ETV Bharat / technology

ఎయిర్‌టెల్‌ యూజర్లకు యాపిల్‌ టీవీ+, మ్యూజిక్‌ యాక్సెస్‌- ఎప్పటినుంచో తెలుసా? - Airtel to Bring Apple Content - AIRTEL TO BRING APPLE CONTENT

Airtel to Bring Apple Video Music Content: యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎయిర్​టెల్​ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తన కస్టమర్లకు యాపిల్‌ టీవీ+, యాపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ యాక్సెస్​ను అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం టెక్​ సంస్థ యాపిల్​తో భాగస్వామ్యం అయింది. దీనివల్ల ఎవరికి ఎంత లాభం? ఈ సేవలు ఎప్పటినుంచి? వంటి వివరాలు మీకోసం.

Airtel_to_Bring_Apple_Video_Music_Content
Airtel_to_Bring_Apple_Video_Music_Content (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Aug 27, 2024, 5:27 PM IST

Airtel to Bring Apple Video Music Content: టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు మెరుగైన కంటెంట్‌ సేవలు అందించేందుకు సిద్ధమైంది. కస్టమర్లకు యాపిల్‌ టీవీ+, యాపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ను యాక్సెస్‌ చేసే ఫెసిలిటీ తీసుకురానుంది. ఇందుకోసం ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.

దీనివల్ల ఎవరికి ఎంత లాభం?:

  • ఎయిర్‌టెల్‌ కస్టమర్లు అచ్చం ఎక్స్‌ట్రీమ్‌ తరహాలోనే వింక్‌(Wynk) మ్యూజిక్‌లో యాపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ను పొందొచ్చు. ఈ ఫెసిలిటీ ఎయిర్‌టెల్‌ కస్టమర్లందరికి అందుబాటులోకి రానుంది.
  • ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌లో యాపిల్‌ టీవీ+ కంటెంట్‌, కామెడీ సిరీస్, డాక్యుమెంటరీలు, హాలీవుడ్‌, కిడ్స్ షో, అవార్డ్‌ విన్నింగ్‌ సినిమాలు వీక్షించొచ్చు. ఈ సర్వీసులు ప్రీమియం వైఫై, పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • యాపిల్ మ్యూజిక్ యాప్ ఫీచర్లో యాపిల్ మ్యూజిక్ సింగ్, టైమ్-సింక్డ్ లిరిక్స్, లాస్‌లెస్ ఆడియో, స్పేషియల్ ఆడియో కంటెంట్లు ఉంటాయి. యాపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్​ కోసం Wynk ప్రీమియం యూజర్స్​కు అదిరిపోయే ఆఫర్లు అందిస్తామని ఎయిర్​టెల్​ ప్రకటించింది.

ఎయిర్​టెల్​ యూజర్లకు మెరుగైన కంటెంట్‌: టెక్ దిగ్గజం యాపిల్‌తో భాగస్వామ్యం పట్ల ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అమృత్‌ త్రిపాఠి ఆనందం వ్యక్తం చేశారు. తమ యూజర్లకు మెరుగైన కంటెంట్‌ అందించేందుకు యాపిల్‌ భాగస్వామ్యం ఎంతో సాయపడుతుందన్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు అమృత్ త్రిపాఠి వెల్లడించారు.

"ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మెరుగైన కంటెంట్‌ అందించేందుకు టెక్ దిగ్గజం యాపిల్‌ భాగస్వామ్యం ఎంతో సాయపడుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి." - అమృత్‌ త్రిపాఠి, ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌

యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్- సబ్​స్క్రిప్షన్ ధరల పెంపు - youtube premium plans price hike

ఐఫోన్ లవర్స్​కు గుడ్​ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్​ - iphone 16 launch date

దిమ్మతిరిగే ఫీచర్లతో 'టీవీఎస్ జూపిటర్ 110'- ధర ఎంతంటే? - TVS Jupiter 110 Launched

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.