ETV Bharat / state

రామంతాపూర్​లో తొమ్మిదో అంతస్థు నుంచి దూకి మహిళా ఉద్యోగి ఆత్మహత్య - WOMAN COMMITS SUICIDE HYDERABAD

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో యువతి ఆత్మహత్య - డీఎస్‌ఎన్‌ మాల్‌ 9వ అంతస్థు నుంచి దూకి మృతి - డీఎస్‌ఎన్‌ మాల్‌లో కస్టమర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న హరిత

woman commits suicide In RAMANTHAPUR
young woman commits suicide In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 10:18 PM IST

young woman commits suicide In Hyderabad : హైదరాబాద్ రామంతాపూర్​లో యువతి ఆత్మహత్య కలకలం రేపింది. స్థానిక డీఎస్​ఎన్ మాల్​లో పనిచేస్తున్న 24 ఏళ్ల యువతి హరిత బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదే భవనంలో తొమ్మిదో అంతస్థులోని డీఎస్​ఎన్​ మాల్​లో క్లయింట్ సర్వీస్​ సొల్యూషన్స్​లో హరిత కస్టమర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్​గా పనిచేస్తోంది. తొమ్మిదో అంతస్థు నుంచి దూకడంతో గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న ఉప్పల్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. రామంతాపూర్​లో జరిగిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. మృతురాలి తండ్రి మాత్రం ఆర్థిక ఇబ్బందులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

BTech Student Committed Suicide : ఉద్యోగం పేరిట మోసం.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Young Woman Suicide at Lanco Hills : సినిమాల్లో అవకాశాల పేరిట కన్నడ నటుడి దారుణాలు.. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.