Yarapathineni Srinivasa Rao: తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన "బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమాన్ని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాస రావు ఆయన నియోజకవర్గంలో నిర్వహించారు. మాడుగుల గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, మహిళ, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత, బలోపేతంతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని వివరించారు.
చంద్రబాబు ప్రకటించిన తొలి ఏజెండా "భవిష్యత్తు గ్యారెంటీ" మ్యానిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. ప్రజలను చైతన్యవంతం చేసి, 2024లో టీడీపీని అధికారంలోకి తీసుకువస్తామని వివరించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా 'టీడీపీ - జనసేన' 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
మాడుగుల గ్రామంలో ఇంటింటికి తిరిగి "భవిష్యత్తు గ్యారెంటీ" మ్యానిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించి, 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చెయ్యాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలను కోరారు.
రానున్న 5 సంవత్సరాలలో టీడీపీ ప్రకటించిన మ్యానిఫెస్టో ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఆదాయం అందబోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామస్థులను భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో నమోదు చేయించి, గ్యారెంటీ కార్డును ఆయా కుటుంబ సభ్యులకు అందించారు.
'బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ' - వైసీపీని వీడిన 110 కుటుంబాలు
YSRCP Leaders Joining in TDP వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె గ్రామంలో "బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై గ్రామ మాజీ సర్పంచ్‌తో పాటు 35కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహరెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒక్క ఛాన్స్ అంటే జగన్‌కు ఓటు వేసి మోసపోయామని, ఇక నుంచి తెలుగుదేశానికే తమ ఓటు అని మహిళలు తెలిపారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే సైకో పోవాలి సైకిల్ రావాలి అని అన్నారు.
న్యాయం చేయాలంటూ 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ'లో మహిళ ఆవేదన