ETV Bharat / state

సరదాగా ఎంజాయ్ చేద్దామని శిల్పారామం వెళ్లిన యువతి - క్రాస్‌వీల్‌ నుంచి పడి అక్కడికక్కడే మృతి - WOMAN DIES FALLING FROM CROSSWHEEL

తిరుపతి జిల్లాలో విషాదం - సరదా తీసిన ప్రాణం - క్రాస్‌వీల్‌ నుంచి పడి యువతి మృతి - మరొకరికి తీవ్రగాయాలు

Woman Dies After Falling From Crosswheel
Woman Dies After Falling From Crosswheel (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 7:04 AM IST

Updated : Nov 4, 2024, 7:09 AM IST

Woman Dies After Falling From Crosswheel : సరదా కోసం ఎక్కిన క్రాస్‌ వీల్ ఒకరి ప్రాణాలను బలి తీసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లా తిరుచానూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు, తిరుపతికి చెందిన లోకేశ్వరి, గౌతమి స్నేహితులు. ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు శిల్పారామానికి వెళ్లారు. అక్కడ కలిసి తిరిగారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న క్రాస్‌ వీల్‌ ఎక్కారు.

అది తిరుగుతుండగా వీరు కూర్చున్న సీటు ఒక్కసారిగా దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ఊడి కింద పడింది. దీంతో లోకేశ్వరి తీవ్ర గాయాలతో ఘటనా స్థలిలోనే మృతి చెందారు. గౌతమి తీవ్ర గాయాలతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుర్చీలో ఒకరే కూర్చోవాల్సి ఉండగా, ఇద్దరు కూర్చున్నారు. పైగా అది తుప్పు పట్టి ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్రాస్‌ వీల్‌ కుర్చీలన్నీ దాదాపు తుప్పు పట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి బాధ్యుడిని చేస్తూ నిర్వాహకుడు ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు.

Woman Dies After Falling From Crosswheel
క్రాస్‌ వీల్‌ నుంచి ఊడిపోయిన సీటు (ETV Bharat)

Last Updated : Nov 4, 2024, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.