ETV Bharat / technology

గూగుల్​లో బెస్ట్ రిజల్ట్స్​ రావాలా? ఈ టాప్-10 సెర్చ్ ట్రిక్స్​ మీ కోసమే! - Google Search Tips

Best Google Search Tricks : మీరు రోజు గూగుల్ వాడుతూ ఉంటారా? అప్పుడప్పుడు సరైన సెర్చ్​ రిజల్ట్స్ రాక ఇబ్బంది పడుతుంటారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో 10 బెస్ట్ గూగుల్ సెర్చ్ ట్రిక్స్​ చెప్పాం. వీటి సాయంతో మీరు కోరుకున్న సమాచారాన్ని చాలా సులువుగా చూడగలరు. అంతేకాదు దీని వల్ల చాలా సమయం కూడా ఆదా అవుతుంది.

Best Google Search Tricks
Best Google Search Tricks
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 1:31 PM IST

Best Google Search Tricks : ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చే సెర్చ్​ ఇంజిన్​​ గూగుల్​. అంతలా మన జీవితాల్లో ఇది భాగమైపోయింది. అయితే రెగ్యులర్​గా గూగుల్​ సెర్చ్ ఇంజిన్​ వాడేవారికి కూడా కొన్ని సెర్చింగ్​ ట్రిక్స్​ తెలియవు. కానీ వీటిని తెలుసుకుంటే, మీ పని మరింత సులువుగా అయిపోతుంది. అందుకే ఈ ఆర్టికల్​లో టాప్​-10 గూగుల్ సెర్చ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం.

1. కొటేషన్​
గూగుల్​లో మీరు సెర్చ్ చేసే పదానికి కొటేషన్​ (" ") పెట్టడం ద్వారా మీకు కావాల్సిన కచ్చితమైన సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు. అయితే, ఇలా కోట్స్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీకు అవసరమైన సెర్చ్ రిజల్ట్స్​ రాకపోవచ్చు. గూగుల్​లో మీరు సెర్చ్ చేసే అంశానికి సంబంధించి సరైన సమాచారం రాకపోయినప్పుడు మాత్రమే ఈ ట్రిక్​ను వాడవచ్చు. ఉదాహరణకు : "Tesla Phone" అని టైప్​ చేస్తే, టెస్లా ఫోన్​కు సంబంధించిన కచ్చితమైన సమాచారం మీకు లభిస్తుంది.

2. కేటగిరీ వైజ్​ సెర్చ్
గూగుల్​ సెర్చ్​ బాక్స్​లో మీరు టైప్​ చేసిన కీవర్డ్​కు సంబంధించి అనేక అంశాలు హోం స్క్రీన్​పై కనబడతాయి. ఒకవేళ మీరు ఇచ్చిన పదానికి సంబంధించి ఫొటోలు చూడాలనుకుంటే ఇమేజెస్​ సెక్షన్​, వార్తలు చూడాలనుకుంటే న్యూస్​ కేటగిరీ, వీడియోలు, షాపింగ్​, మ్యాప్స్​ ఇలా వివిధ విభాగాల్లో మీకు నచ్చిన దానిని మీరు చూడవచ్చు. ఉదాహరణకు : Computer Desk Shoppingకి బదులు Computer Desk అని టైప్​ చేసి షాపింగ్​ సెక్షన్​పై క్లిక్​ చేస్తే సరి. వివిధ కంపెనీల మోడల్స్​ అన్నింటినీ మీకు తెరపై చూపిస్తుంది.

3. సింపుల్ కీవర్డ్స్​
గూగుల్​కు లెంథీ కీవర్డ్స్ ఇవ్వకండి. సాధ్యమైనంత వరకు సులువుగా అర్థమయ్యే విధంగా ఉండే షార్ట్ కీవర్డ్స్​ ఇవ్వండి. మీకు కావాల్సిన సమాచారంతో సంబంధమున్న కీవర్డ్స్​ను మాత్రమే ఇచ్చేందుకు ప్రయత్నించండి. అలా అయితే మీ సెర్చ్​ రిజల్ట్స్​ మెరుగ్గా వస్తాయి. ఉదాహరణకు మీ ఐఫోన్​ పోయింది అనుకుందాం. అప్పుడు గూగుల్​ను I Lost My iPhone What To Doకి బదులుగా Lost iPhone, Iam Looking For New Mobilesకి బదులు New Android Phones లాంటి కీవర్డ్స్​ను ఇవ్వండి. అప్పుడే మీకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి.

4. కోలన్
కేవలం మీకు కావాల్సిన ప్రోడక్ట్​కి సంబంధించిన స్పెసిఫిక్ వెబ్​సైట్​ కావాలంటే మీరు 'కోలన్' వాడాలి. ఉదాహరణకు Wooden Clocks Sitesకి బదులు Wooden Clocks Site : allmodern.com అనే సరైన వెబ్​సైట్​ను ఎంటర్​ చేయడం ద్వారా మీ సమయం ఆదా అవుతుంది. మీకు కావాల్సిన కలెక్షన్స్​ను ఒకే పోర్టల్​లో చూసుకోవచ్చు.

5. హైఫన్​
గూగుల్​ సెర్చ్​ రిజల్ట్స్​లో మీకు నచ్చిన రిజల్ట్స్ పదేపదే కనిపిస్తున్నాయని అనుకోండి. అప్పుడు వాటిని హైఫన్ ఉపయోగించి, రాకుండా చేయవచ్చు. ఇందుకోసం మీరు చూడకూడదని అనుకుంటున్న కంపెనీ పేరుకు ముందు హైఫన్​(-)ను జోడించండి. దానికి ముందు మీకు కావాల్సిన ప్రోడక్ట్​ పేరు, వెబ్​సైట్​ వివరాలను టైప్ చేయండి. ఉదాహరణకు Buy Dishwasher - Website : Walmart.Com ఇలా కీవర్డ్​ ఇస్తే, ఇకపై​ వాల్​మార్ట్​ సైట్​కు సంబంధించిన ఎటువంటి డిష్​వాషర్​ రిజల్ట్స్​ మీకు కనిపించవు.

6. కోరుకున్న వీడియో కంటెంట్ చూడాలంటే?
మీరు చూడాలనుకుంటున్న వెబ్​సిరీస్​లు లేదా ఇతర ప్రోగ్రామ్​లకు సంబంధించిన అన్ని ఆప్షన్స్​ను స్క్రోల్​ చేసి మరీ గూగుల్ సెర్చ్​ రిజల్ట్స్​లో చూడాల్సిన అవసరం లేదు.​ కేవలం మీరు చూడాలనకుంటున్న షో లేదా చిత్రానికి సంబంధించి ఏదైనా కీవర్డ్​ను సెర్చ్​ బాక్స్​లో టైప్​ చేస్తే మీకు కావాల్సిన వాటికి సంబంధించిన స్క్రీన్​షాట్​/ పోస్టర్లు/ వీడియోలు గూగుల్​ రిజల్ట్స్​ పై భాగంలో చూడవచ్చు. ఉదాహరణకు watch free sci-fi movies, 2022 movies on YouTube లాంటి స్పెసిఫిక్​ కీవర్డ్స్​ను ఇస్తే, వాటికి సంబంధించిన స్క్రీన్​షాట్స్​ మీరు పేజ్ భాగంలోనే కనిపిస్తాయి.

7. సమ్మరీ కావాలంటే?
గూగుల్​ జెనరేటివ్​ ఏఐ టూల్ ద్వారా సెర్చ్​ రిజల్ట్స్​ సమ్మరీని పొందవచ్చు. ఇందుకోసం​ మీకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని పొందేందుకు అనేక వెబ్​సైట్​లు చూడాల్సిన పనిలేదు.

8. ఇమేజ్​ ద్వారా సెర్చ్​
గూగుల్​లోని రివర్స్​ ఇమేజ్​ సెర్చ్​ ట్రిక్​తో మీకు కావాల్సిన ప్రోడక్ట్​కు సంబంధించిన కచ్చితమైన రిజల్ట్స్​ను పొందవచ్చు. టెక్ట్స్​ను టైప్​ చేసే బదులు మీరు చూడాలనకునే వస్తువును, మీ కెమెరా ఐకాన్​పై క్లిక్​ చేసి దానిని సెర్చ్ బాక్స్​లో అప్లోడ్​ చేయండి. అప్పుడు మీరు అప్లోడ్ చేసిన ఫొటోకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఉదాహరణకు navy shoes అని టైప్​ చేసేకన్నా దానికి సంబంధించిన ఫొటోను మీ గూగుల్​ సెర్చ్ బాక్స్​లో అప్లోడ్​ చేస్తే సరి. దానికి సంబంధించిన కలెక్షన్స్​ను ఒకే దగ్గర చూడవచ్చు.

9. అర్థాలు తెలుసుకోవాలంటే?
ప్రస్తుతం మనకు అనేక డిక్షనరీ వెబ్​సైట్​లు, యాప్​లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది గూగుల్​ డిక్షనరీని విరివిగా వాడతుంటారు. మీరు వెతకాలనుకుంటున్న పదానికి ముందు డిఫైన్​ (Define) అని జోడించండి. ఉదాహరణకు 'Define Justice' అని టైప్​ చేయండి. దీంతో మీకు దాని అర్థంతో పాటు దానిని వాక్యంలో ఎలా వాడుతున్నారో అనే విషయాన్ని కూడా గూగుల్​ తెలియజేస్తుంది. అంతేకాకుండా మీరు ఎంటర్​ చేసిన పదానికి పర్యాయపదాలను కూడా చూపిస్తుంది​.

10. కాలిక్యులేషన్స్​ కోసం
చాలా మంది లెక్కల కోసం క్యాలిక్యులేటర్స్ వాడుతూ ఉంటారు. కానీ గూగుల్​నే ఒక క్యాలిక్యులేటర్​గా వాడవచ్చు. ఉదాహరణకు 40 GB to MB, cups in 1 gallon, 14 F in C. ఇలా టైప్​ చేస్తే కచ్చితమైన రిజల్ట్స్​ వస్తాయి.

మీరు ఐఫోన్ యూజర్లా? డైలీ ఉపయోగపడే 8 ప్రో టిప్స్ మీ కోసం!

100జీబీ క్లౌడ్​ స్టోరేజీతో అతి తక్కువ ధరలో ల్యాప్​టాప్​- స్టూడెంట్స్​కు బెస్ట్​ ఆప్షన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.