ETV Bharat / technology

కంటి చూపుతోనే స్క్రీన్​ను ఆపరేట్ చేసేలా - యాపిల్ నయా ఫీచర్స్​! - Apple Accessibility Features - APPLE ACCESSIBILITY FEATURES

Apple Accessibility Features : యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్​. ఇకపై దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్​లను చాలా సులువుగా ఆపరేట్ చేసే విధంగా యాపిల్ కంపెనీ సరికొత్త ఫీచర్లు తీసుకురానున్నట్లు ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Apple Eye Tracking Features
Apple Accessibility Features (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 12:10 PM IST

Apple Accessibility Features : ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ కంపెనీ యాపిల్‌ తమ ఐఫోన్‌, ఐప్యాడ్‌లలో సరికొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఐ ట్రాకింగ్​, మ్యూజిక్​ హాప్టిక్స్​, వోకల్ షార్ట్​కట్​లు లాంటి ఫీచర్లు - దివ్యాంగులు కూడా చాలా సులభంగా యాపిల్‌ డివైజ్‌లను యాక్సెస్‌ చేసేందుకు ఉపయోగపడతాయని పేర్కొంది. బహుశా ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Apple Eye Tracking Feature : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఐ ట్రాకింగ్ ఫీచర్​ పనిచేస్తుంది. కనుక యూజర్లు తమ కంటి చూపుతో ఐఫోన్, ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లను చాలా సులువుగా నియంత్రించగలుగుతారు. అంతేకాదు ప్రత్యేక అవసరాలు కలిగినవారు కూడా యాపిల్ డివైజ్​లను సులభంగా నావిగేట్ చేసేందుకు వీలుగా ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్ (ML) ఫీచర్లు కూడా తీసుకురానున్నట్లు యాపిల్ కంపెనీ తెలిపింది.

యాపిల్‌ డివైజ్​ల్లోని ఫ్రంట్​ కెమెరా కేవలం కొన్ని సెకెన్లలోనే యూజర్ల కళ్లను ట్రాక్ చేస్తుంది. కనుక స్క్రీన్‌ను టచ్‌ చేయకుండానే తమ కంటి కదలికలతో డివైజ్​లను వారు నావిగేట్‌ చేయగలుగుతారు. అయితే దీని వల్ల వ్యక్తిగత గోప్యతకు కూడా ఎటువంటి భంగం వాటిల్లదని కంపెనీ చెబుతోంది. ఈ నయా ఫీచర్లు అన్ని యాప్‌లను యాక్సెస్ చేసేందుకు సాయపడతాయి. ఇందుకోసం అదనపు హార్డ్‌వేర్​, యాక్సెసరీల అవసరం ఉండదు.

Apple Music Haptics : వినికిడిలోపం ఉన్నవారు కూడా సంగీతాన్ని ఆస్వాదించేందుకు మ్యూజిక్‌ హాప్టిక్స్‌ అనే ఫీచర్​ను యాపిల్ కంపెనీ తీసుకువస్తోంది. దీనిలో పాటకు తగ్గట్టుగా వైబ్రేషన్‌లు, ఇతర ఎఫెక్ట్‌లు వస్తాయి. కనుక రిథమ్‌కి తగట్టుగా అందులో వచ్చే వైబ్రేషన్స్‌తోనే చెవిటి వాళ్లు కూడా సంగీతాన్ని ఎంజాయ్​ చేయగలుగుతారు.

Apple Vocal Shortcuts : సరిగ్గా మాట్లాడలేని వారి కోసం యాపిల్‌ కంపెనీ వోకల్‌ షార్ట్‌కట్‌ అనే ఫీచర్​ను తీసుకువస్తోంది. దీని వల్ల స్పష్టంగా మాట్లాడలేనివారు చెప్పే పదాలను ఐఫోన్‌లోని సిరి చాలా సులభంగా అర్థం చేసుకుంటుంది. అందువల్ల తమలోని భావాలను వారు స్వేచ్ఛగా బయటకు చెప్పగలిగే వీలు కలుగుతుంది. యాపిల్ కంపెనీ వీటితో పాటు వెహికల్‌ మోషన్‌ క్యూస్‌, కార్‌ ప్లే, సౌండ్‌ రికగ్నైజేషన్‌, కలర్‌ ఫిల్టర్స్‌ లాంటి పలు ఫీచర్లను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.

క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ యూజర్లకు అలర్ట్​ - ఈ కామన్​ 'పిన్స్​'ను వెంటనే మార్చండి - లేకుంటే ఇక అంతే! - Most Common PIN Patterns

ప్రాజెక్ట్‌ అస్త్ర - జీమెయిల్‌లో జెమినీ - వీడియోల కోసం వియో - గూగుల్​ సరికొత్త ఫీచర్స్​! - Google Project Astra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.