ETV Bharat / technology

ఈ పండగకి కొత్త స్మార్ట్​ఫోన్ కొనే ప్లాన్​లో ఉన్నారా?- ముందు వీటిని చెక్​ చేయండి! - THINGS TO DO BEFORE BUYING PHONE

Things to Do Before Buying New Phone: మార్కెట్లో లెక్కలేనన్ని స్మార్ట్​ఫోన్ల కంపెనీలు. వాటిల్లో రకరకాల మోడల్స్. వాటిలో ఏది కొనాలి? ఎంత ఖర్చు పెట్టాలి? కొన్న మొబైల్ ఎంత కాలం మన్నుతుంది? స్మార్ట్​ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ మన ముందుండే ప్రశ్నలు. అసలు మొబైల్​ ఫోన్ తీసుకునే ముందు వేటిపై దృష్టి పెట్టాలో మీకు తెలుసా?

Things to Do Before Buying New Phone
Things to Do Before Buying New Phone (source AI)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 23, 2024, 4:27 PM IST

Things to Do Before Buying New Phone: ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్​ఫోన్ ఉంటోంది. మొబైల్ అందుబాటులో లేకుంటే పూట గడవని పరిస్థితి. మొబైల్స్​ సేల్స్ భారీగా పెరగటంతో స్మార్ట్​ఫోన్ తయారీ కంపెనీలన్నీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫెస్టివల్​ సీజన్​లో ఫ్లిప్​కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ- కామర్స్ సంస్థలు వాటిపై అదిరే ఆఫర్స్​ను ప్రకటిస్తున్నాయి. ఈ పండగ ఆఫర్లలో మంచి స్మార్ట్​ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచించేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటో తెలుసుకుందాం రండి.

ఆపరేటింగ్ సిస్టమ్:

  • కొత్త మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు తీసుకునే మొదటి నిర్ణయాలలో ఆండ్రాయిడ్ అండ్ iOS ఫోన్లలో ఒకటి ఎంచుకోవడం.
  • ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు డిఫరెంట్ ఫీచర్స్ అండ్ ఎకోసిస్టమ్స్​ను కలిగి ఉంటాయి.
  • ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మరింత కస్టమైజేషన్​ను కలిగి ఉండటమే కాకుండా హార్డ్‌వేర్‌లో మరింత వైవిధ్యం ఉంటుంది.
  • మరోవైపు ఆపిల్ iOS ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీపై ఫోకస్ చేస్తుంది. అందుకే ఈ ఫోన్ ధర ఎక్కువ.

ప్రాసెసర్:

  • ఫోన్​కు ప్రాసెసర్ అనేది బ్రెయిన్ లాంటిది.
  • ప్రాసెసర్ మొబైల్ పనితీరును బాగా ప్రభావితం చేస్తుంది.
  • మెసేజింగ్, బ్రౌజింగ్ వీడియో స్ట్రీమింగ్ వంటి రెగ్యులర్ పనులు చేసే వినియోగదారులకు Qualcomm Snapdragon 7 సిరీస్ లేదా యాపిల్ A15 బయోనిక్ వంటి మిడ్-రేండ్ ప్రాసెసర్లు ఉత్తమం.
  • అయితే గేమర్స్ లేదా హెవీ మల్టీ టాస్కర్ల కోసం హై-ఎండ్ చిప్‌సెట్‌తో కూడిన ఫోన్ తీసుకోవటం మంచిది.

బ్యాటరీ లైఫ్:

  • కొత్త మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ లైఫ్ అనేది ఒక ముఖ్యమైన అంశం.
  • ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కనీసం 4000mAh బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేస్తే మంచిది.
  • అయితే ఫోన్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ అనేది మీరు మొబైల్‌ను ఎంత ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
  • ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రాధాన్యతనిస్తుంది.
  • ఎందుకంటే ఇది మీ ఫోన్‌ను తక్కువ సమయంలో ఛార్జ్ చేయగలదు.

కెమెరా క్వాలిటీ:

  • నేటి సోషల్ మీడియా యుగంలో స్మార్ట్​ఫోన్​కు మంచి కెమెరా క్వాలిటీ అవసరం.
  • ప్రస్తుతం చాలామంది హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు మల్టిపుల్ లెన్స్​లతో ఆకట్టుకునే కెమెరా సిస్టమ్స్​ ఉన్న మొబైల్స్​ను వినియోగిస్తున్నారు.
  • ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), లో-లైట్, సాఫ్ట్‌వేర్ ఎన్​హాన్స్​మెంట్స్ వంటి ఫీచర్లు ఇమేజ్ క్వాలిటీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
  • సాధారణ ఫోటోగ్రాఫర్ కోసం మిడ్-రేంజ్ ఫోన్‌లు ఇప్పుడు అద్భుతమైన కెమెరా సెటప్‌లను అందిస్తున్నాయి.

స్టోరేజ్ అండ్ ర్యామ్:

  • మీకు ఎంత స్టోరేజీ అవసరం అనేది మీ యూసేజ్​పై ఆధారపడి ఉంటుంది.
  • మీరు ఎక్కువగా ఫొటోస్, వీడియోస్ లేదా గేమ్స్​ను స్టోర్ చేయాలంటే కనీసం 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్‌ని కొనుగోలు చేయాలి.
  • చాలావరకు ఆండ్రాయిడ్ మొబైల్స్​ మైక్రో SD కార్డ్ ద్వారా తమ స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకోగలిగినప్పటికీ iPhoneలు అలా చేయవు.
  • స్మార్ట్​ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు RAM కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
  • 8GB లేదా అంతకంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్‌లు మల్టీ టాస్కింగ్‌కు బాగా ఉపయోగపడతాయి.

బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్:

  • స్మార్ట్​ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు దాని మన్నిక, డిజైన్​ కూడా ముఖ్యమైన అంశాలు.
  • ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు ఫోన్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలి.
  • ఎందుకంటే చాలా సార్లు చేతిలో నుంచి ఫోన్లు కింద పడిపోతూ ఉంటాయి.
  • అలాంటి సమయంలో అవి విరిగిపోయే అవకాశాలు ఎక్కువ.
  • అందుకే అలాంటి సందర్భాల్లో మొబైల్ బిల్డ్ క్వాలిటీ ముఖ్యం.
  • ఇందుకోసం గొరిల్లా గ్లాస్ లేదా వాటర్ రెసిస్టెంట్ (IP రేటింగ్) ఉన్న ఫోన్‌లు తీసుకోవటం ఉత్తమం.

5G నెట్‌వర్క్‌:

  • 5G నెట్‌వర్క్​ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.
  • కాబట్టి 5Gకి సపోర్ట్ చేసే స్మార్ట్​ఫోన్​ను తీసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
  • అయితే 5G మొబైల్ తీసుకోవాలంటే దాని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
  • అంత బడ్జెట్​ పెట్టలేము అనుకునేవారు మీ అవసరాలకు అనుగుణంగా మొబైల్​ను ఎంపిక చేసుకోండి.

ధర:

  • చివరిగా మీరు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.
  • యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీల ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ధర 20 వేలకు పైగానే ఉంటుంది.
  • అలాగే మార్కెట్లో చాలా మిడ్​- రేంజ్ ఫోన్‌లు కూడా మెరుగైన ఫీచర్లతో సరసమైన ధరలకు లభిస్తున్నాయి.
  • దీంతోపాటు ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు దానిపై మీకు ఎంత డిస్కౌంట్ లభిస్తుందో కూడా ఆలోచించి తీసుకుంటే బెస్ట్.

స్మార్ట్​ఫోన్ ప్రియులకు ఆఫర్ల పండగ- వన్​ప్లస్​ దీపావళి డీల్స్​ రివీల్ - One Plus Diwali Sale 2024

స్మార్ట్​ఫోన్లపై ఆఫర్లే.. ఆఫర్లు- వన్​ప్లస్, శాంసంగ్​ మొబైల్స్​పై అమెజాన్ డీల్స్ ఇవే! - Amazon Offers on Smartphones

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.