Young Man Died By Chasing Dog in Hyderabad : వీకెండ్‌ను సరదాగా ఎంజాయ్ చేసేందుకు కొంతమంది యువకులు ఓ హోటల్‌కు వెళ్లారు. హోటల్‌లో చెక్ ఇన్ అయ్యి తమకు కేటాయించినా గదులకు వెళ్లేందుకు మూడో అంతస్తుకు వెళ్లారు. అంతే అక్కడ బాల్కనీ వద్దకు వెళ్లగానే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కుక్క ఇక దాంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. అనుకోని ఘటనతో వారి సరదా కాస్త విషాదాంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే!
Young Man Dies By Jumping Out OF Window : కుక్క తనవైపునకే రావడం చూసిన ఓ యువకుడు దాన్ని వెంబడించాడు. దాని వెంటనే పరుగులంకించారు. అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉదయ్ అనే అతను హోటల్ మూడో అంతస్తు కిటికీ నుంచి కింద పడిపోయాడు. దీంతో మిగిలినవారికంతా ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒక్కరుగా ఘటనా స్థలికి చేరుకుని తలలు బాదుకుంటూ బాధ పడ్డారు. ఇదీ సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. హైదరాబాద్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్ (23) ఉంటున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క కనిపించడంతో ఉదయ్ దాన్ని తరిమేందుకు యత్నించాడు.
ఈ క్రమంలో హోటల్ కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.హోటల్ మూడో అంతస్తులోకి కుక్క ఎలా వెళ్లిందనే విషయంపై వీవీ ప్రైడ్ హోటల్ యాజమాన్యం, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
40మందిని గాయపరిచిన వీధి కుక్కలు- బాధితులతో కర్నూలు ఆస్పత్రి కిటకిట - Dog Bite Cases In Kurnool