ETV Bharat / technology

మరణాన్ని ఆపగలికే క్లాక్..!- దీనితో 'డెత్ డేట్' తెలుసుకో.. తలరాతను మార్చుకో..!

డెత్ డేట్​ను చెప్పగలిగే యాప్.. గూగుల్ ప్లే స్టోర్​లో అందుబాటులో.. వారికి మాత్రమే!

Death Clock App
Death Clock App (Photo Credit - Google Play Store)
author img

By ETV Bharat Tech Team

Published : 3 hours ago

Death Clock App: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాంకేతిక రంగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దీనిలో భాగంగా పుట్టుకొచ్చిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కృత్రిమ మేధ.. వ్యాపార, వాణిజ్య, సేవ వంటి అన్ని రంగాల్లో వ్యాపించి ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఈ క్రమంలో ఏఐ ఆవిష్కరణల్లో తాజాగా 'డెత్ క్లాక్' పుట్టుకొచ్చింది.

'మరణం'.. ఇది ఎవరికి, ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో తెలీదు. అయితే ఏఐ సహాయంతో పనిచేసే ఈ 'డెత్​ క్లాక్'​ యాప్​ మాత్రం మన 'డెత్ డేట్'​ను చెప్పేస్తుందట. ఏంటీ నమ్మలేకపోతున్నారా? అవునండీ బాబూ ఇది నిజమే. ఈ యాప్.. మన ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా అంతిమ ఘడియను తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్‌ ప్లేస్టోర్‌తో పాటు యాపిల్‌ స్టోర్‌లోనూ డెత్‌ క్లాక్‌ యాప్​లో కూడా అందుబాటులో ఉంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఏంటీ యాప్? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది ఎవరికి అందుబాటులో ఉంది? వంటి వివరాలు మీకోసం.

డెత్ క్లాక్ యాప్: మనిషి మరణ ఘడియలను తెలియజేసే ఈ డెత్ క్లాక్ యాప్​ను బ్రెంట్‌ ఫ్రాన్సన్‌ డెవలప్ చేశారు. ఇది డెత్ డేట్​ను తెలిపేందుకు, ఏఐ ఆధారంగా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) అధికారిక డేటాతోపాటు 5.3 కోట్ల మంది భాగస్వాములైన 1200 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశీలించి మరీ అంచనా వేస్తుంది. ఇందుకోసం మన శరీరంలోని కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ లెవల్స్, ఫుడ్ హ్యాబిట్స్. వ్యాయామం, రిలేషన్స్ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

అయితే డెత్ డేట్​ చెప్పి ప్రజలను భయపెట్టడం తమ ఉద్దేశం కాదు కానీ, వారి ఆరోగ్య స్థితి గతులపై కచ్చితమైన అవగాహనను కల్పించాలనుకుంటున్నామని బ్రెంట్‌ ఫ్రాన్సన్‌ అన్నారు. ఇది హెల్త్, ఇన్సూరెన్స్‌ సంస్థల నుంచి సేకరించిన సంప్రదాయ ఆయుఃప్రమాణాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్‌ను క్రోడీకరించాకే మరణ తేదీలను లెక్కిస్తుందని తెలిపారు.

ఇది ఎలా పనిచేస్తుంది?: మనం రోజూ తీసుకొనే షుగర్‌ క్వాంటిటీ దగ్గర్నుంచి తాత ముత్తాతలకు సంబంధించిన అంశాల వరకు అన్ని వివరాలను యాప్​నకు అందించాలి. మనం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ డెత్​ క్లాక్ మనం మరణానికి ఎంత దూరంలో ఉన్నామో లెక్కించి చెబుతుంది. అంతేకాక ఇది ఆ డేటా ఆధారంగా మనకు హెల్త్ టిప్స్​ కూడా ఇస్తుంది.

దీంతో 'డెత్‌ డేట్‌' సంగతెలా ఉన్నా ఆరోగ్యం విషయంలో మనకు అవసరమైన అలర్ట్స్ అందిస్తూ ఏ అంశంలో మెరుగుపడాలో సూచిస్తోందంటూ నెటిజన్లు రివ్యూ ఇస్తున్నారు. అంతేకాదు ఒకవేళ మనం పదేళ్లలో చనిపోతామని తెలిస్తే.. ముందు జాగ్రత్తగా కుటుంబ అవసరాలకు తగినట్లు ఆర్థిక ప్రణాళిక వేసుకోవడమో లేదా మృతికి దారితీసే ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి జీవన కాలాన్ని పెంచుకోవడమో చేస్తారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇది ఎవరికి అందుబాటులో ఉంది?: ఈ డెత్​ క్లాక్ యాప్‌ను మొదటి మూడు రోజులు ఉచితంగానే వాడుకోవచ్చు. ఆ తర్వాత నెల, ఏడాది చొప్పున సబ్స్క్రిప్షన్​ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్ ఇంకా భారత్‌లో అందుబాటులోకి రాలేదు. కానీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1.20 లక్షల మంది ఈ డెత్ క్లాక్ యాప్​ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

మొన్న మహింద్రా, నిన్న టాటా.. న్యూ ఇయర్ సమీపిస్తున్న కొద్దీ కార్ల ధరలకు రెక్కలు!

క్రేజీ ఫీచర్లతో రూ.10వేలకే 5G స్మార్ట్​ఫోన్!- ఎక్కడో తెలుసా?

వారెవ్వా.. గూగుల్ 'విల్లో' వెరీ పవర్​ఫుల్ బాస్- దీని స్పీడ్​కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.