ETV Bharat / state

అమరావతికి రూ.15000 కోట్లు- పూర్తి బాధ్యత కేంద్రానిదే! - World Bank Loan to Amaravati - WORLD BANK LOAN TO AMARAVATI

World Bank Rs 15,000 Crore Loan to Amaravati: ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ పంపింది. నవంబరు 15 నాటికి ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది. ఆ వెంటనే అడ్వాన్స్‌గా రూ.3,750 కోట్లు తీసుకోవచ్చు. నవంబరులో ఆ నిధులు వస్తే డిసెంబరు నుంచి పనులు మొదలు పెట్టాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది.

World Bank Rs 15000 Crore Loan to Amaravati
World Bank Rs 15000 Crore Loan to Amaravati (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2024, 9:53 AM IST

World Bank Rs 15,000 Crore Loan to Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కిరాబోతోంది. రాజధాని అమరావతికి రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది.

రూ.49వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా : ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం రూ.15వేల కోట్లూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సీఆర్‌డీఏ (CRDA)కి అందనున్నాయి. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌ల అభివృద్ధి, పరిపాలన నగరంలో శాసన సభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు రూ.49వేల కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ తాజాగా అంచనా వేసింది. రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండడంతో దానికి అనుగుణంగా సీఆర్‌డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రాజధానిలో ముగిసిన ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ బృందం పర్యటన - అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం!

నవంబరులో నిధులు - డిసెంబరు నుంచి పనులు మొదలు! : ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులు అన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం 3,4 దఫాలు రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంకు, సీఆర్‌డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగనుంది. నవంబరు 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తైతే రూ.15 వేల కోట్లు మంజూరైనట్టే! ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే రూ.3,750 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. నవంబరులో ఆ నిధులు వస్తే డిసెంబరు నుంచి పనులు మొదలు పెట్టాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది.

3 నెలల్లోనే ప్రక్రియలన్నీ పూర్తి : ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ రుణ వితరణ సంస్థలు ఒక ప్రాజెక్టుకు ఇంత వేగంగా రుణం మంజూరు చేయడం రికార్డు! ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు నిర్దిష్ట ప్రాజెక్టులకు రుణాలు ఇస్తాయి. ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణం, సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ సంతృప్తికరంగా ఉందా? వంటి అంశాలు అన్నీ కూలంకషంగా అధ్యయనం చేశాకే రుణం ఇస్తాయి. సంప్రదింపులకే సంవత్సరం పడుతుంది.

అలాంటిది రాజధాని అమరావతికి రుణం మంజూరు ప్రక్రియను ఆగస్టు 20న ప్రారంభించి నవంబరు నాటికి కొలిక్కి తెస్తోంది. 3 నెలల్లోనే అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని, రుణం మంజూరు చేస్తుండడం విశేషం. 2019కి ముందు రాజధాని నిర్మాణానికి రూ.3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చి, అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసింది. 2019లో వచ్చిన జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధానికి రుణం అవసరం లేదని కేంద్ర ఆర్థికశాఖ ద్వారా ప్రపంచ బ్యాంకుకు చెప్పడంతో ఆ ప్రక్రియ నిలిచి పోయింది.

'జల్​జీవన్​'కు జవసత్వాలు- రాష్ట్రంలో తాగునీటి​ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు - World Bank on Irrigation Projects

90 శాతం కేంద్రం -10 శాతం రాష్ట్రం భరిస్తుంది : కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వాములే అధికారంలో ఉండడంతో అమరావతికి గ్రహణం వీడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.15వేల కోట్ల రుణం అందిస్తామని తాజా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. అక్కడి నుంచి రుణం మంజూరుకు అవసరమైన పరిణామాలన్నీ శరవేగంగా జరిగాయి. రాజధానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇస్తోంది పేరుకు రుణమే అయినా అది రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాబోదు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తోంది.

ఈ రుణంపై 15 సంవత్సరాల పాటు మారటోరియం ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ కూడా 4%లోపే ఉంటుంది. పైగా ఆ రుణంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% చొప్పున భరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 10% నిధుల్ని కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

'2024లో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.5%' - ప్రపంచ బ్యాంక్ అంచనా - Indian Economy Growth Rate 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.