ETV Bharat / state

దాతల సహకారంతోనే తెలుగు మహాసభలు విజయవంతం : గుత్తికొండ సుబ్బారావు - WORLD TELUGU WRITERS CONFERENCE

తెలుగు మహాసభలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన నిర్వాహకులు - దేశం నలుమూలల నుంచి ఎంతో మంది రచయితలు వచ్చారని వెల్లడి

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 3:45 PM IST

World Telugu Writers Conference : తెలుగు మహాసభలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి సభలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలని, వారిని సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు తెలిపారు. ఆదివారం రామోజీరావు సభా వేదికపై మహాసభల విజయానికి సహకరించినటువంటి వారిని ఘనంగా సత్కరించారు.

తెలుగు మహాసభలు విజయవంతం : అనంతరం గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ ధనం ఉంటేనే బలమని, ఏదైనా కార్యక్రమం సజావుగా జరగాలంటే ధనమే మూలమన్నారు. తెలుగు మహాసభలకు విచ్చేసిన వారికి వదాన్యులు ఆర్థికంగా సహకరించడంతో విజయవంతం అయ్యాయని ఆయన తెలిపారు. మహాసభల ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జీవీ పూర్ణచందు మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి ఎంతో మంది రచయితలు వచ్చి వారి వారి కవిత్వాలు చదివారని, వారంతా సంతోషంగా పాల్గొనేందుకు ముఖ్య కారణం దాతలనేని వివరించారు.

తెలుగు మహాసభలకు మొత్తం 44 మంది వదాన్యులను ఆహ్వానించగా, 20 మందికి పైగా హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. వారందరినీ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మహాసభల గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్‌లు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

తెలుగువారి సంఖ్యను కావాలనే తగ్గించి చూపుతున్నారు : తమిళనాడు, మహారాష్ట్ర కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారి జనాభాను కావాలనే తగ్గించి చూపిస్తున్నారని రాష్ట్రేతర తెలుగువారు ఆందోళన వ్యక్తం చేశారు. జనగణనలోనూ లోపాలున్నాయని వారు ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సుమారు 30 శాతం వరకు తెలుగువారు ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 5.6 శాతమే ఉన్నట్టు ఏవిధంగా చెబుతారని వారు ప్రశ్నించారు.

World Telugu Writers Conference
ఇతర రాష్ట్రాల ప్రతినిధుల సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్రేతరాంధ్రుల సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు. (ETV Bharat)

వివిధ రాష్ట్రాల్లోని తెలుగు సంఘాలను సంప్రదించి, భావితరాలకు తెలుగు నేర్పించడం కోసం ఏకీకృత సిలబస్‌తో పుస్తకాలు తయారు చేయడంతో పాటు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించనున్నట్లుగా రాష్ట్రేతరాంధ్రుల సమాఖ్య ప్రతినిధులు వెల్లడించారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా రాష్ట్రేతరాంధ్రుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్​. సుందరరావు అధ్యక్షతన ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రతినిధుల సదస్సును నిర్వహించారు.

"వందల ఏళ్లుగా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు వాసులు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. సుందరరావు క్రమంగా సుందరరామన్‌గా, రాధాకృష్ణ రాధాకృష్ణన్‌గా మారిపోతున్నారు. బంగాల్​లో సిర్థపడినటు వంటి తెలుగువాళ్లు ముప్పై ఏళ్ల కిందటి వరకూ తెలుగు మాధ్యమంలోనే విద్యనభ్యసించారు. అక్కడ ఎన్నో బడుల్ని మనవాళ్లు నిర్మించి, నిర్వహించారు. ఇటీవల ఆంగ్ల చదువులపై మోజుతో తెలుగు మాధ్యమంలో పిల్లల్ని చేర్పించడం లేదు. చాలా తెలుగు బడులు మూతపడినాయి. అయినప్పటికీ అక్కడ ఇప్పటికీ 12వ తరగతి వరకు తెలుగు ఓ పాఠ్యాంశంగా కొనసాగుతోంది"- ఆర్‌.సుందరరావు, ఖరగ్‌పుర్‌

'భవిష్యత్ తరాలకు అమ్మభాషను అందిద్దాం' - ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో వక్తల పిలుపు

తెలుగు మాధ్యమ విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి : తెలుగు రచయితలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.