Aadhaar Card Free Update: ప్రస్తుతం ఆధార్ కార్డు అన్నింటికీ తప్పనిసరి అయిపోయింది. ఏ పని జరగాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ఆధార్ ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా, బ్యాంకు, హాస్పిటల్, స్కూల్, కాలేజీ అడ్మిషన్లు ఇలా ప్రతి విషయానికీ ఆధార్ కార్డు అడుగుతున్నారు. కాబట్టి ఆధార్‌లో పేరు, అడ్రస్, ఫొటో, మొబైల్ నంబర్ వంటి వివరాలు సరిగ్గా ఉండాలి.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, రెన్యూవల్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం ఆధార్ కార్డు చేయించుకున్నప్పటి నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అడ్రస్, ప్రూప్స్ డాక్యుమెంట్స్‌ను అప్డేట్ చేసుకోవాలి. లేకుంటే చాలా ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
ఫ్రీ ఆధార్ అప్డేట్ లాస్ట్ డేట్ ఎప్పుడు?:
- ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు UIDAI ఇప్పటికే గడువు ముగియగా పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది.
- ప్రస్తుతం సెప్టెంబర్ 14 లోపు ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.
- లేకుంటే ఇంతకుముందులాగానే ఆధార్ సెంటర్లో రూ. 50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫ్రీగా ఆధార్ కార్డును అప్డేట్ చేయటం ఎలా?:
- ఆధార్ కార్డును అప్డేట్ చేసేందుకు మొదట ఉడాయ్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/portal లోకి వెళ్లండి.
- తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'సెండ్ OTP' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వెళ్తుంది. దీన్ని నమోదు చేసి, ఎంటర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత అక్కడ సర్వీసెస్‌లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్‌పై మీ పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వంటి వివరాలు కన్పిస్తాయి. వాటిలో మీరు ఏం అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఐడీ, అడ్రస్ ప్రూఫ్ కోసం కొన్ని డాక్యుమెంట్లను అడుగుతుంది. ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్ 2MB కంటే తక్కువ సైజ్ ఉండాలి. JPEG, PNG, PDF ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తాయి.
- ఆయా డాక్యుమెంట్స్ స్కాన్డ్ కాపీల్ని అప్లోడ్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీంతో అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా సింపుల్ స్టెప్స్‌తో ఆధార్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ చేసిన ఏడు రోజుల తర్వాత అప్డేట్ అయిన కొత్త ఆధార్ కార్డును మనం పొందొచ్చు.
స్టన్నింగ్ లుక్స్‌తో '2024 హీరో గ్లామర్ 125' లాంచ్- ధర ఎంతో తెలుసా? - 2024 Hero Glamour 125 Launched