ETV Bharat / state

తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్​ 'ప్రణీత్​ హనుమంతు అరెస్ట్' - YouTuber Praneeth Hanumanthu arrest

YouTuber Praneeth Hanumanthu Controversy : ఎట్టకేలకు యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతు అరెస్ట్​ అయ్యాడు. సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

YouTuber Praneeth Hanumanthu Controversy
YouTuber Praneeth Hanumanthu Controversy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 8:07 PM IST

Updated : Jul 10, 2024, 10:33 PM IST

YouTuber Praneeth Hanumanthu was Arrested : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్​ను పోలీసులు అరెస్టు చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రణీత్​ హనుమంతును సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచి పోలీసులు హైదరాబాద్​కు తరలించారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది : యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతు ఓ యూట్యూబ్​ వీడియోలో తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్​చాట్​ చేసిన విషయం తెలిసిందే. అతనితో పాటు మరో ముగ్గురు యువకులు కలసి వేర్వేరు చోట్ల కూర్చుని ఒక రీల్​ గురించి లైవ్​లో మాట్లాడారు. ఆ రీల్​లో ఒక తండ్రి, కుమార్తె ఉంటారు. తండ్రి కూతురు మధ్య అసభ్యకర సంబంధం అనే అర్థం వచ్చేలా సంభాషించారు.

ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో సినీనటుడు సాయిదుర్గ తేజ్​ దారుణంగా వీడియోలు చేస్తున్నారంటూ ఎక్స్​ వేదికగా స్పందించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్​రెడ్డి, చంద్రబాబుతో పాటు మరికొందరికి ఆయన ట్యాగ్​ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని టీజీ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఆదేశించారు. ఆ వెంటనే మంత్రి సీతక్క, సినీ నటుడు మంచు మనోజ్​ రియాక్టు అయి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

యూట్యూబర్లకు మంచు విష్ణు వార్నింగ్ : నటీనటులపై అసభ్యకర, అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్లను మా అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. నటీనటులు, వారి కుటుంబ సభ్యులపై అశ్లీలంగా పెట్టిన వీడియోలు, పోస్టులను 48 గంటల్లో తొలగించాలని సూచించారు. లేదంటే ఆ యూట్యూబర్లపై క్రిమినల్​ కేసులు నమోదు చేసి ఛానల్స్​ను మూసివేస్తామని చెప్పారు. ఇటీవల ఓ చిన్నారిపై అసభ్యకరంగా మాట్లాడిన యూట్యూబర్​ ఉదంతంపై స్పందిస్తూ ప్రత్యేక వీడియోను మంచు విష్ణు విడుదల చేశారు.

మహిళలను కించపరిచేలా వ్యవహరించిన ఆ యూట్యూబర్​పై చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో మా అసోసియేషన్​కు చాలా మంది నటీనటులు లేఖలు, మెయిల్స్​ రాస్తున్నారని, తమ వీడియోలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు విష్ణు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా నటీనటుల వ్యక్తిత్వాన్ని కించపరిస్తూ వీడియోలు చేస్తున్న యూట్యూబర్లకు హెచ్చరికలు పంపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంచు విష్ణు కోరారు.

ఇట్స్ నాట్ ఫన్!! అది నోరా డ్రైనేజా? - యూట్యూబర్​పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు - YouTuber P Hanumanthu Controversy

'అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను' - ఆ వ్యక్తికి మంచు మనోజ్ మాస్ వార్నింగ్

Last Updated : Jul 10, 2024, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.