ETV Bharat / technology

ఫొటో క్వాలిటీ పక్కా, విజువల్ రిచ్​నెస్ సూపర్​- ఇన్​స్టా ఇన్​ఫ్లుయెన్సర్స్​ వాడే ఎడిటింగ్ యాప్స్​​ ఇవే! - Best Photo Editing Apps

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 5:32 PM IST

Best Photo Editing Apps For Instagram Influencers : మీరు ఇన్​స్టా ఇన్​ఫ్లుయెన్స​ర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఇన్​స్టా ఇన్​ఫ్లుయెన్సర్స్ ఫొటో క్వాలిటీ, విజువల్ రిచ్​నెస్ కోసం వాడే టాప్-10 ఫొటో ఎడిటింగ్ యాప్స్ ఏంటంటే?

Best Photo Editing Apps For Instagram Influencers
Best Photo Editing Apps For Instagram Influencers (Getty Images)

Best Photo Editing Apps For Instagram Influencers : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా యాప్ ఇన్​స్టాగ్రామ్​ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. అందుకే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్​స్టాలో ఫొటోలు, వీడియోలను అప్​లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మీరు ఇన్​స్టా ఇన్​ఫ్లుయెన్సర్​గా ఉంటే ఫాలోవర్స్ కోసం మరింత గుడ్ కంటెంట్, మంచి క్వాలిటీ ఉన్న ఫొటోలు పెట్టడం ముఖ్యం. అందుకే ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లుయెన్సర్లు ఉపయోగించే టాప్-10 ఉత్తమ ఫొటో ఎడిటింగ్ యాప్స్​ను మీ ముందుకు తీసుకొచ్చాం.

1. Canva : ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఫొటో ఎడిటింగ్ యాప్​లో కాన్వా ఒకటి. దీని ఇంటర్​ఫేస్, బాగుంటుంది. సోషల్ మీడియా, ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, బిజినెస్ కార్డ్స్ వంటి వాటిని గ్రాఫికల్​గా, రిచ్​గా చేయడానికి కాన్వా ఉపయోగపడుతుంది. ఇందులో ఫొటో ఎడిటింగ్ చేయడానికి అధునాతన ఫొటో, వీడియో ఎడిటింగ్​పై నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదు.

2. VSCO : వీఎస్​సీఓ అనేది ఫొటోగ్రఫీ, ఫొటో ఎడిటింగ్ కోసం ఉపయోగించే ఒక మొబైల్ యాప్. ఇది ఫొటో బ్రైట్​నెస్, క్రాప్, ప్రీసెట్ ఫిల్టర్లను చేసే సాధనంగా ఉపయోగపడుతుంది. దీని పెయిడ్ వెర్షన్ కూడా ఉంది.

3. A Color Story : కలర్ స్టోరీ ఫొటో ఎడిటింగ్ యాప్​ను చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. దీంట్లో వినియోగదారులు ప్రీసెట్ ఫిల్టర్లను అప్లై చేయవచ్చు. ఈ యాప్ మూవబుల్ ఎఫెక్ట్స్, బేసిక్ ఎడిటింగ్ టూల్స్​ను అందిస్తుంది.

4. FaceTune : ఫేస్ ట్యూన్ యాప్​ను సెలబ్రిటీలు, ఇన్​స్టా ఇన్​ఫ్లూయెన్సర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ యాప్ ఫొటో మానిప్యులేషన్​లో ముఖం లేదా శరీరంలోని భాగాలను మార్చుకోవచ్చు.

5. Snapseed : ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లుయెన్సర్లు ఉపయోగించే మరొక ప్రముఖ యాప్ స్నాప్‌ సీడ్. ఇది వినియోగదారుల ఎడిగింట్ హిస్టరీని సేవ్ చేస్తుంది. అధునాతన, విభిన్న ఎడిటింగ్ అంశాల కారణంగా ఫొటోగ్రాఫర్స్​కు ఇది బాగా ఉపయోగపడుతుంది.

6. Foodie : ఈ యాప్​లో స్మార్ట్ గైడ్ ఫీచర్, లైవ్ ఫిల్టర్ ఉంది. దీన్ని నుంచి నేరుగా సోషల్ నెట్​వర్క్​లోకి ఫొటోలను షేర్ చేసేయవచ్చు. అలాగే ఫుడ్ ఫొటోలను మరింత అందంగా ఈ యాప్ ద్వారా తీర్చిదిద్దవచ్చు.

7. Adobe Lightroom : ప్రొఫెషనల్‌ తరహా ఫొటో ఎడిటింగ్ కోరుకునే వారి కోసం అడోబ్ అందిస్తున్న యాప్. ఈ యాప్​ను ఫొటోగ్రాఫర్స్ ఎక్కువగా వాడుతుంటారు. కర్వ్, ఆర్​జీబీ, కలర్స్, క్లారిటీ మంచి ఫీచర్లతో అడోబ్​ లైట్ రూమ్ లభిస్తుంది. ఇందులో ఫొటో ఎడిటింగ్ ఇతర యాప్స్​తో పోలిస్తే కాస్త కష్టం.

8. PicsArt : ఫోటో, వీడియో ఎడిటింగ్ టూల్స్​ను అందించడంలో పిక్స్ ఆర్ట్ వీఎస్​సీఓ యాప్​ను పోలి ఉంటుంది. పిక్స్ ఆర్ట్ యాప్​లో స్టిక్కర్, కోల్లెజ్ మేకర్, డ్రాయింగ్ టూల్ కూడా ఉంది. యాడ్ రహిత ఎడిటింగ్ అనుభవాన్ని పొందడానికి ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది.

9. YouCam : మంచి క్వాలిటీగా వీడియోలను ఎడిట్ చేయాలంటే యూకామ్ యాప్ ఉండాల్సిందే. ఇది మార్కెట్​లోని టాప్ సెల్ఫీ వీడియో ఎడిటర్లలో ఒకటిగా నిలిచింది. ఇన్​స్టా, యూట్యూబ్, టిక్ టాక్ వంటి వాటిలోకి యూకామ్ ద్వారా ఎడిట్ చేసిన వీడియోలను ఆప్లోడ్ చేయవచ్చు. ఇవి చాలా క్వాలిటీగా ఉంటాయి.

10. InShot : ఇన్‌ షాట్ కూడా మంచి వీడియో ఎటిడింగ్ యాప్. ఇది ప్రీసెట్ ఫిల్టర్స్, బేసిక్ వీడియో ఎడిటింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.