Women and Child Welfare Office Staff Dharna in Hyderabad : మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో తమ సిబ్బందిని అకారణంగా తొలగించారని ఆరోపిస్తూ ఆయా వర్కర్స్ విధులు బహిష్కరించి హైదరాబాద్ మధురానగర్‌లో ధర్నా చేపట్టారు. మూడు రోజుల క్రితం మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో ఇద్దరు పిల్లలు గొడవపడి కొట్టుకోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అధికారులు కొందరిని విధుల నుంచి బహిష్కరించారు.
తమ సిబ్బంది తప్పు లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుబట్టిన ఆయా వర్కర్స్, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము విధులు బహిష్కరించి, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా తమ కార్యాలయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని ఆయా వర్కర్స్ కోరారు.
మాకు చదువే రాదు.. పరీక్ష ఎలా రాయాలి: ఆశా కార్యకర్తలు
ఈ సందర్భంగా కార్యాలయ ఆయా వర్కర్స్ మాట్లాడుతూ శిశు సంక్షేమ కార్యాలయంలో పిల్లలను చూసుకునే బాధ్యత తమదేనని, తమ పిల్లల మాదిరి ఇక్కడ ఉన్న పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నామని తెలిపారు. కొంత మంది అధికారులు తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పులేకుండానే కొందరిని విధుల నుంచి తొలగించారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తాము కూడా విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా కార్యాలయంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని, తమ సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకుని, తమకు న్యాయం చేయాలని ఆయా వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
''మాకు చాలా అన్యాయం జరుగుతుంది. పిల్లలను మా పిల్లల్లాగా ప్రేమగా చూసుకుంటున్నాం. కొంతమంది సిబ్బందిని అకారణంగా తొలిగించారు. ఇద్దరు పిల్లలు గొడవపడి కొట్టుకోవడంతో వారికి గాయాలయ్యాయి. దానికి బాధ్యులుగా సిబ్బందిని విధుల నుంచి తొలగించడం అన్యాయం. మా సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అలా చేయని పక్షంలో ఈ పోరాటం పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తున్నాం." - ఆయా వర్కర్స్, మహిళా శిశు సంక్షేమ కార్యాలయం
Asha Workers Protest : కనీస జీతాలు చెల్లించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసనలు