Honda Amaze vs Maruti Dzire: జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా ఇటీవలే కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్‌లో అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. కంపెనీ దీని ప్రీవియస్ మోడల్లో కొన్ని మార్పులు చేస్తూ అప్డేట్ చేసింది. ఇందులో అతిపెద్ద అప్‌డేట్ ఏంటంటే కంపెనీ ఈ కొత్త అమేజ్‌లో అధునాతన ADAS సూట్‌ను అందించింది. అంతేకాక ఈ ఫీచర్‌తో అతి తక్కువ ధరలోనే దీన్ని తీసుకొచ్చింది. దీంతో ADAS ఫీచర్‌తో వచ్చిన దేశంలోనే అత్యంత చౌకైన కారుగా హోండా అమేజ్ గుర్తింపు పొందింది.
అయితే ఈ కారు ఇండియన్ మార్కెట్లో ప్రధానంగా గత నెలలో రిలీజ్ అయిన మారుతి సుజుకి న్యూ డిజైర్‌తో పోటీపడుతుంది. ఈ రెండు లేటెస్ట్ కార్లూ అతి తక్కువ ధరలోనే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో బడ్జెట్ ధరలో కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ రెండు లేటెస్ట్ కార్లూ ఉత్తమ ఎంపిక అని చెప్పొచ్చు. అయితే ఈ రెండింటిలో ఏ కారు బెస్ట్? దేనిలో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వాటిపై ఈ రెండు కార్లను కంపేర్ చేస్తూ వివరాలు మీకోసం. ఈ వివరాలను బట్టి మీకు ఏ కారు అయితే మంచిదో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు.
2024 Honda Amaze vs 2024 Maruti Dzire: సైజ్
సైజ్ | 2024 హోండా అమేజ్ | 2024 మారుతి డిజైర్ | రెండింటి మధ్య తేడా |
పొడవు | 3,995 మి.మీ | 3,995 మి.మీ | తేడా ఏం లేదు |
వెడల్పు | 1,733 మి.మీ | 1,735 మి.మీ | 2 మిమీ తేడా ఉంది |
ఎత్తు | 1,500 మి.మీ | 1,525 మి.మీ | 25 మిమీ తేడా ఉంది |
వీల్ బేస్ | 2,470 మి.మీ | 2,450 మి.మీ | 20 మిమీ తేడా ఉంది |
బూట్‌స్పేస్ | 416 లీటర్లు | 382 లీటర్లు | 34 లీటర్ల తేడా ఉంది |
రెండు సబ్-4 మీటర్ సెడాన్లు ఒకే పొడవు కలిగి ఉన్నట్లు ఈ టేబుల్ చూపిస్తుంది. వెడల్పు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. కానీ మారుతి డిజైర్.. హోండా అమేజ్ కంటే 2 మి.మీ వెడల్పు ఎక్కువగా ఉంది. ఎత్తు పరంగా చూసినా కూడా డిజైర్.. అమేజ్ కంటే 25 మి.మీ ఎక్కువగా ఉంది. అయితే వీల్‌బేస్ విషయానికొస్తే 2024 హోండా అమేజ్.. 2024 మారుతి డిజైర్ కంటే 20 మి.మీ ఎక్కువగా ఉంది. బూట్‌స్పేస్‌లో కూడా రెండింటి మధ్య 34 లీటర్ల తేడా ఉంది. డిజైర్ కంటే హోండా అమేజ్ ఎక్కువ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.
2024 Honda Amaze vs 2024 Maruti Dzire: పవర్‌ట్రెయిన్
పవర్‌ట్రెయిన్ | 2024 హోండా అమేజ్ | 2024 మారుతి డిజైర్ | |
ఇంజిన్ | 1.2-లీటర్, 4-సిలిండర్, సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజిన్ | 1.2-లీటర్, 3-సిలిండర్, సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజిన్ | 1.2-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్+CNG ఇంజిన్ |
పవర్ అవుట్‌పుట్ | 89 bhp పవర్ | 81 bhp పవర్ | 69 bhp పవర్ |
టార్క్ అవుట్‌పుట్ | 110 న్యూటన్ మీటర్లు | 112 న్యూటన్ మీటర్లు | 102 న్యూటన్ మీటర్లు |
గేర్ బాక్స్ | 5-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ CVT గేర్‌బాక్స్ | 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ | 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ |
మైలేజీ | 18.65 కిలోమీటర్/లీటర్ (MT) / 19.46 కిలోమీటర్/లీటర్ (CVT) | 24.79 కిలోమీటర్/లీటర్ (MT) / 25.71 కిలోమీటర్/లీటర్ (AT) | 33.75 కిలోమీటర్/కేజీ |
2024 హోండా అమేజ్, 2024 మారుతి డిజైర్ రెండూ దాదాపు ఒకే కెపాసిటీ ఇంజిన్లతో అందుబాటులో ఉన్నట్లు టేబుల్‌లో కన్పిస్తుంది. అయితే రెండింటిలో సిలిండర్ల సంఖ్య భిన్నంగా ఉంది. దీంతో రెండింటి పవర్, టార్క్‌లో తేడా ఉంటుంది. అయితే హోండా అమేజ్‌లో CNG ఇంజిన్ ఆప్షన్ లేదు. మారుతి డిజైర్‌లో మాత్రం CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాక డిజైర్ ఇంజిన్.. హోండా అమేజ్ కంటే మెరుగైన మైలేజీని అందిస్తుంది.
2024 Honda Amaze vs 2024 Maruti Dzire: ఇతర ఫీచర్లు
ఇతర ఫీచర్లు | 2024 హోండా అమేజ్ | 2024 మారుతి డిజైర్ |
ఎక్స్టీరియర్ |
|
|
ఇంటీరియర్ |
|
|
కంఫర్ట్ అండ్ కన్వెన్సెన్స్ |
|
|
ఇన్ఫోటైన్‌మెంట్ | 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లే 6 స్పీకర్లు |
|
సేఫ్టీ ఫీచర్లు |
|
|
2024 Honda Amaze vs 2024 Maruti Dzire: ధర
2024 హోండా అమేజ్ | 2024 మారుతి డిజైర్ |
రూ.8 లక్షల నుంచి రూ.10.90 లక్షలు | రూ.6.79 లక్షల నుంచి రూ.10.14 లక్షలు |
ఈ టేబుల్‌ను బట్టి కొత్త మారుతి డిజైర్ కంటే న్యూ హోండా అమేజ్ ఖరీదైనదని తెలుస్తోంది. డిజైర్ బేస్ వేరియంట్ ధర.. అమేజ్ బేస్ వేరియంట్ కంటే దాదాపు రూ. 1.21 లక్షలు తక్కువగా ఉంది. అదే సమయంలో ఫీచర్-లోడెడ్ మారుతి డిజైర్ టాప్ వేరియంట్ కూడా హోండా అమేజ్ టాప్ వేరియంట్ కంటే దాదాపు రూ.76,000 తక్కువ.
కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?- ఇప్పుడే త్వరపడండి.. లేకుంటే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం!
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్- ఇకపై గ్రూప్ చాట్‌లో నో కన్ఫ్యూజన్!
165KM రేంజ్‌తో 'విడా వీ2' ఎలక్ట్రిక్ స్కూటర్లు- కేవలం రూ.96వేలకే..!