ETV Bharat / state

కిక్ బాక్సింగ్​లో సత్తా చాటుతున్న యువకుడు - అంతర్జాతీయ స్థాయిలో పతకాలు - young man excels in kickboxing - YOUNG MAN EXCELS IN KICKBOXING

Young Man Excels in Kickboxing of Guntur District : కుటుంబ బరువు బాధ్యతల్ని మోయడం కోసం చాలా మంది ఉద్యోగాల బాట పడతారు. ఆ తరువాత వివాహం, కుటుంబ బాధ్యతలు వెళ్తూ.. తమ ఆశయాలన్నింటినీ ఆవిరి చేసేస్తారు. కానీ, ఓ యువకుడు అందుకు భిన్నం. పెళ్లై పిల్లలు పుట్టినా తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ తన గమ్యానికి చేరువవుతున్నాడు. మరి, ఎవరా యువకుడు. అతని లక్ష్య సాధన ఎలా ఉందో మనమూ చూసెద్దామా.

Young_Man_Excels_in_Kickboxing_of_Guntur_District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 10:27 PM IST

Young Man Excels in Kickboxing of Guntur District : ఆశయం గొప్పదైతే అవకాశాలు దానంతట అవే వస్తాయి. దానికి కావల్సిందల్లా ఎంచుకున్న లక్ష్యం కోసం ఆహర్నిశలు కృషి చేయడమే అదే చేస్తున్నాడు ఓ యువకుడు. ఆశయ సాధన కోసం అలుపెరుగకుండా కష్టపడుతున్నాడు. గమ్యం చేరుకోవడం కోసం తన గమనాన్ని మార్చుకుని సాధన చేస్తున్నాడు. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు.

ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యం.. పవర్​ లిఫ్టింగ్​లో యువకుడి సత్తా

వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ ప్రతిరోజు శారీరక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాడు చలాది సతీష్‌ అనే యువకుడు. ఇతడు గుంటూరు జిల్లా సీతానగరంలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే కిక్‌బాక్సింగ్‌లోని కిటుకులను ఒక్కొక్కటిగా నేర్చుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నాడు.

International kickboxer in AP : మార్షల్‌ఆర్ట్స్‌లో రాణించలనేది సతీష్‌ చిన్ననాటి కళ తల్లిదండ్రులు వద్దని వారించినా యుద్ధవిద్యలు నేర్చుకోవాలనే తపనతో కరాటేలో ప్రావీణ్యం సంపాదించాడు. నలుగురిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కిక్‌ బాక్సింగ్‌ను ఎంచుకున్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ మందుకు సాగాడు. బ్రూస్‌లీ, తమ్ముడు వంటి సినిమాలు చూసి యుద్ధవిద్యలు నేర్చుకోవాలనే అసక్తి కలిగిందని సతీష్‌ చెబుతున్నాడు. 2021 గోవాలో జరిగిన జాతీయ కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించానని సతీష్‌ అంటున్నాడు. ఫిబ్రవరిలో వరల్డ్‌ ఆసోసియోషన్‌ ఆఫ్‌ కిక్‌ బాక్సింగ్‌ నిర్వహించిన ఓపెన్‌ ఇంటర్నేషనల్ కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో 2 రజత పతకాలు సొంతం చేసుకున్నాని చెబుతున్నాడు.

ఔషధాలపై అధ్యయనం.. ఆ యువతికి అమెరికా వర్సిటీ రూ.కోటి స్కాలర్​షిప్ ఆఫర్

యుద్ధవిద్యల్లో ప్రావీణ్యం సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. కోచ్‌ సహకారంతో పతకాలే లక్ష్యంగా నిత్యం శ్రమిస్తున్నాను. వివాహం అయిన తరువాత కిక్‌ బాక్సింగ్‌ అంటే ఇష్టమని భార్యకు చెప్పా, ఆమె సహకారంతోనే ముందుకు సాగుతున్నాన్నాను. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని పతకాలు సాధిస్తాను. స్థానిక యువతకు కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వడం కోసం అమరావతిలో అకాడమీ స్థాపిస్తాను. - చలాది సతీష్, కిక్ బాక్సింగ్‌ క్రీడాకారుడు

రెండేళ్ల కిందటివరకూ ఉద్యోగరిత్యా బెంగళూరులోనే ఉన్నాము. ప్రస్తుతం సొంతూరైన సీతానగరంలోనే ఉంటూ భర్త కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. సతీష్‌ అంతర్జాతీయ పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. - దమయంతి, సతీష్ భార్య

కిక్‌బాక్సింగ్‌లో రాణించాలంటే శారీరక బలంతో పాటు మానసికంగా దృఢంగా ఉండాలని సతీష్‌ కోచ్‌ అంటున్నారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పతకం తేవడమే తమముందున్న లక్ష్యమని చెబుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణిస్తున్న సతీష్‌ ఏషియన్‌ గేమ్స్‌, ఒలింపిక్స్‌లో దేశం తరపున్న ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నాడు.

అరెకపూడి సిస్టర్స్.. 16 ఏళ్లకే.. అమెరికాలో విభిన్న రంగాల్లో సంచలనాలు..

కిక్ బాక్సింగ్​లో సత్తా చాటుతున్న యువకుడు - అంతర్జాతీయ స్థాయిలో పతకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.