Best Earbuds Under 1500 : ప్రస్తుత కాలంలో చాలా మంది వైర్ లెస్ ఇయర్ ఫోన్స్‌ను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ప్రముఖ కంపెనీలు అన్నీ ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తెస్తున్నాయి. వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మార్కెట్లో రూ.1,500 కన్నా తక్కువ ధరలో మంచి ఫీచర్లతో పాటు,స్టైలిష్ డిజైన్లతో అందుబాటులో ఉన్న టాప్-10 ఇయర్ బడ్స్ పై ఓ లుక్కేద్దాం.
truke BTG Ultra
ఈ మోడల్ ఇయర్ బడ్స్ 5.4 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తాయి. వీటిని పెట్టుకుని ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్లో మాట్లాడవచ్చు. అలాగే సాంగ్స్ కూడా వినొచ్చు. ఈ ఇయర్ బడ్స్‌కు 12 నెలల వారంటీ ఉంది. ధర రూ.798. అలాగే ట్రుక్ బీటీజీ అల్ట్రా బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.
ఫీచర్లు : 360 స్పెషియల్™ ఆడియో, 13ఎంఎం గ్రాఫీన్ డ్రైవర్స్, 60 గంటల ప్లేటైమ్, ప్యూర్ వాయిస్ ఈఎన్ సీ టెక్నాలజీ
Amazon Basics TWS AB-T01B
ఈ మోడల్ ఇయర్ బడ్స్ సంగీత ప్రియులకు బాగా నచ్చుతాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 గంటల ప్లే టైమ్‌ను ఇస్తాయి. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఇయర్ బడ్స్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే ఇవి స్వెట్ ఫ్రూఫ్‌గా ఉంటాయి. ఈ ఇయర్ బడ్స్ ధర రూ.999.
ఫీచర్లు : 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ, 10ఎంఎం డ్రైవర్స్, 80 గంటల ప్లే టైమ్
Mivi DuoPods i2
ఈ మోడల్ ఇయర్ బడ్స్ మంచి ఆడియో క్వాలిటీని అందిస్తాయి. 45 గంటల ప్లేటైమ్‌ను ఇస్తాయి. ఇందులో ఉన్న డ్యూయల్-టోన్ డిజైన్ మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. కాల్ మాట్లాడినప్పుడు కూడా ఆడియో క్లారిటీగా వినిపిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 999.
ఫీచర్లు : 13mm డ్రైవర్స్, టైప్ సీ ఛార్జర్
Boult Audio Z20
ఈ ఇయర్ బడ్స్ ధర రూ.999. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60 గంటల ప్లే టైమ్‌ను ఇస్తాయి. రెగ్యులర్ గా వాడేవారికి, ప్రయాణాలు చేసేవారికి ఈ ఇయర్ పాడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ ఇయర్ బడ్స్ ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది.
ఫీచర్లు : జెన్ క్వాడ్ మైక్ ఈఎన్సీ, రిచ్ బాస్ సిగ్నేచర్, 60 గంటల ప్లే టైమ్, సీ టైప్ ఛార్జర్
Noise Buds N1
నాయిస్ బడ్స్ ఎన్1 మోడల్ ఇయర్ పాడ్స్ సంగీత ప్రియులకు బాగా నచ్చుతాయి. ఈ ఇయర్ బడ్స్‌ను పెట్టుకుని 40 మీటర్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్లో మాట్లాడవచ్చు. పాటలను వినొచ్చు. దీని ధర రూ.1,099.
ఫీచర్లు : క్వాడ్ మైక్ విత్ ఈఎన్సీ, 11mm డ్రైవర్, 40 గంటల ప్లే టైమ్
boAt Airdopes 120
ఇవి మంచి మోడ్రన్ లుక్‌లో ఉంటాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 40 గంటల ప్లేటైమ్ ఉంటుంది. టూర్స్, దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి సాంగ్స్ వినడానికి ఇవి బాగా ఉపయోపడతాయి. ధర రూ. 1,399.
ఫీచర్లు : ఈఎన్క్స్™ టెక్నాలజీ, ఐపీఎక్స్ 4 స్ప్లాష్ రెసిస్టెన్స్, 40 గంటల ప్లే టైమ్
realme Buds T110
ఇది కాల్స్ ఎక్కువ మాట్లాడేవారికి బాగా ఉపయోగపడుతుంది. 38 గంటల ప్లే బ్యాక్‌ను ఇస్తుంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేసి 120 నిమిషాలు సాంగ్స్‌ను వినొచ్చు. ఇది 5.4 బ్లూటూత్ కనెక్టివిటీలో వస్తుంది. ఈ ఇయర్ పాడ్స్ ధర రూ.1,299.
ఫీచర్లు : ఐపీఎక్స్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 10ఎంఎం డైనమిక్ బాస్ డ్రైవర్స్
ANKER Soundcore R50i
దీన్ని ల్యాప్ టాప్, ఫోన్, ట్యాబ్లెట్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. వీటిని చెవికి పెట్టుకున్నా ఎక్కువ అసౌకర్యంగా అనిపించవు. అలాగే మంచి లుక్‌తో ఉంటాయి. ఈ ఇయర్ పాడ్స్ ధర రూ.1,399.
ఫీచర్లు : 30 గంటల ప్లే టైమ్, 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్
Boult Audio UFO
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 48 గంటలపాటు అంతరాయం లేకుండా సంగీతం వినొచ్చు. కాల్స్ మాట్లాడొచ్చు. దీని ధర రూ. 1,499.
ఫీచర్లు : 48 గంటల ప్లే టైమ్, 13ఎంఎం బాస్ డ్రైవర్స్