ETV Bharat / state

నువ్వులేని లోకంలో నేనుండలేను, బుల్లితెర త్రినయని జోడీ అకాల మరణం - Trinayani chandrakanth and Pavitra

తెలుగు బుల్లితెరపై రోజుల వ్యవధిలో రెండు విషాదాలు అలుముకున్నాయి. ఒకే సీరియల్‌లో నటిస్తూ ఒకరు రోడ్డు ప్రమాదంలో కన్నుమూస్తే, మరొకరు ఆమె మరణాన్ని తట్టులేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరూ పలు సీరియల్స్‌లో జోడీగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 1:33 PM IST

త్రినయని జోడీ చందూ పవిత్ర
త్రినయని జోడీ చందూ పవిత్ర (ETV Bharat)

Trinayani Serial chandrakanth and Pavitra: బుల్లితెర జోడీ అకాల మరణం తెలుగు ప్రేక్షకుల హృదయాలను కలిచివేసింది. నటుడు చంద్రకాంత్‌ (chandrakanth), నటి పవిత్రా జయరాం (pavithra_jayram_) జీ టీవీలో ప్రసారం అయ్యే ‘త్రినయని’(Trinayani serial)తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంటుంది. ఈ జోడీ నాలుగు రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం టీవీ ప్రేక్షకులకు విషాదం మిగిల్చింది. సహనటి పవిత్రా జయరాం మృతిని తట్టుకోలేక నటుడు చంద్రకాంత్‌ గత రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు.

బుల్లితెరలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు చంద్రకాంత్‌ (40) శుక్రవారం తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌లోనే బలవన్మరణానికి ఒడిగట్టారు. ‘త్రినయని’(Trinayani serial)తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. చంద్రకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా ఆ దంపతులు దూరంగా ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితమే త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు వెళ్లారు. అయితే బెంగళూరు నుంచి కారులో తిరిగివస్తుండగా మహబూబ్‌నగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పవిత్రా జయరాం మరణించారు. ఈ ప్రమాదంలో చంద్రకాంత్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పవిత్రా జయరాం చనిపోవటంతో చంద్రకాంత్‌ మానసికంగా కుంగిపోయారు. ఈ తరుణంలోనే హైదరాబాద్‌ మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ రోడ్డు నెంబర్‌ 20లో ఉన్న అపార్టుమెంట్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడిలో ఉన్న చంద్రకాంత్‌కు స్నేహితులు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఎంతకూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవటంతో వారు ఫ్లాట్‌కు వచ్చి చూసి చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అటు సహ నటి పవిత్రా జయరాం (Pavitra Jayaram) మహబూబ్‍నగర్‌ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. సీరియల్‌ షూటింగ్‌ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె, శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను తాకి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన పవిత్రకు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కానీ ఆమె అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

చంద్రకాంత్‌ ఆత్మహత్యకు కారణమేంటి?
పవిత్ర జయరాం మృతి చెందిన నాలుగు రోజులకే చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకోవటంపై పరిశ్రమలో విస్తృత చర్చ సాగుతోంది. వెంటవెంటనే ఇరువురి మృతిపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవిత్ర జయరాం మరణం తట్టుకోలేకే చందూ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. పైగా చందూ భార్య శిల్ప సైతం ఆమె మృతి తట్టుకోలేకే చనిపోయాడని టీవీలతో మాట్లాడుతూ చెప్పారు. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని, అందుకే తనను దూరం పెట్టారని ఆమె అన్నారు. పవిత్రను అమితంగా ప్రేమిస్తున్న చందూ ఆమె అకాల మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడని అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని శిల్ప చెప్పడం విశేషం. చందూ చెల్లి కూడు పవిత్ర పిల్లలకు జీవిత బీమా చేయించేందుకే బయటకు వెళ్లినట్లు చెప్పాడని వెల్లడించారు.

సీరియల్స్‌ ‘త్రినయని’ (Trinayani Serial), ‘నిన్నే పెళ్లాడుతా’ ద్వారా పవిత్రా-చంద్రకాంత్‌లు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పవిత్ర, చంద్రకాంత్‌ మరణంపై జీ తెలుగు విభాగం విచారం వ్యక్తం చేసింది. ‘‘త్రినయని సీరియల్‌లో తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్రా జయరాం మరణం జీ తెలుగు ప్రేక్షకులకు తీరని లోటు’’ యాజమాన్యం ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టింది.

కర్ణాటక మండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ‘జోకలి’ సీరియల్‍తో ఆమె నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘రోబో ఫ్యామిలీ’, ‘గాలిపటా’, ‘రాధారామన్’, ‘విద్యా వినాయక’ సహా కన్నడలో పలు సీరియళ్లు చేశారు. తెలుగులో ‘త్రినయని’ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో తిలోత్తమగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో తనదైన నటన ప్రదర్శించారు. పవిత్ర మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది.

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.