుల కొరత ఉన్నప్పటికీ కంపెనీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్​పై పనిచేయగలదని కార్ల్​ పై తెలిపారు.

గత కొంతకాలంగా స్మార్ట్​ఫోన్ల మార్కెట్​లో గూగుల్ ఆండ్రాయిడ్​ హవా ఎంతగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు స్మార్ట్​ఫోన్లు అన్నీ ఇదే ఆపరేటింగ్ సిస్టమ్​పై పనిచేస్తుంటాయి. అలాగే యాపిల్ కూడా సొంతగా ఐఓఎస్​ అనే తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్​ను రూపొందించికుంది. ప్రస్తుతం మార్కెట్లో వీటి ఆధిపత్యానికి చెప్ పెట్టేందుకు నథింగ్ కంపెనీ రెడీ అయింది.

అయితే గూగుల్, యాపిల్ సంస్థలకు కాకుండా చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్‌ తయారీ కంపెనీ హువావే కూడా తన సొంత ఓఎస్​ను తయారు చేసింది. హార్మీనీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హువావే యాప్‌ గ్యాలరీ నుంచి పాపులర్ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు ఇదే జాబితాలోకి నథింగ్ కంపెనీ కూడా వచ్చి చేరేందుకు సన్నాహాలు చేస్తోంది.

షేర్​ 'లవ్' ఆన్ స్టేటస్- వాట్సాప్​లో ఈ క్రేజీ ఫీచర్ గమనించారా?

ఒబెన్ ఎలక్ట్రిక్ నుంచి మరో కొత్త బైక్- టీజర్ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.