Victims Family Protest At Hospital in Eluru District : ఏలూరు జిల్లా T. నరసాపురం మండలం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బాలింత అలివేలు చనిపోవడంతో స్థానిక గ్రామస్థులు చలించిపోయారు. పది రోజుల క్రితం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇవాళ కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు టి. నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే, అప్పటికి పరిస్థితి చేజారిపోవడంతో ఆ బాలింత మృతి చెందింది. అలివేలుకు సకాలంలో వైద్యం అందక చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. అలివేలు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు అక్కడకి చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు.
Woman Dies 10 Days After Delivery in Andhra Pradesh : టి.నర్సాపురం మండలం ప్రకాశ్‌నగర్‌కు చెందిన వగ్గిన రాము, అలివేలును ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం వారు పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ నుంచి ఇటీవలె సొంత గ్రామానికి వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వేళ వగ్గాల అలివేలు (23) జూలైలో బాబుకు జన్మనిచింది. ఆగష్టు 5న సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకుంది. ఉదయం బాబుకు పాలు ఇస్తుండగా అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడంతో భర్త రాము, కుటుంబసభ్యులు టి.నర్సాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వచ్చారు.
ఆ సమయంలో ఆస్పత్రిలో సిబ్బంది లేక అలివేలుకు ప్రాథమిక వైద్యం అందక చనిపోయిందని భర్త రాము ఆవేదన వ్యక్తం చేసాడు. వైద్యులు సకాలంలో స్పందించకపోవటంతోనే ఆమె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసుపత్రి వద్ద మృతురాలి బందువులు ఆందోళన బాట పట్టారు. టి.నర్సాపురం పోలీసులు అక్కడ కి చేరుకుని మృతిరాలి బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
హైదరాబాద్‌లో దారుణం - కాగితాలు ఏరుకునే మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం - Two Persons Raped A Woman
ఓ వైపు నెలలు కూడా నిండని బిడ్డ తల్లి లేనివాడయ్యాడనే బాధ. మరోవైపు జీవితాంతం తోడుండాల్సిన భార్య ఇలా కన్నుమూయడంతో రాము కన్నీరు మున్నీరుగా విలపించాడు. అతడిని చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. అసలు బాలింత ఎందుకు ఉన్నపాటుగా సృహ కోల్పోయిందనే విషయాలు తెలియాల్సిఉంది.
"ఓ మహిళకు స్పృహ లేకుండా ఉందని ఉదయం 4:27కి ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. సీపీఆర్ చేసిన స్పందన లేదని తెలిపారు. వెంటనే వస్తున్నానని సిబ్బందికి సమాచారం ఇచ్చాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏం చేయాలో అన్ని చేశాం. మా సిబ్బంది సైతం మహిళ పరిస్థితి చూసి వెంటనే స్పందించారు. మా వైపు నుంచి ఎటువంటి పోరపాటు జరగలేదు." - కల్పనారాణి, వైద్యురాలు