ETV Bharat / state

నీటి పారుదల శాఖ స్థలంలో అక్రమ నిర్మాణం - వైఎస్సార్​సీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన అధికారులు - YCP OFFICE DEMOLISHED in ap

YSRCP Office Demolished in Tadepalli in AP : ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణంపై వైఎస్సార్సీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది.

YSRCP Office Demolished in Tadepalli in AP
YSRCP Office Demolished in Tadepalli in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 11:09 AM IST

YSRCP Office Demolished at Tadepalli in AP : ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జల వనరుల శాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరుల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా రూ.2000 చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించేందుకు అప్పటి అధికారులు చకచకా అనుమతులు ఇచ్చేశారు. జీ ప్లస్‌ టు లో కార్యాలయం నిర్మించేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు.

అక్కాచెల్లెమ్మల ఓట్లు ఎటుపోయాయో అర్థం కావట్లేదు - ఇలాంటి ఫలితాలు ఊహించలేదు : వైఎస్ జగన్‌ - CM YS Jagan Reacted To AP Election Results

5 బుల్డోజర్లతో 2 గంటల్లోనే కార్యాలయం కూల్చివేత : ప్రభుత్వం మారిన నేపథ్యంలో జలవనరులశాఖ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ సీఆర్డీఏ అధికారులు 4 రోజుల క్రితం వైఎస్సార్సీపీకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్డీఏకు కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 5 బుల్డోజర్లతో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం 2 గంటల్లోనే కూల్చివేతను అధికారులు పూర్తి చేశారు. ఈ కూల్చివేతలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

వెనకదారి గుండా జగన్ రెడ్డి ఎంట్రీ - తడబడుతూ ప్రమాణస్వీకారం - Pulivendula MLA YS Jagan Oath

శుక్రవారం హైకోర్టులో వాదనలు : గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సీఆర్‌డీఏకు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తమ కార్యాలయం కూల్చివేతకు సీఆర్డీఏ యత్నిస్తోందంటూ వైఎస్సార్సీపీ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్‌ వేసింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. తుది ఉత్తర్వులివ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్‌డీఏకు స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించారు.

కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి - జగన్ షాకింగ్​ కామెంట్స్ - Jagan Videos Viral On Social Media

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.