ETV Bharat / state

ఏపీ కేబినెట్​లో యంగ్ మినిస్టర్లు - తొలిసారి మంత్రి పదవిలో 17 మంది ఎమ్మెల్యేలు - YOUNG MINISTERS IN AP CABINET 2024

Young Ministers in AP CM Chandrababu Naidu Cabinet : ప్రభుత్వానికి ఫ్రెష్‌ లుక్‌ ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కేబినెట్‌ను యువరక్తంతో నింపేసింది. ప్రాంతాలు, వర్గాల వారీగా సమతూకం పాటిస్తూనే యువతకు, మహిళలకు అగ్రతాంబూలం అదించింది. మరోవైపు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీకి వెన్నెముకలా నిలిచిన బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఇన్ని సమీకరణాల మధ్య చాలామంది సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి కొత్తరూపు తెచ్చేందుకు టీడీపీ సాహసోపేత నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Young Ministers in Chandrababu Naidu Cabinet
Young Ministers in AP CM Chandrababu Naidu Cabinet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 9:45 AM IST

ఏపీ కేబినెట్​లో యువ'గళం' - తొలిసారి మంత్రి పదవిలో 17 మంది ఎమ్మెల్యేలు (ETV Bharat)

Young Ministers in Chandrababu Naidu Cabinet : ఉరకలెత్తే యువరక్తం, సామాజిక సమతూకం, అన్ని వర్గాలు, ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం, రాజకీయ ప్రత్యర్థుల్ని దీటుగా ఎదుర్కొనేవారికి గుర్తింపు, ఇలా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ కొత్త మంత్రివర్గం నవ యువశక్తితో, కొత్త రూపుతో కళకళలాడుతోంది. పాలనలో ఉత్సాహంతోపాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30 - 40 ఏళ్లపాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది.

టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మంత్రివర్గం అంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం! వారితో పాటు మరి కొందరు సీనియర్లకూ వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం. పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి.

1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ అధికారంలోకి వచ్చాక స్పీకర్‌గా పని చేసిన కాలంలో తప్ప, మంత్రివర్గంలో యనమల లేకపోవడం ఇదే మొదటిసారి. అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు కూడా మెజార్టీ సందర్భాల్లో మంత్రులుగా ఉన్నారు. ఈసారి అలాంటి పాతవారిని కేబినెట్‌లోకి తీసుకోకుండా, మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న పార్టీ అధినేత నిర్ణయం వెనుక దీర్ఘకాల వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు - తొలి 5 సంతకాలు ఆ దస్త్రాలపైనే - CHANDRABABU FIRST SIGN ON MEGA DSC

New and Young Ministers in Andhra Pradesh : ప్రస్తుత కేబినెట్‌లోని 24 మందిలో తొలిసారి మంత్రులైనవారు 17 మంది ఉన్నారు. అంతేకాదు తొలిసారి ఎన్నికైనవారు 10 మంది ఉన్నారు. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశమిచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు. ముగ్గురు మహిళలకు అవకాశమివ్వడంతో పాటు, వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో రెండు విధాలుగా ప్రాధాన్యమిచ్చినట్టయింది. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌ను, బీజేపీ నుంచి సత్యకుమార్‌ను కేబినెట్‌లో చేర్చుకోవడంతో పాటు టీడీపీ నుంచి తీసుకున్న 20 మందిలోనూ అత్యధికులు కొత్తవారు, యువత కావడంతో ప్రభుత్వం నవయవ్వన రూపం సంతరించుకుంది.

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే మంత్రివర్గ సభ్యుల్ని ఎంపిక చేసే క్రమంలో అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారని అర్థమవుతుంది. విజయనగరం జిల్లా నుంచి అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాస్‌ను ఎంపిక చేసినా, తూర్పుగోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్‌కు అవకాశమిచ్చినా పార్టీకి ఫ్రెష్‌ లుక్‌ తెచ్చే ప్రయత్నంలో భాగమే. ఇక డేషింగ్‌గా ఉండటం, రాజకీయ ప్రత్యర్థులకు ఘాటుగా బదులిచ్చే స్వభావం వంటివి వంగలపూడి అనితకు కలిసొచ్చాయి.

ఏపీ మంత్రివర్గంలో యువ మంత్రులు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరూ కొత్తవారికే అవకాశమిచ్చారు. జనసేన నుంచి నుంచి దుర్గేష్‌కు, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడికి అవకాశం వచ్చింది. ప్రకాశం జిల్లా నుంచి కేబినెట్‌లో చోటు దక్కించుకున్న గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామికి మొదటిసారి అవకాశం లభించింది. పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సవితకు అవకాశమిచ్చారు.

అలాగే వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అంగళ్లు, పుంగనూరుల్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరాచకానికి ఎదురొడ్డి నిలవడంతో పాటు పార్టీ కోసం ధైర్యంగా నిలబడి అనేక కేసులు ఎదుర్కోవడంతో పార్టీ దృష్టి రాంప్రసాద్‌రెడ్డిపై పడింది. కడప జిల్లా నుంచి అలాంటి నాయకత్వం కోసం పార్టీ చూస్తోంది. అక్కడ మంత్రి పదవిపై రాంప్రసాద్‌రెడ్డికి, మాధవీరెడ్డికి పోటీ నెలకొన్నా ప్రస్తుతానికి ఆయన వైపే పార్టీ మొగ్గు చూపింది. కర్నూలు జిల్లాలో సంప్రదాయంగా కేఈ, భూమా కుటుంబాల మధ్యే పోటీ ఉండేది. మంత్రివర్గంలో వారికే చోటు దక్కుతూ ఉండేది. ఈసారి ఆ రెండు కుటుంబాల్ని కాదని బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌లకు పార్టీ అవకాశమిచ్చింది.

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరైన ప్రముఖులు వీరే! - chandrababu took oath as AP cm

24 మందితో ఏపీ మంత్రుల జాబితా - డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - AP New Cabinet Ministers List

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.