ETV Bharat / state

కౌలు రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా? - ఐదేళ్లుగా అప్పుల ఊబిలో రైతులు - Tenant farmers situation in AP - TENANT FARMERS SITUATION IN AP

YCP Govt Failed to Provide Welfare to Tenant Farmers : వైఎస్సార్సీపీ సర్కార్‌ పాలనలో కౌలురైతు చితికిపోయాడు. సాఫీగా సాగుతున్న పద్ధతికి స్వస్తి పలికిన సీఎం జగన్‌ కౌలుకార్డులంటూ కొత్త కష్టాలు తెచ్చిపెట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పంట రుణాల్లో సగం కూడా ఇవ్వకుండా చేతులెత్తేశారు. రైతులు ప్రాణాలు వదిలేసినా పట్టించుకోకుండా కౌలురైతుల పాలిట కారణజన్ముడిలా కథలు చెబుతున్నారు.

YCP Govt Failed to Provide Welfare to Tenant Farmers
YCP Govt Failed to Provide Welfare to Tenant Farmers (ETV BHARAT)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 3:44 PM IST

YCP Govt Failed to Provide Welfare to Tenant Farmers : గద్దెనెక్కింది మొదలు కౌలు రైతులను సీఎం జగన్‌ కష్టాల సుడిలోకి నెట్టారు. రాయితీ పథకాలకు చరమగీతం పాడి పెట్టుబడి సాయానికి పాతరేశారు. టీడీపీ హయాంలో 2019 వరకు భూమి యజమాని పట్టా పుస్తకం నకలు చూపించి వేలిముద్ర వేస్తే కౌలు రైతుకు రాయితీ విత్తనాలిచ్చేవారు. ఈ పథకానికి వైఎస్సార్సీపీ సర్కార్‌ ముగింపు పలికింది. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు ఏడాదికి రూ.4 వేల కోట్లకు పైగా పంట రుణాలిస్తే అందులో సగం కూడా ఇవ్వలేదు. రైతు భరోసా రూపంలోనే రూ.9639 కోట్లు ఎగ్గొట్టింది. మొత్తంగా సర్కార్‌ అస్తవ్యస్త విధానాల కారణంగా కౌలు రైతుల్లో సగటున 5శాతం మందికి కూడా పథకాలు అందడంలేదు.

కౌలు రైతు గోడు ప్రభుత్వానికి పట్టదా? సాగునీరు లేక బ్యాంకు రుణాలు రాక అవస్థలు

అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు : కౌలుదారుల్లో 95శాతానికి పైగా నిరుపేద కూలీలే. వ్యవసాయ పనులు చేస్తూ సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. ఎకరా కౌలుకు తీసుకుని సాగు చేస్తే పిల్లల చదువులకైనా ఉపయోగపడతాయనే ఆశ. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వారికి అప్పులే మిగులుతున్నాయి. వాటిని తీర్చడానికి మళ్లీమళ్లీ కౌలు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కౌలు రైతులు అధికంగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అప్పుల సేద్యం చేయలేక పెద్ద సంఖ్యలో కాడి పడేస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు జగన్‌ ప్రకటనలే తప్ప ఆచరణ అంతంతమాత్రమే.

పంట నష్టపోతే పెట్టుబడి సాయం అందని ద్రాక్షే : కౌలు రైతులకు 11 నెలల కాలానికి పంట సాగుదారు హక్కు కార్డులు ఇచ్చి ప్రభుత్వ ప్రయోజనాలన్నీ వర్తింపజేస్తామంటూ 2019లో జగన్‌ సర్కారు ప్రత్యేక చట్టం తెచ్చింది. కానీ వారికి కార్డులు ఇవ్వడానికి అనేక కొర్రీలు పెట్టింది. పదేళ్ల కిందటి లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. ఇందులో కౌలు రైతులు కార్డులు అందుకునే వారు సగటున ఏడాదికి ఐదు లక్షల మంది మాత్రమే. అందులోనూ ఎకరమో అర ఎకరమో భూమి ఉన్న వారే అధికం. దాంతో సొంతభూమిపై దక్కే ప్రయోజనాలనే కౌలు కార్డుల కింద ఇచ్చినట్లు చూపిస్తున్నారు. కార్డులు అందకపోవడంతో లక్షల మంది కౌలు రైతులకు రాయితీ విత్తనాలను, పంట రుణాలను ఇవ్వడం లేదు. సున్నా వడ్డీని దూరం చేస్తూ రైతు భరోసాకు మొండిచేయి చూపిస్తున్నారు. పంట నష్టపోతే పెట్టుబడి సాయం అందని ద్రాక్షగానే మారింది. పంటల బీమాను వర్తింప చేయడంలేదు. అష్టకష్టాలు పడి పండించిన దిగుబడులను అమ్ముకోవడానికి వస్తే కార్డు లేదంటూ తిరస్కరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం ఇచ్చేందుకు కూడా వైఎస్సార్సీపీ సర్కార్‌కు చేతులు రావడం లేదు.

Andhra Pradesh Tenant Farmers in Dire Situation: అర్హత కలిగిన కౌలు రైతులకు అందని పెట్టుబడి సాయం

కౌలురైతులను పట్టించుకునే నాథుడే లేడు : రాష్ట్రంలో 15లక్షల 36వేల మంది మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని 2019లో సీఎం జగన్‌ లేఖలు రాశారు. ఆయన మాటల ప్రకారమే ప్రతి రైతు కుటుంబానికి 13500 రూపాయల చొప్పున ఏడాదికి రూ.2073 కోట్లు, ఐదేళ్లకు రూ.10365 కోట్లు ఇవ్వాలి. కానీ, రాష్ట్రంలో మొత్తం 24 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఏడాదికి సరాసరిన 1,07,627 మందికి చొప్పున ఐదేళ్లలో రూ.726 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతుబిడ్డనని చెప్పే జగన్‌ కౌలు రైతులకు 9639 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. పైగా ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం దేశ చరిత్రలోనూ ఎక్కడా లేదంటూ గొప్పలు చెప్పారు. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ సీసీఆర్‌సీ కార్డు అందుబాటులో ఉంటుందన్న జగన్‌ హామీ నీటిమీద రాతే అయింది. అక్కడకు పోతే పట్టించుకునే వారే లేరు. పైగా కులాల కుంపట్లు రాజేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేశారు. వారిలోనూ అందరికీ సాయం చేయలేదు. ఏడాదికి 80 వేల మంది అటవీ భూముల హక్కుదారులకు రూ.108 కోట్ల చొప్పున రైతు భరోసా ఇస్తున్నారు. అదీ వాస్తవ సాగుదారులకు దక్కడం లేదు. అధిక శాతం మందికి మొండి చేయి చూపిస్తున్నారు.

సున్నా వడ్డీ ఊసే లేదు : జగన్‌ అధికారంలోకి వచ్చాక అయితే వరదలు లేదంటే కరవు వేధిస్తున్నాయి. దీనికి పెట్టుబడి సాయంగా సగటున ఎకరానికి 4 వేల నుంచి 5 వేలు ఇస్తున్నారు. ఈ కొద్దిపాటి మొత్తానికి కూడా కౌలు రైతులు అర్హులు కాలేకపోతున్నారు. ఐదేళ్ల పాలనాకాలంలో జగన్‌ సర్కారు రైతులకు ఇచ్చిన మొత్తం పెట్టుబడి రాయితీ రూ.3261 కోట్లు. ఇందులో 2లక్షల 41వేల 453 మంది కౌలు రైతులకు దక్కింది 253 కోట్లు మాత్రమే. ఇది 7.75శాతం మాత్రమే కావడం జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యాన్ని నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ఏడాదికి 1.48 లక్షల కోట్ల పంట రుణాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో కనీసం 50శాతం విస్తీర్ణంలో కౌలు రైతులే పంటలు వేస్తున్నారనుకున్నా 74 వేల కోట్ల రుణాలు వారికే దక్కాలి. వాస్తవానికి ఇలా జరగడంలేదు. దీంతో అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు తెచ్చుకుని, వారంతా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. 2019-20 సంవత్సరంలో 2వేల 304 కోట్లు ఇవ్వగా తర్వాత ఏడాది వెయ్యికోట్ల రూపాయలకే పరిమితం చేశారు. 2021-22 లో రూ.1,744 కోట్లు, 2022-23లో రూ.1,566 కోట్లు, 2023-24లో రూ.1,675 కోట్ల రూపాయల రుణాలే కౌలు రైతులకు దక్కాయి. సున్నా వడ్డీ గురించి మాటే లేదు.

కౌలు రైతుల గోడు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పట్టదా? - ఐదేళ్లుగా అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు (ETV BHARAT)

కౌలు రైతులను కష్టాల ఊబిలోకి నెట్టిన జగన్ : జగన్‌ అధికారంలోకి వచ్చాక పంటల బీమాను అంతుచిక్కని రహస్యంగా మార్చేశారు. నిబంధనలేమిటో, నిపుణులెవరో, ఎవరికిస్తున్నారో చెప్పే వారే ఉండదు. కౌలు రైతుల విషయంలో మరింత మోసం చేశారు. నాలుగేళ్లలో పంటల బీమా పరిహారంగా మొత్తం రూ.7087 కోట్లు చెల్లిస్తే అందులో 3లక్షల 54వేల 378 మంది కౌలు రైతులకు దక్కింది రూ.731 కోట్లు మాత్రమే. సాగు చేస్తున్న మొత్తం భూవిస్తీర్ణంలో సగం పండిస్తున్న వీరికి బీమా పరిహారంలో ఇస్తున్న వాటా 10శాతమే. అంటే పథకం వర్తించే వారు ఏడాదికి సగటున 88 వేల మందే. పెట్టుబడి సాయానికీ అర్హులు కారట. ఇలా మొత్తంగా ఐదేళ్ల పాలనలో కాలంలో జగన్‌ సర్కార్ కౌలురైతులను కష్టాలు ఊబిలోకి నెట్టింది.

YSRCP Leader Attack on Farmer: భూ వివాదం.. కౌలురైతుపై వైఎస్సార్సీపీ నేత కత్తులతో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.