Best Earbuds Under 2000: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండటం ఎంత కామన్ అయిపోయిందో ఇయర్‌బడ్స్ కూడా అంతే కామన్ అయిపోయింది. ఇందులో చాలామంది వైర్లెస్ ఇయర్‌బడ్స్ వాడేందుకు ఇష్టపడుతున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ప్రముఖ కంపెనీలు ఎప్పటికప్పుడు తక్కువ బడ్జెట్లో మంచి స్టైలిష్ లుక్‌లో ఉన్న ఇయర్‌బడ్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో రూ.2,000 లోపు ఉన్న ఇయర్‌బడ్స్ గురించి తెలుసుకుందాం రండి.
1.BoAt Airdopes 141 ANC: బోట్ ఎయిర్‌డోప్స్ ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 42 గంటలు పనిచేస్తాయి. గంటన్నరలో ఈ ఇయర్డోబ్స్ ఫుల్ ఛార్జింగ్ అవుతాయి. ఆటో పెయిరింగ్ ఆప్షన్ ఈ ఇయిర్బడ్స్లో ఉంది. మొబైల్ ఫోన్స్, పీసీ, ట్యాబ్లెట్స్కు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. 10 మీటర్ల ఆటో పెయరింగ్ ఆప్షన్ ఉంది.
ఫీచర్స్
- బ్రాండ్: బోట్
- మోడల్: ఎయిర్ పాడ్స్ 141 ఏఎన్సీ
- వారంటీ: 1 సంవత్సరం
- బ్యాటరీ టైప్: Li-ion
- ప్లేబ్యాక్ టైమ్: 42 గంటలు
- ఛార్జింగ్ టైప్: యూఎస్బీ టైప్-సి
- ధర: రూ.1,599
2. Noise Tune Charge: నోయిస్ ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 30 గంటలు పనిచేస్తాయి. ఈ మోడల్ ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఇవి టచ్ కంట్రోల్, ఇన్‌స్టంట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. IPX5 వాటర్ రెసిస్టెన్సీతో లభిస్తున్నాయి.
ఫీచర్స్
- బ్రాండ్: నోయిస్
- స్పెషాలిటీ : వాటర్ రెసిస్టెన్స్
- ప్లేబ్యాక్ టైమ్: 30 గంటలు
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5.0
- ధర: రూ.899
3. Realme Buds Q2 Neo: రియల్ మీ బడ్స్ Q2 ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌కు ఒక సంవత్సరం వారెంటీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటలు పనిచేస్తాయి. ఆటో పెయిరింగ్ ఆప్షన్ కూడా ఉంది.
ఫీచర్స్
- బ్రాండ్: రియల్ మీ
- మోడల్: బడ్స్ క్యూ 2 నియో
- బ్యాటరీ టైప్: Li-ion
- ప్లే బ్యాక్ టైమ్: 20 గంటలు
- బ్యాటరీ కెపాసిటీ: 480 ఎమ్ఏహెచ్
- ఛార్జింగ్ టైమ్: 2గంటలు
- ధర: రూ.1,598
4. OnePlus Nord Buds 2R: వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2R ఇయర్‌బడ్స్‌కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 20 గంటల వరకు పనిచేస్తాయి. ఈ మోడల్ ఇయర్‌బడ్స్‌ను మొబైల్ ఫోన్, పీసీ, ట్యాబ్లెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది.
ఫీచర్స్
- బ్రాండ్: వన్ ప్లస్
- మోడల్: వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్
- వారంటీ: 1 సంవత్సరం
- ప్లే బ్యాక్ టైమ్: 20 గంటలు
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5.3
- ఛార్జింగ్ టైప్: యూఎస్బీ టైప్-సీ
- ధర: రూ.1,998
5. Noise Air Buds: నోయిస్ ఎయిర్ ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఈ మోడల్ ఇయర్బడ్స్సింగిల్ ఛార్జ్‌పై 20 గంటలు పనిచేస్తాయి. 5.0 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. IPX4 వాటర్ రెసిస్టెన్సీతో లభిస్తున్నాయి.
ఫీచర్స్
- బ్రాండ్: నోయిస్
- ప్లే బ్యాక్ టైమ్: 20 గంటలు
- స్పెషాలిటీ : వాటర్ రెసిస్టెన్స్
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5.0
- ధర: రూ.1,499
15వేల బడ్జెట్లో వీటిని మించిన ఫోనే లేదు - టాప్ మొబైల్స్ ఇవే! - Best Mobile phones under 15000