Top 5 Best AI Tools For Students : మీరు స్టూడెంట్సా? ఇప్పటికీ మీ స్టడీ ప్లాన్స్‌లో పాత పద్ధతులనే ఉపయోగిస్తున్నారా? ఇలా చేస్తే మీరు మిగతా వారికంటే ఎప్పుడూ వెనుకంజలోనే ఉంటారు. టెక్నాలజీ అప్డేట్ అవుతున్న ఈ సమయంలో మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో మీకు ఉపయోగపడే 5 ఏఐ స్టడీ టూల్స్ గురించి తెలియజేశాం. వీటి సాయంతో మీరు చదువులో ఎవరూ ఊహించని రీతిలో ఫలితాలు సాధించవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ టాప్-5 ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం రండి.
గ్రామర్లీ
Grammarly : గ్రామర్లీ అనేది ఒక ఏఐ రైటింగ్ టూల్. దీనిని ఉపయోగించి విద్యార్థులు తమ రైటింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఈ టూల్ మీరు రాసిన వ్యాసంలోని వ్యాకరణ (గ్రామర్) దోషాలను గుర్తిస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్, విరామ చిహ్నాలు (పంక్చువేషన్ మార్క్స్)ను గుర్తించి, తప్పులను సరిదిద్దుతుంది. అంతేకాదు మీ రాతశైలిని కూడా మెరుగుపరుచుకునేందుకు సహకరిస్తుంది. కనుక విద్యార్థులు ఏఐ టూల్‌ను ఉపయోగించుకుని, చాలా సులువుగా వ్యాసాలు, టెర్మ్ పేపర్లు, అసైన్మెంట్లు పూర్తి చేసుకోవచ్చు.
నోషన్
Notion : నోషన్ అనేది ఆల్-ఇన్-వన్ వర్క్‌స్పేస్ ఏఐ టూల్. ఇది విద్యార్థులు టాస్క్‌లు, ప్రాజెక్ట్‌లను ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా నోట్-టేకింగ్, టాస్క్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ ప్లానింగ్‌లు చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ప్లాట్‌ఫాంలో తోటి విద్యార్థులతో కలిసి పనిచేయవచ్చు.
సింటియా
Syntea : 'ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్' విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ సింటియా ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసింది. దీనిలో ప్రధానంగా రెండు ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే?
1. మీ కోర్సు కంటెంట్‌కు సంబంధించిన ప్రశ్నలను Synteaను అడగవచ్చు. అది వెంటనే మీకు సమాధానమిస్తుంది. అలాగే ఆ సమాధానం ఏ బుక్ సోర్స్ నుంచి వచ్చిందో కూడా మీకు తెలియజేస్తుంది.
2. దీనిలో ప్రీ అసైన్మెంట్ ఫీచర్ కూడా ఉంది. దీనిని ఉపయోగించి మీ నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎగ్జామ్స్ రాసేముందు, దీనిలో ప్రాక్టీస్ టెస్ట్‌లు రాసి, మీ లోపాలను సరిదిద్దుకోవచ్చు.
గ్రేడ్స్కోప్
Gradescope : ఈ గ్రేడ్స్కోప్ ఏఐ టూల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఉపాధ్యాయులు రియల్ టైమ్‌లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ఖాళీల పూరణ, కోడింగ్ ప్రశ్నలను విద్యార్థులను అడగవచ్చు. వారు కూడా ఇదే వేదికగా సమాధానాలు ఇవ్వవచ్చు. ఫలితాలను కూడా అదే సమయంలో తెలుసుకోవచ్చు. ఈ విధంగా గ్రేడ్స్కోప్ టూల్ ద్వారా మీ సెమిస్టర్ ప్రోగ్రస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.
చాట్ జీపీటీ
Chat-GPT : చాట్ జీపీటీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ గేమ్ ఛేంజింగ్ వెబ్ అప్లికేషన్ కేవలం విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా అందరికీ ఓ ఉత్తమమైన ఏఐ టూల్‌గా పనిచేస్తుంది. ఈ AI ఆధారిత చాట్‌బాట్‌ను ఓపెన్ AI అభివృద్ధి చేసింది. ఇది మానవుల అడిగే అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. కనుక విద్యార్థులు తమకు తెలియని సంక్లిష్టమైన ప్రశ్నలకు చాట్-జీపీటీ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు చాట్-జీపీటీతో ఇంటరాక్టివ్ సెషన్లో కూడా పాల్గొనవచ్చు.
నోకియా 3210 మళ్లీ వస్తోందా? ఆసక్తి రేపుతున్న HMD టీజర్! - Nokia 3210 smartphone
కొత్త ఫోన్ కొనాలా? టాప్-5 అప్‌కమింగ్ మొబైల్స్ ఇవే - ధర ఎంతంటే? - Upcoming Smartphones 2024