Jagan on SC ST Sub Caste Classification : ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం హోదాలో వైఎస్ జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగం అంగీకరించదని ఆయన అన్నారు. ఏదైనా చేసినా అది నిలబడదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబుపైనా ఆనాడు విమర్శలు గుప్పించారు.
జగన్ విమర్శలు : ఎస్సీ వర్గీకరణను కోర్టు కొట్టేస్తుందని తెలిసీ చంద్రబాబు తీసుకు వచ్చారని జగన్ ఆనాడు అన్నారు. ఈ క్రమంలోనే కోర్టు కొట్టేసిందని చెప్పారు. వర్గీకరణ పేరుతో మాదిగ, మాలల మధ్య విభేదాలు తీసుకువచ్చి, ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు దీనిని తెచ్చారని పేర్కొన్నారు. ఇది చేయలేమని, రాజ్యాంగం ఇందుకు ఒప్పుకోదనీ తెలుసని చెప్పారు. ఏదైనా చేస్తే అది నిలబడదని, ఎవరైనా కోర్టుకు వెళితే దాన్ని కొట్టేస్తారనీ తెలిసినా, రాజకీయ లబ్ధి కోసం ఎస్సీల్లో చిచ్చుపెట్టి వర్గీకరణ తీసుకువచ్చారని తెలిపారు. దానివల్ల ఏం జరిగిందని ప్రశ్నించారు. కోర్టు కొట్టేసిందన్నారు. కోర్టు కొట్టేస్తుందని తనకు తెలియదా? తెలిసినప్పుడు ఎందుకు చేశారంటూ జగన్ విమర్శలు గుప్పించారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు - పార్టీలకతీతంగా స్వాగతించిన నేతలు - SC ST SUB CLASSIFICATION
Supreme Court on SC/ST Cub Classification :షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం కీలక తీర్పునిచ్చింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చిచెప్పింది. అయితే, ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు- అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
'ఎస్సీ రిజర్వేషన్ నిష్పక్షపాతంగా చేయాలి - మాలల హక్కుల కోసం ఉద్యమిస్తాం'