Woman Died After Drinking Contaminated Water: గుంటూరు నగరంలో కలుషిత నీరు ఓ యువతి ప్రాణాలు తీసింది. శారదాకాలనీకి చెందిన 18 ఏళ్ల పద్మ అనే యువతి కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలైంది. పద్మను ఇవాళ ఉదయం గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. శారదాకాలనీతో పాటు శ్రీనగర్ కాలనీ, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన మరి కొందరు బాధితులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం సంగడిగుంటకు చెందిన ఓబులు అనే వ్యక్తి డయేరియాతో మరణించాడు.
వెంటాడుతున్న తాగునీటి సమస్య- జాతీయ రహదారిపై గ్రామస్థుల ఆందోళన
గత వారం పది రోజుల నుంచి నగరంలో కలుషిత నీటి సమస్య ఉన్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదు. పైపు లైన్లు పాడైపోయిన చోట కొత్తవాటిని వేయడం లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయడంలో ఉదాసీనంగా ఉండటం వల్లే తాగునీరు కలుషితమవుతోందని నగర వాసులు అంటున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలుగుదేశం పరామర్శించారు. ప్రభుత్వ వైఖరిని వారు తప్పుబట్టారు. నగరంలో కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
డయేరియా బాధితులతో మాట్లాడారు. నగరంలో కొద్ది రోజులుగా కలుషిత నీరు వస్తున్నా యంత్రాంగం స్పందించలేదని ఆరోపించారు. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే మరణాలు సంభవించేవి కాదన్నారు. శ్రీనగర్, సంపత్ నగర్, నెహ్రూనగర్, సంగడిగుంట, శారదా కాలనీ ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ఎక్కువగా కనిపిస్తోందన్నారు. డయోరియా బాధితులను నగరపాలక కమిషనర్ పరామర్శించిన చేకూరి కీర్తి పరామర్శించారు.
పైపులైన్ల లీకులతో ఇబ్బందులు- కలుషిత నీటితో అల్లాడుతున్న ప్రజలు
Janasena Leaders Protest at GGH: గుంటూరు నగరంలో కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు చోద్యం చూస్తున్నారని జనసేన నేతలు విమర్శించారు. జీజీహెచ్‌కు వచ్చిన జనసేన నేతలు నేరెళ్ల సురేష్, ఆళ్ల హరి పద్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. డయేరియా బాధితులతో మాట్లాడారు. వైద్యులను కలిసి మంచి చికిత్స అందించాలని కోరారు. నగరంలో కొద్ది రోజులుగా కలుషిత నీరు వస్తున్నా యంత్రాంగం స్పందించలేదని ఆరోపించారు. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే మరణాలు సంభవించేవి కాదన్నారు.
గుంటూరు వాసులకు నీటి కష్టాలు తప్పవా - అధికారులు పట్టించుకోరా!
శ్రీనగర్, సంపత్ నగర్, నెహ్రూనగర్, సంగడిగుంట, శారదా కాలనీ ప్రాంతాల్లో కలుషిత నీట సమస్య ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో 9మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది గుంటూరు నగరానికి చెందిన వారే శారదా కాలనీకి చెందిన ముగ్గురు బాధితులు జీజీహెచ్‌లో ప్రాథమిక చికిత్స తీసుకుని ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లిపోయారు.