Best Laptops Under 50000 : ప్రస్తుత కాలంలో విద్యార్థులకు, ఉద్యోగులకు ల్యాప్‌టాప్ తప్పనిసరి అయిపోయింది. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైన తర్వాత ల్యాప్‌టాప్‌ల వినియోగం మరింత పెరిగిపోయింది. ఇంజినీరింగ్, సాంకేతిక కోర్సులు చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్ తప్పనిసరి. ఇక ఆన్లైన్ గేమ్స్ ఆడేవారికి హెవీ గ్రాఫిక్స్‌ను సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్ ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.50వేల బడ్జెట్లో వీరందరికీ ఉపయోగపడే, మంచి పెర్ఫార్మెన్స్, స్పీడ్, పోర్టబిలిటీ ఉన్న టాప్-6 ల్యాప్టాప్స్ గురించి తెలుసుకుందాం.
1. HP Laptop 15s, AMD Ryzen 5 5500U : ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్ప్లేతో వస్తుంది. 8జీబీ డీడీఆర్4 ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజీతో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.36,990 వరకు ఉంటుంది. లో లెవల్ గ్రాఫిక్స్‌తో గేమ్స్ అడేవాళ్లకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు, మల్టీ టాస్కింగ్ చేసేవారికి అయితే ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.
- ప్రాసెసర్ : ఏఎమ్‌డీ రైజెన్ 5 5500యూ
- డిస్ప్లే : 15.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ
- ర్యామ్ : 8జీబీ డీడీఆర్4
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- గ్రాఫిక్స్ : ఏఎమ్‌డీ రేడియన్ గ్రాఫిక్స్
2. HP Laptop 15s, 12th Gen Intel Core i3 : ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ ధర రూ.37,990 వరకు ఉంటుంది. డ్యూయల్ స్పీకర్లతో ఈ ల్యాప్‌టాప్ లభిస్తుంది. ఇది చాలా తేలికగా, రొబస్ట్ బిల్ట్ క్వాలిటీ కలిగి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మల్టీ టాస్కింగ్ కోసం ఈ ల్యాప్‌టాప్ సరిగ్గా సరిపోతుంది.
- ప్రాసెసర్ : 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3-1215యూ
- డిస్ప్లే : 15.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ
- ర్యామ్ : 8జీబీ డీడీఆర్4
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- గ్రాఫిక్స్ : ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్
- కీబోర్డ్ : బ్యాక్లిట్
- వెయిట్ : థిన్ అండ్ లైట్
3. Dell 14 Thin & Light Laptop : ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఈ డెల్ ల్యాప్‌టాప్ బాగా ఉపయోగపడుతుంది. దీని బరువు కేవలం 1.48 కేజీలు. కనుక దీనిని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.46,990 వరకు ఉంటుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 ఉంటుంది. అంతేకాదు 15 నెలలపాటు McAfee సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.
- ప్రాసెసర్ : 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1235యూ
- డిస్ప్లే : 14 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ
- ర్యామ్ : 8జీబీ డీడీఆర్4
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- గ్రాఫిక్స్ : ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్
- కీబోర్డ్ : స్పిల్ రెసిస్టెంట్
- కలర్ : బ్లాక్
4. Lenovo IdeaPad : ఈ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్‌కు, వెబ్‌బ్రౌజింగ్‌కు చాలా బాగుంటుంది. కనుక విద్యార్థులు, ఉద్యోగులు దీనిపై ఓ లుక్కేయవచ్చు. దీనిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఆన్లైన్ గేమ్స్ ఆడేవారికి ఇలా చాలా బాగుంటుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.63 కేజీలు. దీని ధర రూ.35,490 వరకు ఉంటుంది.
- ప్రాసెసర్ : 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3
- డిస్ప్లే : 15.6 అంగుళాలు
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11
5. HP Laptop 15s, AMD Ryzen 3 5300U : ఈ ల్యాప్‌టాప్ విద్యార్థులు, ఉద్యోగులు, గేమర్స్ అందరికీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో ఉన్న 15.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. దీనిలో డ్యూయెల్ ఆడియో స్పీకర్లు ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.69 కేజీలు. దీని ధర రూ.29,990 వరకు ఉంటుంది.
- ప్రాసెసర్ : ఏమ్‌డీ రైజెన్ 3 5300యూ
- డిస్ప్లే : 15.6 అంగుళాలు
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- కలర్ : సిల్వర్
- ఓఎస్ : విండోస్ 11
6. Acer Aspire Lite, AMD Ryzen 5 5500U : ఈ ల్యాప్‌ట్యాప్ మల్టీ టాస్కింగ్ చేసేవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీని ధర రూ.33,000. కేవలం 1.59 కేజీల బరువున్న ఈ ల్యాప్‌టాప్‌ను చాలా సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
- ప్రాసెసర్ : ఏఎండీ రైజెన్ 5 5500యూ
- డిస్ప్లే : 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- కలర్ : స్టీల్ గ్రే
- ఓఎస్ : విండోస్ 11
- ఆడియో : డ్యూయల్ స్పీకర్స్
మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా? ఈ టిప్స్ ట్రై చేయండి! - How To Fix Phone Hanging Issue