ETV Bharat / state

వర్సిటీల్లో అభివృద్ధి మరిచి నిధులను హారతి కర్పూరంలా కరిగించేసిన జగన్ సర్కార్‌ - YSRCP Govt Neglected Universities - YSRCP GOVT NEGLECTED UNIVERSITIES

YSRCP Government Neglected Universities Development: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దశాబ్దాలుగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వచ్చే డబ్బులను కాజేసింది. గత ఐదేళ్లలో మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం, విజయవాడలోని ఆరోగ్య వర్సిటీ ఆర్థిక పరిస్థితిని జగన్‌ సర్కారు భ్రష్టుపట్టించింది.

ysrcp_govt_neglected_universities
ysrcp_govt_neglected_universities (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 3:36 PM IST

YSRCP Govt Neglected Universities Development: విద్యార్థులు కట్టే ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం హారతి కర్పూరంలా కరిగించేసింది. వర్సిటీల్లో కనీస అభివృద్ధి కూడా చేయకుండా వదిలేసి వెళ్లిపోయింది. 2019లో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చేనాటికి కృష్ణా విశ్వవిద్యాలయం ఖాతాలో 110 కోట్లకు పైగా నిధులున్నాయి. గత ఐదేళ్లలో జగన్‌ ఆశీస్సులతో వచ్చిన వీసీలంతా ఈ నిధులపై కన్నేసి వాటిలో 37 కోట్లు కరిగించేశారు. ప్రస్తుతం కృష్ణా వర్సిటీ ఖాతాలో 73కోట్లు మాత్రమే మిగిలాయి. ఇవికాకుండా ఏటా విశ్వవిద్యాలయానికి 6 కోట్ల రూపాయల వరకూ రకరకాల ఫీజుల రూపంలో ఆదాయం వస్తుంది.

ప్రధాన ద్వారం వద్ద వైఎస్సాఆర్‌ విగ్రహం: గత ఐదేళ్లలో ఇదో 30 కోట్ల రూపాయాలు కలిపితే మొత్తంగా 67 కోట్ల రూపాయలకుపైగా వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో వీసీలుగా వచ్చిన వాళ్లు ఖర్చు చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో ఆరంభించిన అభివృద్ధి పనుల్ని ఎక్కడికక్కడే వదిలేశారు. విద్యార్థుల వసతులకు సంబంధించిన 5లక్షల రూపాయలతో కృష్ణా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం అనుబంధ కళాశాలల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఓ మూలన పడేశారు.

విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార కేంద్రంగా మార్చిన వైఎస్సార్సీపీ - YSRCP Irregularities Matam Lands

2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం శివారులోని రుద్రవరంలో 71 కోట్ల రూపాయలతో కృష్ణా విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణం నిర్మించారు. విద్యార్థులకు అవసరమైన వసతి గృహాలు, క్రీడా మైదానం, ఫార్మా సైన్స్, రీసెర్చ్‌ భవనాలు, ఇంజినీరింగ్‌ కళాశాల, ఫుడ్‌కోర్టు, విశ్వవిద్యాలయం చుట్టూ ప్రహరీ గోడ, ప్రవేశ ద్వారం, ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌ల కోసం షెడ్ల నిర్మాణం ప్రభుత్వం డబ్బులతో చేపడతామంటూ అప్పట్లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఈలోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ డబ్బులను ప్రభుత్వం ఇవ్వకుండా విశ్వవిద్యాలయం ఖాతా నుంచి వాడుకోవాలని ఆదేశించింది.

వైఎస్సార్​సీపీతో అంటకాగే వీసీ, రిజిస్ట్రార్‌ సహా ఉన్నతాధికారులంతా వెంటనే వర్సిటీ ఖాతాలోని 110 కోట్లను కరిగించేందుకు రంగంలోకి దిగారు. 43 కోట్ల 31లక్షల రూపాయలతో ఈ భవనాల నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. వైఎస్సార్​సీపీకి చెందిన విశాఖ మాజీ ఎంపీకి సన్నిహితుడైన ఓ గుత్తేదారుకు సబ్‌కాంట్రాక్టును ఇచ్చారు. ఇప్పటివరకూ 23కోట్ల రూపాయలను గుత్తేదారుకు చెల్లించారు. కానీ పనులు మాత్రం 10కోట్ల విలువైనవి కూడా చేపట్టలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీసీలు, రిజిస్ట్రార్‌లు, గుత్తేదారుతో కలిసిపోయి ఈ డబ్బులను తినేశారని విమర్శిస్తున్నారు.

ఐదేళ్లుగా తాటిపూడి ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం - తుప్పుపట్టిన ప్రధాన గేట్లు - no repair for Tatipudi project

గుత్తేదారుకు మేలు చేసేందుకే: భవనాలు పునాది దశలోనే చాలావరకు వదిలేసి నిధులు మాత్రం తినేశారు. గతంలో ఉన్న వీసీలు 17కోట్ల రూపాయలు విడుదల చేస్తే తాజాగా రాజీనామా చేసిన వీసీ జ్ఞానమణి మరో అడుగు ముందుకేశారు. 2023 జులైలో బాధ్యతలు చేపట్టిన వెంటనే గుత్తేదారుకు 5 కోట్లను విశ్వవిద్యాలయం ఖాతా నుంచి విడుదల చేయించారు. పనులు జాప్యాన్ని సాకుగా చూపిస్తూ ధరలు పెరిగిపోయాయంటూ ఈ భవనాల బడ్జెట్‌ అంచనాలను 51కోట్లు పెంచి మరో 7కోట్లను గుత్తేదారుకు అదనంగా మేలు చేశారు.

పైగా నిర్మాణంలో ఉన్న భవనాల నమూనాలను సైతం మార్చేశారు. అసలు ఒక నమూనా నిర్ణయించి నిర్మాణం ఆరంభించాక మధ్యలో మళ్లీ ఎలా మారుస్తారంటే సమాధానం చెప్పేవాళ్లు లేకుండాపోయారు. పైగా కంప్యూటర్లు, టేబుళ్లు, ఫర్నీచర్, ఎలక్ట్రికల్‌ పనులంటూ 14కోట్ల రూపాయలను కరిగించారు. ఇలా మొత్తంగా గుత్తేదారుకు ఇచ్చిన 23కోట్లతో కలిపితే విశ్వవిద్యాలయానికి చెందిన 37 కోట్లను దోచిపెట్టారు.

కాకాణి ఇలాకాలో అక్రమ లేఅవుట్లు - అనుమతి లేకున్నా ప్లాట్ల విక్రయం - YSRCP Leaders Illegal Layouts

డబ్బులు లేక అయోమయం: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి సంబంధించిన 400 కోట్ల రూపాయలనూ రాత్రికి రాత్రి పావులు కదిపి 2021లో జగన్ ప్రభుత్వం సర్కారు ఖజనాలోకి మళ్లించింది. ఏటా 2 కోట్ల వడ్డీ పేరుతో ఇస్తున్నారు. పైగా గతంలో విశ్వవిద్యాలయం నిర్వహణ కోసం ఏటా ప్రభుత్వం ఇచ్చే 8 కోట్ల రూపాయలను జగన్‌ సర్కారు ఆపేసింది. ఫలితంగా వర్సిటీ అభివృద్ధికి కనీసం ఒక్క ముందడుగు కూడా వేయలేని దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఓ భవనం కట్టాలన్నా డబ్బులు లేక అయోమయంగా దిక్కులు చూడాల్సి వస్తోంది. ఈ ఐదేళ్లలో కృష్ణా వర్సిటీ, విజయవాడ హెల్త్ వర్సిటీలో అవకతవకలు, అక్రమాలు, ఆర్ధిక విధ్వంసంపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని, ఉద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.