ETV Bharat / state

ఆమె నాట్యానికి నటరాజు మైమరిచాడు - వెండితెర ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలికింది - WOMENS DAY 2024

WOMENS DAY 2024 : ఆమె కళ్లు వేల భాషలు పలకగలవు. అభినయం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులై పోవాల్సిందే. కేవలం తన నాట్యంతోనే కాదు. ఇతర కళల్లోనూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంటోంది ఆ యువతి. దేశ విదేశాల్లో వేల ప్రదర్శనలిచ్చి గిన్నిస్‌ సహా ఎన్నో అవార్డులూ, రివార్డులూ సొంతం చేసుకుంది. ఇటీవలే ప్రముఖ నటి జయప్రదతో కలసి లవ్ ఎట్ 65 అనే సినిమాలో కీలకపాత్రలో నటించిన ఆ యువ కళాకారిణి కథనమేంటో మీరూ చూసేయండి.

Love At 65 Telugu Movie Actress Nihanthri

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 12:34 PM IST

ఆమె నాట్యానికి నటరాజు మైమరిచాడు - వెండితెర తివాచీ పరిచిమరీ స్వాగతం పలికింది

WOMENS DAY 2024 : బహుళజాతి సంస్థలో లక్షల వేతనంతో ఉద్యోగం వచ్చినా కాదనుకుంది నిహంత్రి. చిన్నప్పటి నుంచీ ప్రాణప్రదంగా అభ్యసించిన నాట్యమే జీవిత గమ్యంగా భావించింది. కూచిపూడిని భావితరానికి అందించడమే ధ్యేయంగా చేసుకుంది. వందలాది చిన్నారులకు నృత్య పాఠాలు బోధిస్తూనే... ఇటీవలే సినీనటిగానూ ప్రస్థానం మొదలుపెట్టింది ఈ హైదరాబాదీ.

Love At 65 Telugu Movie Actress Nihanthri : స్వామి రారా అంటూ కళ్లు, ముఖకవళికలతోనే అద్భుత హావభావాలు పలికిస్తున్న ఈ యువతి పేరు నిహంత్రి రెడ్డి. హైదరాబాద్‌కి చెందిన నిహంత్రి ఐదేళ్ల ప్రాయంలో ఉండగా కూచిపూడి నృత్య అకాడమీలో అడుగుపెట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి కూచిపూడిలో మాస్టర్స్‌తో పాటుబీబీఏ పూర్తిచేసింది. తండ్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేసే సమయంలో తొలిసారి నృత్యప్రదర్శన ఇచ్చింది.

Kuchipudi Dancer Nihanthri Reddy : ఊహ కూడా సరిగా తెలియని వయసులోనే నాట్యాన్ని అభ్యసించడం ఆరంభించిన నిహంత్రితన 16వ ఏట హైదరాబాద్ రవీంద్రభారతిలో కూచిపూడిలో అరంగేట్ర ప్రదర్శన చేసింది. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు. ప్రముఖ నృత్యకారిణి శోభానాయుడు వద్ద కొంతకాలం శిక్షణ తీసుకుని నృత్యంలో మరిన్ని మెళకువలు నేర్చుకుంది.

Kuchipudi Dancer Chandana Warangal: పదిహేనేళ్లకే 250 ప్రదర్శనలు.. 20కి పైగా బిరుదులు

దేశవిదేశాల్లో కలిపి ఇప్పటి వరకు దాదాపు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది నిహంత్రి రెడ్డి (Hyderabad Kuchipudi Dancer Nihanthri Reddy) . సంగీతంతో పాటు తబలా, వీణాలాంటి వాయిద్యాలపైనా పట్టు సాధించింది. కళల్లోనే కాక షూటర్‌గానూ సత్తా చాటి బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఓ బహుళజాతి సంస్థలో లక్షల వేతనంతో కొలువు వచ్చినా వదులుకుని కూచిపూడి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంపైనే దృష్టిసారించింది.

హోలిక దహనం, చండాలి, నవరస నట భామిని, సర్వం సాయిమయం వంటివి నిహంత్రికి మంచి పేరు తీసుకొచ్చాయి. తన నాట్యప్రతిభతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్త్రీ శక్తి అవార్డు, నాట్యమంజరి అవార్డూ అందుకుంది. తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సహా లిమ్కా, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటూ దక్కించుకుంది.

Dancer Nihanthri Reddy In Love At 65 Telugu Movie : నిజమైన కళాకారులు కళను తమతో అంతం కానివ్వరని భవిష్యత్తు తరాలకు ఆ కళను అందజేస్తారని బలంగా నమ్ముతుంది నిహంత్రి. అందుకే అక్షతా పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ స్థాపించి చిన్నారులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తోంది. హైదరాబాద్ కి చెందిన వారికే కాక విదేశీయులకూ ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన చిన్నారులకూ నృత్యపాఠాలు నేర్పుతూ.. కూచిపూడి విస్తృతికి పాటుపడుతోంది.

చాన్నాళ్ల క్రితమే సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా పెద్దగా ఆసక్తి చూపలేదు నిహంత్రి. కానీ ఇటీవల జయప్రద, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన లవ్‌ ఎట్ 65 అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. కూచిపూడి అభ్యున్నతికి పాటుపడటమే తన తొలి ప్రాధాన్యం అని చెబుతుంది నిహంత్రి.కళను అభ్యసించే హక్కు అందరికీ సమానమే అని తన భావన అని అందుకు తగినట్టుగా వీలైనంత మంది పేద పిల్లలకు ఉచితంగా కూచిపూడి నేర్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నానని అంటోంది.

Dancer Ravi Kumar: రవి ఆటకు నృత్యమే మైమరచిపోయింది.. 10 వేల మందికి...

Peesapati Likitha : యువ 'మయూరి'.. పీసపాటి లిఖిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.