YS Sharmila Complaints to Hyderabad Cyber Crime : సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు పోస్టులు పెడుతున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరపూరిత దురుద్దేశంతో తనను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానెళ్లులతో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో కొందరు నిరాధారపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, మహిళ ప్రతిష్ఠను దిగజార్చేలా ఈ పోస్టులు ఉంటున్నాయని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
ఫేక్ న్యూస్ వ్యాప్తిలో తెలంగాణ టాప్ - విద్వేషాలు రెచ్చగొట్టే ఘటనలు హైదరాబాద్‌లోనే అత్యధికం
నాపై అసభ్య కామెంట్లు : ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని కలుస్తూ ప్రచారం ప్రారంభించానని వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ నేపథ్యంలో కొందరు నేరపూరిత ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో తనతో పాటు తన సహచరులపైనా అభస్య కామెంట్లు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ నిరాధరమైనవే అయినా ఇబ్బంది కలిగిస్తూ అవమానించేలా ఉన్నాయని వివరించారు. షర్మిల తన అన్నతో విభేదించి వైఎస్‌ఆర్, వైఎస్ జగన్‌కు ఆజన్మ శత్రువులైన చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నానని అంటున్నారని వైఎస్ షర్మిల తెలిపారు.
Sharmila on Social Media Trolls : ఇటువంటి వ్యాఖ్యలు, పోస్టులతో తనతోపాటు సహచరుల వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల వెల్లడించారు. తన కుటుంబ ప్రతిష్ఠ ప్రమాదంలో పడిపోయిందని, వారిపై చర్యలు తీసుకోకపోతే తమకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని అన్నారు . రమేశ్ బులగాకుల, మేదరమెట్ల కిరణ్‌కుమార్, ఆదిత్య(ఆస్ట్రేలియా), సత్యకుమార్ దాసరి(చెన్నై), పంచ్ ప్రభాకర్(అమెరికా), సేనాని, వర్రా రవీందర్‌రెడ్డి, మహ్మద్ రెహ్మత్ పాషా, శ్రీరెడ్డి తదితర వ్యక్తులు సోషల్ మీడియా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వైఎస్ షర్మిల భర్త అనిల్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఏది ఫేక్? ఏది రియల్?- దేశవ్యాప్తంగా కొత్త దుమారం రేపుతోన్న డీప్‌ఫేక్ టెక్నాలజీ
ప్రాణహాని ఉందంటూ వైఎస్ సునీత ఫిర్యాదు : మరోవైపు ఇటీవలే తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత (YS Sunitha) సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఇటీవల ఫేస్‌బుక్‌లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారని డీసీపీ వివరించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్రీవల్లి తెలిపారు.
సోషల్ మీడియాలో వారికి నో ఎంట్రీ - బిల్లు పాస్ చేసిన ప్రభుత్వం!
సామాజిక మాధ్యమాలే వేదికగా తప్పుడు సమాచారం... పోలీసుల నిరంతర నిఘా