ETV Bharat / state

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వైసీపీ లీడర్స్!- ఎక్కడ దాక్కున్నట్టు? - YSRCP LEADERS ABSCONDING IN AP - YSRCP LEADERS ABSCONDING IN AP

Mangalagiri TDP Office Attack Case Update : నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడే వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పక్క రాష్ట్రాలకు జారుకుంటున్నారు. అధికారంలో ఉండగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాలపై దాడి కేసులలోని నిందితులు అజ్ఞాతవాసం చేయడానికి సిద్దమయ్యారు. ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ కొట్టి వేసిన క్షణాల్లోనే ఆ కేసులో నిందితులంతా రహస్య ప్రదేశాలకు చెక్కేశారు.

YCP Leaders
Nandigam Suresh Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 1:16 PM IST

YSRCP Leaders Absconding in Fear Of Arrest : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఆ వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టడంతో నిందితులు అండర్​ గ్రౌండ్​ బాటపట్టారు . ఇదే కేసులో అమరావతి నుంచి తప్పించుకుని పారిపోయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దీంతో మిగతా నిందితులు ఒక్కరూ అందుబాటులో లేకుండా పోయారు.

Nandigam Suresh Arrest: చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడే మాజీ మంత్రి జోగిరమేష్‌ సైతం పరారయ్యారు. అదే కోవలో దేవినేని అవినాష్ కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వారి నివాసాల వద్ద మఫ్టీలో కాపుకాస్తున్నారు. దీంతో పరిస్థితిని గమనించి వారంతా ఆంధ్రప్రదేశ్​ను వీడి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలో తలదాచుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదే కేసులో నిందితుడైన విజయవాడ మాజీ మేయర్‌ శైలజ భర్త, వైసీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డి సైతం ఫోన్లు ఆపేసి విజయవాడ, గుంటూర్లలో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. నిందితులందర్ని ఎలాగైనా అరెస్టు చేయాలన్న లక్ష్యంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిఘా బృందాలు విమానాశ్రయాలతో పాటు పోర్టుల వద్ద కూడా మాటువేశాయి.

Devineni Avinash: గతంలో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు దేవినేని అవినాశ్‌ ఏకంగా విదేశాలకు వెళ్లేందుకు యత్నించారు. విదేశాలకు వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి శంషాబాద్‌ విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన యత్నించగా మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు.

అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో అధికారులు అవినాష్‌కు అడ్డు చెప్పడంతో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన వెనుదిరిగారు. ప్రస్తుతం అవినాశ్‌ చైన్నై గానీ, బెంగళూరు కానీ వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. అరెస్టు భయంతో దేవినేని అవినాష్‌, జోగి రమేష్‌ ఎక్కడికెళ్లారు? వీరికి ఎవరు ఆశ్రయం ఇచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతోన్నారు. ఈ నేతలు ఎక్కడున్నా అరెస్టు చేయాలని మంగళగిరి పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.