ETV Bharat / state

ఎమ్మెల్యే రాచమల్లు కుటిల రాజకీయం- బ్యాంక్‌ల వద్ద అవ్వాతాతలను మభ్యపెట్టే యత్నం - MLA Rachamallu Sivaprasad Reddy - MLA RACHAMALLU SIVAPRASAD REDDY

MLA Rachamallu Sivaprasada Reddy Selfish Politics : వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డ్రామా రాజకీయాలకు తెరతీశారు. పింఛన్ల కోసం ఆపసోపాలు పడుతూ బ్యాంకులకు వెళ్తున్న వృద్ధుల ఓట్ల కోసం కుటిల రాజకీయం చేస్తున్నారు. బ్యాంక్‌ల వద్దకు వెళ్లి చంద్రబాబు వల్లే పింఛన్లు ఇంటికి రాలేదంటూ అవ్వతాతలను మభ్యపట్టే ప్రయత్నం చేశారు.

ysrcp_leader
ysrcp_leader (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 3:59 PM IST

YSRCP MLA Rachamallu Sivaprasada Reddy Selfish Politics Proddatur YSR District : బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి నోటి నుంచి నిరంతరం బూతుల జల్లు కురుస్తుంటుంది. తాను ఒక ప్రజాప్రతినిధి అని మర్చిపోయి బహిరంగంగా అసభ్య పదజాలంతో ఇతరులను దూషిస్తూ తిరుగుతుంటారు. మాటకారితనంతో శ్రీరంగ నీతులు వల్లిస్తూ ప్రజలను కుటిల యత్నాలతో నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు.

ప్రొద్దుటూరు ప్రజల ఎవరూ రాచమల్లును నమ్మొద్దు: వరదరాజులరెడ్డి - TDP Candidate Varadarajulu

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ స్వార్థం కోసం అవ్వాతాతలకు పింఛన్లను బ్యాంకుల్లో జమ చేసిన విషయం అందరికి తెలిసిందే. మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ అవకాశాన్ని తనకు ఎన్నికల్లో అనువుగా మలుచుకునేందుకు ప్రొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే రాచమల్లు బ్యాంకుల గడప తొక్కుతూ కుటిల రాజకీయానికి తెరతీశారు. గతంలో వాలంటీర్ల ఇళ్ల వద్దకు పింఛన్లు పంపిణీ చేసేవాళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడానికి చంద్రబాబు కుట్ర పన్నాడని మొసలి కన్నీరు కారుస్తున్నారు.

అనుమతి లేకుండా రాచమల్లు ప్రచారం - అడ్డుకున్న అధికారులు

పింఛన్​ కోసం అవస్థలు పడుతున్నా అవ్వాతాతలను అక్కున చేర్చుకున్నట్లుగా నటించడం వారితో పాటు నేలపై కూర్చుని మాటలు కలుపుతూ దీనికి అంతా కారణం చంద్రబాబే అంటూ వృద్ధులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ సమస్య పోవాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో జగన్​కి ఓటేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్ద పింఛన్లు ఇస్తామంటూ నమ్మబలికారు. తాను చంద్రబాబును తిట్టడంతో పాటు వృద్ధులతో తిట్టించడానికి ఎత్తులు వేశారు. తన సహచరుల ద్వారా మజ్జిగ తెప్పించి వారికి ఇస్తూ తానూ తాగుతూ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీస్తోంది.

చెన్నకేశవస్వామి ఆలయ భూమి కబ్జా చేయలేదు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

ప్రొద్దుటూరు ఎమ్మల్యే రాచమల్లు కుటిల రాజకీయం - బ్యాంక్‌ల వద్దకు వెళ్లి అవ్వతాతలను మభ్యపెట్టే యత్నం (Etv Bharat)

ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా రాచముల్లు రెండు పర్యాయాలు ఎన్నికైనా ఎలాంటి అభివృద్ధి చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన పది సంవత్సరాల్లో భూ అక్రమాలు, ఇసుక మాఫియా, చిరువ్యాపారుల నుంచి అక్రమార్జనలతో కోట్లు వెనుక వేసుకున్న నాయకుడుగా ముద్ర వేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. అలాంటి వ్యక్తి రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.