YS Jagan Away From the Speaker Election Process in AP Assembly : ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో పాలుపంచుకోరాదని వైఎస్సార్సీపీ నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. స్పీకర్‌ను అన్ని పార్టీలు కలిసి సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తుండగా ఇవాళ సభకు దూరంగా ఉండాలని జగన్ రివర్స్ సంప్రదాయానికి తెరతీశారు. ఇంతకీ జగన్ ఎందుకిలా చేస్తున్నారు? ఓటమి బాధ నుంచి బయటపడలేకపోతున్నారా? ప్రజాతీర్పును జీర్ణించుకోలేకపోతున్నారా?
YS Jagan In AP Assembly : అసెంబ్లీలో ఇలా చేసిన ప్రమాణానికి జగన్ విలువ ఇవ్వడం లేదు. 'సభా సంప్రదాయాలు పాటిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన జగన్, స్పీకర్ ఎన్నిక విషయంలో ఆనవాయితీకి మంగళం పలికారు. స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సభా సంప్రదాయం. అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీల నుంచి ఒక్కో సభ్యుడు వచ్చి స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తిని సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెడతారు. పార్టీ తరఫున అభినందనలు తెలుపుతారు.
2019లో 23 స్థానాలకు పడిపోయిన చంద్రబాబు కూడా అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిక సమయంలోనూ అదే ఆనవాయితీని కొనసాగించారు. పార్టీ తరఫున అచ్చెన్నాయుడును సభాధ్యక్ష స్థానం వద్దకు పంపారు. ఆ తర్వాత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు తాను రాకపోవడమే కాదు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలందరినీ నేడు అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఆదేశించారు.
వెనకదారి గుండా జగన్ రెడ్డి ఎంట్రీ - తడబడుతూ ప్రమాణస్వీకారం - Pulivendula MLA YS Jagan Oath
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. గెలినప్పుడు పొంగిపోకూడదు, ఓడినప్పుడు కుంగిపోకూడదు. రెండింటినీ సమానంగా తీసుకోగలగాలి. కానీ వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా అంటే రాజకీయ పరిశీలకులు అవుననే సమాధానమే చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు పొంగిపోయిన జగన్, 2024లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయే సరికి షాక్ తిన్నారు. కాకపోతే ఆ షాక్ నుంచి ఆయనింకా బయటకు రావడం లేదు. అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమైపోయాయోనంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఓటమిని హుందాగా స్వీకరించలేకపోతున్న జగన్, ఆ క్రమంలో రాజకీయ సంప్రదాయాలూ పాటించకుండా, రాజ్యాంగబద్ధమైన స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది.
తొలిరోజు సందడిగా శాసన సభ - చంద్రబాబు, పవన్, జగన్ ఎలా స్పందించారంటే? - AP Assembly Sessions 2024
AP Assembly Sessions : నిజానికి ఓటమి బాధలో ఉన్న జగన్‌పై కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అందరూ అనుకున్న దానికి భిన్నంగా హుందాతనం ప్రదర్శించింది. శాసన సభ కొలువుదీరిన మొదటిరోజే వైఎస్సార్సీపీ సభ్యుల గౌరవానికి భంగం కలిగించొద్దని కూటమి సభ్యులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ వాహనానికి నిబంధనల ప్రకారం అనుమతి లేకపోయినా జగన్ వాహన శ్రేణిని అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్టికో వరకు అనుమతించారు.
పైగా వైఎస్సార్సీపీ సభ్యుల విజ్ఞప్తి మేరకు మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు అంగీకరించారు. చంద్రబాబు ఇంతగా పెద్దమనసు చాటినా జగన్ ఇంకా పరిణతి ప్రదర్శించలేకపోతున్నారు. సభలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత కాసేపైనా సీట్లో కూర్చోకుండా బయటకు వెళ్లిపోవడం కూడా గతంలో ఎన్నడూ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్పీకర్ బాధ్యతల స్పీకారాన్నీ బహిష్కరించి జగన్ మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
రెండు కళ్లూ పొడిచేశారు! - విలువల విధ్వంసానికి ప్రతీకగా ప్రజావేదిక - SYMBOL OF DESTRUCTION IN AP