Apple Launches New iMac with M4 Chip: టెక్ దిగ్గజం యాపిల్ ఈరోజు కొత్త ఐమ్యాక్‌ను పవర్ఫుల్ M4 చిప్‌తో లాంచ్ చేసింది. ఈ కొత్త ఐమ్యాక్ బిగ్ 24 ఇంచ్ రెటీనా స్క్రీన్‌తో ఇది వస్తుంది. అంతేకాక గ్లేర్, రిఫ్లెక్షన్స్‌ను తగ్గించడానికి రూపొందించిన కొత్త నానో-టెక్చర్ గ్లాస్ ఆప్షన్‌ను కూడా పరిచయం చేసింది. కంపెనీ తన యాపిల్ ఇంటెలిజెన్స్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఐమ్యాక్‌ను స్లీక్ డిజైన్‌తో పూర్తిగా ప్రీమియం ఫీచర్స్‌తో రూపొందించారు. దీని ప్రీ- ఆర్డర్స్ నేటి నుంచి ప్రారంభం కానుండగా.. మార్కెట్లో ఈ ప్రొడక్ట్ సేల్స్ నవంబర్ 8వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా ఈ యాపిల్ పవర్ ఫుల్ సిస్టమ్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.
iMac 24 Inch ఫీచర్స్:
- స్క్రీన్: 24 ఇంచ్ బిగ్ రెటీనా స్క్రీన్
- రిజల్యూషన్: 4.5K
- పీక్ బ్రైట్నెస్: 500 నిట్స్
- యాపిల్ ఇంటెలిజెన్స్
- 16-core న్యూరల్ ఇంజిన్
- 10-core CPU
- 10-core GPU
- 16GB యూనిఫైడ్ మెమరీ
- 256GB SSD
- దీన్ని 24GB లేదా 32GB యూనిఫైడ్ మెమరీ, 512GB, 1TB లేదా 2TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం వుంది.
- HEVC
- H.264
- AV1 అండ్ ProRes
- HDR విత్ Dolby Vision
- HDR10+/HDR10
- HLG వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్
- 6 హై ఫెడిలిటీ స్పీకర్లు
- Spatial Audio
- Dolby Atmos
కలర్ ఆప్షన్స్: ఈ ఐమ్యాక్ మార్కెట్లో ఏడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.
- గ్రీన్
- ఎల్లో
- ఆరెంజ్
- పింక్
- పర్పుల్ బ్లూ
- సిల్వర్
ధర:
- కంపెనీ ఈ కొత్త ఐమ్యాక్ ఇంచ్‌ను ఇండియాలో రూ. 1,34,990 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
ఈ ఐమ్యాక్ 24 ఇంచ్ దాని పాత మోడల్ మాదిరిగానే aluminum unibody డిజైన్‌ను కలిగి ఉంది. దీని పాత M1తో పోలిస్తే M4 చిప్‌తో ఈ కొత్త ఐమ్యాక్.. గేమింగ్, ఫొటో ఎడిటింగ్ వంటి వాటికి 2.1 రెట్ల స్పీడ్ ప్రాసెసింగ్‌తో మెరుగ్గా పనిచేస్తుంది. దీని రోజువారీ ప్రొడక్టివిటీ 1.7x స్పీడ్ బూస్ట్. ఇది లేటెస్ట్ macOS సీక్వోయా ఆపరేటింగ్ సిస్ట్మ్తో ఇంటిగ్రేట్ అయి వస్తుంది.
ఈ పండక్కి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?- అయితే ఈ టాటా కర్వ్ ఈవీపై ఓ లుక్కేయండి..!
మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనాలా?- త్వరలో రిలీజ్ కానున్న టాప్ మోడల్స్ ఇవే..!