Online Cricket Betting In Telangana : ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రాణాలు తీస్తోంది అంతే కాదు కన్నవారికి కడుపుకోతను మిగులుస్తుంది. తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బెట్టింగ్‌కు అలవాటుపడ్డ ఇంజినీరింగ్ విద్యార్థి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ. 25 లక్షల అప్పు చేసిన అతను ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పందెం కాశాడు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చివరికి ఉరేసుకున్నాడు. ఇదొక్కటే కాదు బెట్టింగ్ మహమ్మారి ఎన్నో దారుణాలకు కారణమవుతోంది. మరో కేసులో బెట్టింగ్‌కు అలవాటుపడ్డ రత్నకిశోర్ అనే యువకుడు లోన్ యాప్‌లో రుణం తీసుకున్నాడు.
బెట్టింగ్ కోసం చోరీలు : గతేడాది ప్రపంచకప్ సందర్భంగా భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనికి తన యజమాని తల్లి ఒంటిపై బంగారు ఆభరణాలను కొట్టేయాలనుకున్నాడు. వృద్దురాలు నిద్రించగానే ఊపిరాడకుండా చేసి బంగారు గాజులు తీసుకుని పరారయ్యాడు. చివరకు ఆదిభట్ల పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. గత నెలలో కేపీహెచ్‌బీ పోలీసులు ఓ దొంగను అరెస్టు చేశారు. చోరీలు ఎందుకు చేస్తున్నావని పోలీసులు ప్రశ్నించగా బెట్టింగ్‌కు డబ్బు కోసం చోరీ చేస్తున్నట్లు చెప్పాడు. ఇతను పోలీసు స్టేషన్ నుంచి పరారవ్వడం అప్పట్లో కలకలం రేపింది.
ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ - రూ. 43లక్షల సొమ్ము స్వాధీనం - Cricket betting gang arrest
కీసర పోలీసులకు ఇటీవల బైకు దొంగ దొరికాడు. వాహనాలు ఎందుకు దొంగిలిస్తున్నావని అడగగా ఆన్‌లైన్ బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చేస్తున్నట్లు చేస్తున్నట్లు అంగీకరించాడు. బెట్టింగ్ ఒకప్పుడు ఖరీదైన వ్యవహరంగా గుట్టుగా నడిచేది. ఆన్‌లైన్ యాప్‌లు, వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాక ఈ మహమ్మారి స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ప్రారంభంలో పెట్టుబడికి వందలు, వేలు లాభాలు రావడంతో ఆశపడుతున్న కొందరు లక్షల్లో పందెం కాస్తున్నారు. వీటిని తీర్చడానికి అప్పులు చేస్తున్నారు.
చివరకు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురై క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవానికి బెట్టింగ్ యాప్‌లు పూర్తిగా మోసపూరితం. పందెం కాసినప్పుడు తొలుత లాభాలు ఇచ్చేలా యాప్‌ల అల్గారిథమ్ ఉంటుంది. క్రమంగా ఎక్కువ పెట్టుబడి పెట్టాక విత్‌డ్రా చేయడానికి వీల్లేకుండా చేస్తారు. అప్పటికే పెట్టిన డబ్బు తీసుకోవడానికి యువత స్థోమతకు మించి అప్పులు చేస్తారు. నిర్వాహకులు చివరకు నష్టపోయేలా చేస్తారు.
Cricket Betting Gang Arrest : బెట్టింగ్ గ్యాంగ్‌లు డబ్బు ఇవ్వకపోతే సెక్స్‌టార్షన్, బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వేధింపులు తట్టుకోలేక కొందరు యువత నేరాల బాట పట్టడం లేదా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యల బారినపడుతున్నారు. అయితే పోలీసులు బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లను గుర్తించి వాటిని పనిచేయకుండా చేస్తున్నా కొత్త కొత్త పేర్లతో జనాలకు అందుబాటులోకి వస్తున్నాయి. రూ.10 వేలు ఇస్తే కొత్త యాప్‌లు తయారుచేసిచ్చే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. పోలీసులు ఎన్నిసార్లు గుర్తించి బ్లాక్ చేస్తున్నా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. సాంకేతికత ఆధారంగా పోలీసులు ప్రధాన సూత్రధారుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నా పట్టుబడడం లేదు. బుకీలు, సబ్ బుకీలు మాత్రమే చిక్కుతున్నారు.
Online Cricket Betting Apps : ఆన్‌లైన్ బెట్టింగ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆర్గనైజర్లు, బుకీలతో పాటు పందెం కాసే వారిపైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. బెట్టింగ్ యాప్ యూజర్ ఐడీలు, ఇతర సాంకేతికత ఆధారంగా గుర్తిస్తున్నారు. ఇటీవల సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదు ముఠాలకు చెందిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి సమాచారం ఆధారంగా సుమారు 581 పంటర్లు ఈ గ్యాంగ్‌ల వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా పందెం కాస్తున్నట్లు గుర్తించారు. వీరందరినీ త్వరలోనే గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు సైతం వారి పిల్లల్ని గమనిస్తుండాలని పోలీసులు చెబుతున్నారు. ఖర్చుల కోసం అధికంగా డబ్బు అడుగుతున్నా క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు ఇంట్లో కాకుండా ఏకాంతంగా ఇతర ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడటం కాని మ్యాచ్ జరిగేటప్పుడు విపరీతంగా ఫోన్లు మాట్లాడటటం కనిపెట్టాలి. కొన్నిసార్లు వాళ్ల స్థోమతకు మించిన వస్తువులు కొనుగోలు చేస్తే కచ్చితంగా అనుమానించాలని సూచిస్తున్నారు.
రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ - ఆగమవుతున్న యువత - online betting games and apps
బెట్టింగ్ ముఠాల ఆటకట్టిస్తున్న పోలీసులు - కోట్లలో నగదు స్వాధీనం - IPL Betting Racket Busted in Hyd