YSRCP Leaders Remove Votes : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు 163 మంది వ్యక్తులు ఒక్కొక్కరు పదికన్నా ఎక్కువ ఫారం- 7 (Form-7) దరఖాస్తులు చేశారు. వీరిలో వంద దరఖాస్తులు చేసినవారు కూడా ఉన్నారు. దీనిపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ముగ్గురు సభ్యుల కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. 163 మంది నుంచి వచ్చిన 4వేల 409 అభ్యంతరాలను పరిశీలించింది. ఇందులో 750 అభ్యంతరాల్లో 545 మంది ఓటర్ల జాబితాలో ఉన్న చిరునామాలోనే ఉంటున్నారని నిర్థారించింది.
Fake Voters in in Vishaka : పనుల కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని తేలడంతో వారి ఓట్లను యథాతథంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. మరో 205 మంది జాబితాలో పేర్కొన్న చిరునామాలోనే ఉన్నారు. అయినా వీరి ఓట్లు తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేశారని నిర్ధారించారు. ఈ ఓట్లు తొలగించాలని ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసిన వారిని గుర్తించి, కేసులు నమోదు చేశారు. సంబంధం లేని వ్యక్తుల ఓట్లు తొలగించాలని 163 మంది పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేయడమే పెద్ద తప్పిదం. దాని తీవ్రతను తగ్గించేందుకు 10 మందిపై మాత్రమే కేసులు పెట్టి, మరో 13 మందిని హెచ్చరించి మిగిలినవారిని వదిలేశారనే ఆరోపణలున్నాయి.
సజ్జల కుటుంబానికి డబుల్ ఓట్లు - ఓటర్ల జాబితాలో పారదర్శకతకు తూట్లు
Irregularities in Andhra Pradesh Voter List : 66 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన బి.రంగనాయకమ్మ అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వైఎస్సార్సీపీ పశ్చిమ ఇన్‌ఛార్జి ఆడారి ఆనందకుమార్‌కు చెందిన పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారని తెలిసింది. వార్డు వాలంటీరు భార్య అయిన రొంగలి సుధ, వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లీలానాగవల్లి, వైఎస్సార్సీపీ 204 బీఎల్ఏ జి.నూకరాజుతోపాటు సాకూరి సత్యవతి, కొలిచాన రవి, ఎస్.సుజాత, టి.యశ్వంత్‌రావు, కె.సత్తిబాబు, జి.కావ్య అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు.
ఫాం 6తో బోగస్ ఓట్లకు దరఖాస్తు- బీఎల్వోల పరిశీలనలో వెలుగులోకి అనేకం
అధికారులకు తప్పుడు సమాచారం, ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం, ఇతరుల చట్టబద్ధమైన హక్కులకు ఇబ్బంది కలిగించడం, కావాలనే తప్పుడు పత్రాలు అందజేయడం అనే నేరాల కింద వివిధ సెక్షన్లు కింద కేసులు పెట్టారు. ఇది నిరూపణ అయితే ఆర్నెల్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల ఆపరాధ రుసుం, తీవ్రమైతే రెండేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుం విధిస్తారు. లేదా రెండు శిక్షలూ విధించొచ్చు. అయితే పోలీసులు కేసులు నమోదు చేసినా ఇప్పటివరకు వారికి ఎలాంటి నోటీసులూ అందజేయలేదని తెలుస్తోంది.
ఆ ఓటరు పేరు 'దదదద', తండ్రి 'రరకత' - అధికార పార్టీ ఆత్మలకూ ఓటు హక్కు!