ETV Bharat / state

పోలింగ్​రోజు పోలీసులపైనా వైఎస్సార్సీపీ వీరంగం- ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - YSRCP Leaders Attack On Police

YSRCP Leaders Violence in AP Elections 2024 : ఏపీలో పోలింగ్​ రోజు వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. ఇటు టీడీపీ కార్యకర్తలపై దాడులు, సామాన్య ప్రజలను భయపెట్టడమే కాకుండా పోలీసులపై సైతం వారి పైశాచికత్వం చూపించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పల్నాడులోనే జరిగింది.

YSRCP Leaders Attack On Police in Palnadu
YSRCP Leaders Attack On Police in Palnadu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 11:39 AM IST

పోలింగ్​రోజు పోలీసులపైనా వైఎస్సార్సీపీ వీరంగం (ETV Bharat)

YSRCP Leaders Attack On Police in Palnadu : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా బొల్లాపల్లి ఎస్సై చెన్నకేశవులుపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13న పోలింగ్ రోజున రాత్రి సమయంలో బొల్లాపల్లిలో మూగ చింతలపాలెం గ్రామానికి తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై చెన్నకేశవులు ఆ దాడిని అడ్డుకుని వారి కారుని తప్పించారు.

పోలీసులపై వైసీపీ దాడులు : ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తెలుగు యువత నేతలు మాత్రం అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారు వెళ్లిపోయిన తర్వాత ఎస్సై చెన్నకేశవులుపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ వారికి రక్షణ కల్పిస్తావా అంటూ ఆయనపై పిడిగుద్దులు గుద్దారు. కర్రలతో దాడి చేశారు. అడ్డుకున్న కానిస్టేబుల్ నాగేంద్రని కూడా కొట్టారు. ఈ ఘటనలో ఎస్సై చెన్నకేశవులు తలకు గాయమైంది.

రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి - High Tension In Tadipatri

AP Elections violence 2024 : కానీ అధికార పార్టీ నేతలు కావటంతో ఎస్సై చెన్నకేశవులు మౌనంగా ఉండిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిని తెలుగు యువత నాయకులు తమ సెల్‌ఫోన్​లో రికార్డు చేశారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావటంతో ఎస్సైపైనా దాడి జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈవిషయంపై ఎస్సై చెన్నకేశవులుని అడగ్గా దాడి జరిగింది నిజమేనన్నారు. అయితే ఆ ఘటనను వదిలేసినట్లు ఆయన చెప్పారు.

Attacks in Palnadu 2024 : ఎన్నికల సందర్భంగా గొడవలు జరుగుతాయని భావించిన అధికారులు ముందుగానే భద్రత చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వైసీపీ మూకల దాడులు నిలువరించలేకపోయారు. పోలింగ్​ ముగిసిన తర్వాత సైతం పల్నాడు నివురుగప్పిన నిప్పులా మారింది. వైఎస్సార్సీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు మరింత పెచ్చుమీరిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పథక రచన చేసి రక్తపాతం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పెట్రో బాంబులు నిల్వలు సైతం బయటపడ్డాయి. భారీ మొత్తంలో పెట్రో బాంబులు ఎవరు తయారు, పేలుడు సామాగ్రి కూడా పోలీసులుకు చిక్కింది. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారో సమాచారం ఉందని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు వివరించారు. ప్రస్తుతం పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వైఎస్సార్సీపీ దమనకాండ - పులివర్తి నానిపై హత్యాయత్నం - కారంపూడి, తాడిపత్రిలోనూ విధ్వంసం - AP Elections 2024

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి - పద్మావతి యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత - Attack on Pulivarthi Nani in Tpty

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.